DECEMBER 21 : నేటి పంచాగం, దినఫలాలు..ఈ రాశులవారికి ఈరోజు అంతా శుభమే
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. క్రయవిక్రయాలు కలసివస్తాయి. మానసిక ప్రశాంతత..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, మార్గశిర మాసం, బుధవారం
తిథి : బ.త్రయోదశి రా.12.45 వరకు
నక్షత్రం : విశాఖ ఉ.8.33 వరకు, అనురాధ గురువారం తె.6.33 వరకు
వర్జ్యం : మ.12.13 నుండి 1.41 వరకు
దుర్ముహూర్తం : మ.11.43 నుండి 12.28 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.9.50 నుండి 10.15 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడవచ్చు. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఎదుటివారితో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సంతానం బాగోగులపై దృష్టి సారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. చురుగ్గా ఉంటారు. ఎదుటివారిని అంచనా వేస్తారు. అనవసర విషయాలను పక్కన పెడతారు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక పరమైన చర్చలు సజావుగా కొనసాగుతాయి. క్రయవిక్రయాలు సానుకూలంగా సాగుతాయి. రిజిస్ట్రేషన్లు, పెండింగ్ పనులపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. నో రిస్క్, నో లాస్ అన్న చందంగా గడిచిపోతుంది. ప్రశాంతంగా ఉంటారు. భవిష్యత్ పై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు సాధారణంగా కొనసాగుతున్నాయి. ఎక్కడా కష్టనష్టాలు ఉండవు. వ్యాపారస్తులకు రొటేషన్లు సజావుగా సాగుతాయి. మాట పట్టింపులు ఏర్పడవచ్చు. రోజంతా వృథాగా గడిచిపోతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. క్రయవిక్రయాలు కలసివస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మంచి వైద్యం అందుకుంటారు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వాహనాలను వీలైనంత వరకూ నడపకపోవడం మంచిది. ఆరోగ్యం కాస్త మందగిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడు పండు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉత్సాహం కలుగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఏ పనిచేసినా లాభం గురించి ఆలోచిస్తారు. విద్యార్థులు కూడా శ్రద్ధగా చదువుకుంటారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వొచ్చు. ఇంటి ఇబ్బందులను అర్థం చేసుకుని మసులుకుంటారు. ఆర్థికంగా లాభనష్టాలు ఉండవు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. కాంట్రాక్టర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. సాహసోపేత నిర్ణయాలు కలసివస్తాయి. ఆర్థికంగా నష్టాలుండవు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. శారీరక, మానసిక అలసట పెరుగుతుంది. అన్ని వృత్తులవారు, అన్ని వయసుల వారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.