JANUARY 4: నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణమైన ఫలితాలుంటాయి. మీ తప్పులేకపోయినా..

Update: 2023-01-04 02:32 GMT

daily horoscope in telugu

నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, పుష్య మాసం, బుధవారం

తిథి : శు.త్రయోదశి రా.12.00 వరకు
నక్షత్రం : రోహి సా.6.49 వరకు
వర్జ్యం : ఉ.10.01 నుండి 11.46 వరకు, రా.1.01 నుండి 2.48 వరకు
దుర్ముహూర్తం : మ.11.50 నుండి 12.34 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : సా.4.55 నుండి 5.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఎదుటివారితో మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలి. రహస్య శత్రువులు పెరుగుతారు. దృష్టిదోషం అధికంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. కాంట్రాక్ట్ రంగాల వారు జాగ్రత్తగా ఉండాలి. రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూలమైన ఫలితాలుంటాయి. ప్రతి విషయంలో మీదే పై చేయిగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు. అంచనాలు నెరవేరుతాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, క్రీడ రంగాల్లో ఉన్నవారికి ఈ రోజు అన్ని విధాలా సహకరిస్తుంది. దంపతుల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులెక్కువగా ఉంటాయి. శత్రుబలం, దృష్టిదోషం అధికమవుతాయి. శ్రమ ఎక్కువ..ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సహకరించే వర్గం చేరువలో ఉండదు. అలసట పెరుగుతుంది. శారీరకంగా మానసికంగా అలసట ఎక్కువవుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా కలసివస్తుంది. పొదుపు పై దృష్టి సారిస్తారు. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. భవిష్యత్ పై దృష్టి సారిస్తారు. అన్ని వృత్తులవారికి మేలు జరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా యోగదాయకంగా ఉంటుంది. అధికారుల నుండి వచ్చే ఒత్తిడి తగ్గుతుంది. చర్చలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సంతకానికి విలువ ఉన్న ఉద్యోగులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉండాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణమైన ఫలితాలుంటాయి. మీ తప్పులేకపోయినా.. మిమ్మల్ని కార్నర్ చేసేవారు ఎక్కువగా ఉంటారు. ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. రహస్యాలను ఎవరితోనూ పంచుకోకపోవడం మంచిది. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ, కళ, సాహిత్య రంగాల వారికి మేలు జరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అందరితోనూ కలసి మెలసి ఉండే మీపై.. నిందలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంత తక్కువగా మాట్లాడితే అంతమంచిది. ఈ రోజు ధరించకూడని రంగులు ముదురు రంగులు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పార్ట్ టైం ఉద్యోగ ప్రయత్నాలు, ఇంటర్వ్యూలు ఫలిస్తాయి. వేళకు నిద్రాహారాలు అందుతాయి. భవిష్యత్ పై దృష్టి సారిస్తారు. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఇంటి మరమ్మతులపై నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ప్రతి విషయంలో కీడెంచి మేలెంచాలన్న విధంగా ఆలోచిస్తారు. అన్ని విధాలా కలసివస్తుంది. ఆర్థికపరంగా ఊరట ఏర్పడుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, రాజకీయ, సినీ, కళా రంగాల్లో ఉన్నవారికి అన్నివిధాల అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లోనూ నిరుత్సాహం తప్పకపోవచ్చు. కోర్టు కేసుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ తో కూడుకున్న పనులను వాయిదా వేయడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్త సవాళ్లు ఏర్పడుతాయి. ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రంగా ఉంటాయి. సంతకానికి విలువ కలిగిన ఉద్యోగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. హఠాత్తుగా శత్రుబలం పెరుగుతుంది. కాంట్రాక్ట్ రంగాల వారు అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెంచాలి. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు చర్చలు అన్ని విధాలా కలసివస్తాయి. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఆరోగ్యం ప్రశాంతంగా ఉంటుంది. అన్ని రకాలుగా అనుకూలమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. శుభవార్తలు అందుకుంటారు. దూరప్రాంతాలకు వెళ్లాలనుకునేవారికి ఆటంకాలు తొలగిపోతాయి. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన పనుల్లో వేగం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.


Tags:    

Similar News