DECEMBER 15 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు భవిష్యత్ పై దృష్టిసారిస్తారు. క్రయవిక్రయాలపై దృష్టిసారిస్తారు. బెటర్ జాబ్స్

Update: 2022-12-14 23:30 GMT

horoscope today

నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, మార్గశిర మాసం, గురువారం

తిథి : బ.సప్తమి తె.1.39 వరకు
నక్షత్రం : పూర్వ ఫల్గుణి పూర్తిగా
వర్జ్యం : మ.2.03 నుండి 3.48 వరకు
దుర్ముహూర్తం : ఉ.10.12 నుండి 10.56 వరకు, మ.2.37 నుండి 3.21 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : సా.5.00 నుండి 6.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అంచనాలు నెరవేరుతాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. ఇంట, బయట తీరిక లేకుండా గడుపుతారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. పరిచయాలు ఉపకరిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సంఘ గౌరవం పెరుగుతుంది. ఉచిత సలహాలివ్వడం లేదా తీసుకుంటారు. బద్ధకం పెరుగుతుంది. పనులు వాయిదా పడుతుంటాయి. వైద్యుల్ని సంప్రదిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు భవిష్యత్ పై దృష్టిసారిస్తారు. క్రయవిక్రయాలపై దృష్టిసారిస్తారు. బెటర్ జాబ్స్ పొందుతారు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మాటపట్టింపులు చోటుచేసుకుంటాయి. శత్రుబలం, దృష్టిదోషం అధికంగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో విపరీతమైన ఒత్తిడులు ఉంటాయి. రూమర్స్ ప్రచారంలో ఉంటాయి. ఏ తప్పు జరిగినా మీదే బాధ్యత అన్నమాటలు బాధిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు బిస్కెట్ కలర్.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ప్రేమలు ఫలిస్తాయి. అన్నింటా పై చేయి సాధిస్తారు. ఆస్తుల పంపకాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల వారికి సానుకూల ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయి. రహస్య శత్రువుల వల్ల ఇబ్బందులు ఏర్పడుతాయి. వాహన మరమ్మతులు ఉండవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల ఫలితాలుంటాయి. ఇబ్బందులను లౌక్యంగా ఎదుర్కొంటారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ముఖ్యంగా బ్యాంక్ రుణాల కోసం ప్రయత్నించేవారికి అనుకూలంగా ఉంటుంది. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. విహార, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. గాయాలవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ముఖ్యంగా సేల్స్ రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది. శ్రేయోభిలాషుల సలహాలు, సూచనలు అనుకూలిస్తాయి. అగ్రిమెంట్ల వల్ల లాభాలు పొందుతారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడినా.. విజయం సాధిస్తారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. ప్రేమలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతివిషయంలో రహస్యంగా ఉండటం అవసరం. కాంట్రాక్ట్ , సినీ, కళా సాహిత్య రంగాల వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శుభకార్యాల అంశాల వేగంగా ముందుకెళ్తాయి. వ్యాపారస్తులకు అనుకూలం. ఎదుటివారితో చాకచక్యంగా వ్యవహరిస్తారు. పరిచయాలు ఉపకరిస్తాయి. సంపాదనపై దృష్టి సారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. క్రయవిక్రయాలు సానుకూలంగా సాగుతున్నాయి. నిర్మొహమాటంగా వ్యవహరించేవారిని దూరంగా ఉంచుతారు. పెండింగ్ పనులపై దృష్టిసారిస్తారు. ఎదుటివారిని అంచనా వేస్తారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.


Tags:    

Similar News