FEBRUARY 2 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. మనసొకచోట, శరీరం మరోచోట అన్నట్టుగా..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, బుధవారం
తిథి : శు.ద్వాదశి సా.4.26 వరకు
నక్షత్రం : ఆరుద్ర తె.6.18 వరకు
వర్జ్యం : మ.12.48 నుండి 2.36 వరకు
దుర్ముహూర్తం : ఉ.10.28 నుండి 11.13 వరకు, మ.3.00 నుండి 3.45 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : సా.4.05 నుండి 4.45 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. మార్కెటింగ్ రంగాలవారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరుతాయి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉద్యోగ భయం తొలగిపోతుంది. రిజిస్ట్రేషన్లు సజావుగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు విస్తారంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. సహకరించే వర్గం తక్కువగా ఉంటారు. పనుల్లో ఏకాగ్రత లోపిస్తుంది. కాంట్రాక్ట్ రంగం వారు జాగ్రత్తలు పాటించుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రశాంతంగా గడుస్తుంది. సమస్యల్ని, ఒత్తిడులను అధిగమిస్తారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం పై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభవార్తల్ని అందుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. మనసొకచోట, శరీరం మరోచోట అన్నట్టుగా వ్యవహరిస్తారు. భూమికి సంబంధించిన వ్యాపారస్తులు కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బిస్కెట్ కలర్.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా యోగదాయకంగా ఉంటుంది. మొండిబాకీలను వసూలు చేసుకునేందుకు, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచుకునే ప్రయత్నాలు కలసివస్తాయి. రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ ఉన్నతికోసం ప్రయత్నించేవారికి అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా ధోరణిలో కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. అనుకున్నదొకటి.. జరిగేది మరొకటిగా ఉంటుంది. ఖర్చుల్ని భరించలేక సతమతమవుతారు. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఓవర్ కాన్ఫడెన్స్ పెరుగుతుంది. అప్పులు ఇవ్వడం, తీసుకోవడానికి ఎంతదూరంగా ఉంటే అంతమంచిది. తప్పనిసరి అయితే తప్ప.. వీలైనంతవరకూ ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారులకు మంచి ఫలితాలుంటాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా ప్రశాంతత నెలకొంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు లేత ఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాహసోపేత నిర్ణయాలు కలసివస్తాయి. వైద్య సంప్రదింపులు మంచి ఫలితాలుంటాయి. మాటతీరుపై ఆధారపడిన వృత్తుల్లో ఉన్నవారికి అనుకూలం. ఖర్చులు ఎక్కువగా ఉన్నా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిది. లావాదేవీలకు సంబంధించిన వృత్తుల్లో ఉన్నవారు అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు కాఫీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్రయవిక్రయాలకు, అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడానికి ఎంతదూరంగా ఉంటే అంతమంచిది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.