Weekly Horoscope : నేటి పంచాగం, ఏప్రిల్ 30 నుండి మే 6 వరకు వారఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ఎదుటివారితో పొట్లాటలకు దూరంగా ఉండాలి. దంపతులు విడాకులకు..

Update: 2023-04-30 04:26 GMT

april 30th to may 6 horoscope, daily horoscope in telugu

నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, ఆదివారం

తిథి : శు.దశమి రా.8.29 వరకు
నక్షత్రం : మఖ మ.3.29 వరకు
వర్జ్యం : రా.12.16 నుండి 2.01 వరకు
దుర్ముహూర్తం : సా.4.41 నుండి 5.31 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.11.00 నుండి 11.45 వరకు
నవగ్రహ సంచారం
మేషం - రవి, బుధుడు, గురువు, రాహువు
వృషభం, మిథునం - శుక్రుడు
మిథునం - కుజుడు
తుల - కేతువు
చంద్రగ్రహ సంచారం
సింహం, కన్య, తుల
ఏప్రిల్ 30 నుండి మే 6 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఎక్కడ ఏ తప్పు జరిగినా మిమ్మల్నే బాధ్యుల్ని చేసే అవకాశాలు ఎక్కువ. చిన్న చిన్న ఒడిదుడుకులు మినహా.. శుభకార్యాలు, బాధ్యతల పరంగా పెద్దగా ఇబ్బందులుండవు. ఈ వారం మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి..
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ప్రతి విషయాన్నీ తేలికగా తీసుకుంటారు. భగవంతుడి ఉపవాసం చేసేవారికి నీరసం పెరుగుతుంది. ఉద్యోగులు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకపోవడం మంచిది. ప్రయాణాలు, విహార, వినోద కార్యక్రమాలు, ఆధ్యాత్మిక చింతన మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఈ వారం గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సుబ్రహ్మణ్య అష్టకాన్ని యధాశక్తిగా పారాయణ చేయాలి.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ఎదుటివారితో పొట్లాటలకు దూరంగా ఉండాలి. దంపతులు విడాకులకు దూరంగా ఉంటే రానున్న కాలం అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. వేడి చేసే పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. ఈ వారం ఆది, సోమ వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్ని సార్లు హనుమాన్ చాలీసాను పారాయణ చేయాలి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులను నియంత్రించడం సవాలుగా మారుతుంది. శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయి. భవిష్యత్ బాగుంటుందన్న ఆలోచనతో ఉంటారు. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఈ వారం మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ఆరోగ్యం మినహా మిగతా విషయాలన్నీ అనుకూలంగా ఉంటాయి. జ్యేష్ఠ సంతానంతో తగాదాలు రావొచ్చు. ఒంటరిగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటానన్న ఆలోచనలు బలపడుతాయి.ప్రతి ఒక్కరినీ దూరంగా ఉంచుతారు. ఈ వారం ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఎంత జాగ్రత్తగా ఉంటే అంతమంచిది. ప్రతి విషయాన్నీ మనసుకు తీసుకోవడం మంచిది కాదు. ఉద్యోగులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడినా ప్రోత్సాహం లభించదు. ప్రేమికుల మధ్యలో మాటపట్టింపులు పెరుగుతాయి. ఈ వారం మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నవగ్రహ, శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆలోచనా విధానంలో చాలా మార్పు వస్తుంది. ప్రశాంతంగా ఉంటారు. ఖర్చుల నుండి ఊరట లభిస్తుంది. సేవింగ్స్ చేయాలన్న ఆసక్తి పెరుగుతుంది. ఎదుటివారితో తగాదా వస్తుందనుకుంటే మీరే సర్దుకుపోతారు. శత్రువులను అదనుచూసి దెబ్బకొట్టాలన్న ఆలోచనలు బలపడతాయి. సంతానం కోసం ఎదురుచూసేవారికి మంచికాలం. పెళ్లిచూపులు, ఇతర శుభకార్యాలు సానుకూలంగా సాగుతాయి. కోపాన్ని మాత్రం అదుపులో ఉంచుకుంటే మంచిది. తండ్రికి - పెద్దకొడుక్కి మధ్య తగాదాలు రావొచ్చు. ఈ వారం ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఖర్చులు బాగా పెరుగుతాయి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు చిన్నపాటి అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. జీవిత భాగస్వామి ఆరోగ్యం తరచూ నలతగా ఉండటంతో.. ఇంట, బయట ఒత్తిడి పెరుగుతుంది. ఏరోజు పని ఆ రోజే పూర్తిచేసకుంటే ఇబ్బందుల నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత, ఊరట లభిస్తాయి. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధ వారాలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణు సహస్రనామ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం పనిని పర్ ఫెక్ట్ గా చేస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆలోచనా విధానం మారుతుంది. కోపం తగ్గుతుంది. ఇంట్లోని వారితో సఖ్యత పెరుగుతుంది. రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. ఈ వారం మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం గ్రహాలు సహకరించడం తగ్గుతుంది. ప్రతి విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రిస్క్ కు దూరంగా ఉండాలి. మానసిక ఆందోళన ఉంటుంది. అనవసరమైన ప్రయాణాలు చేస్తారు. ఈ వారం గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం పెద్దగా ఇబ్బందులు ఉండవు అలాగే లాభాలు కూడా ఉండవు. నిమ్మకు నీరెత్తినట్టు అన్నట్టుగా వ్యవహరిస్తారు. కష్టాన్ని అవలీలగా దాటుతారు. పెట్టుబడులకు అనుకూలం. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఊరట కలిగే పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఒత్తిడి పెరుగుతుంది. ఈ వారం ఆది, సోమవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం శుభకార్యాలు ముందంజలో కొనసాగుతాయి. బహుమతులివ్వడం తీసుకోవడం చక్కగా ఉంటాయి. ప్రయాణాలు చేస్తారు. పుస్తక పఠనంపట్ల ఆసక్తి కనబరుస్తారు. లౌక్యాన్ని ప్రదర్శిస్తారు. రహస్య శత్రువులను కనుగొంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. వారం ఆది, సోమ, మంగళ , బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని వీలైనన్ని సార్లు పారాయణ చేయడం మంచిది.


Tags:    

Similar News