MAY 15 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలం. తీరని సమస్యలపై దృష్టిసారిస్తే మెరుగైన ఫలితాలను
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, గురు సోమవారం
తిథి : బ.ఏకాదశి రా.1.04 వరకు
నక్షత్రం : పూర్వాభాద్ర ఉ.9.08 వరకు
వర్జ్యం : సా.6.23 నుండి 7.55 వరకు
దుర్ముహూర్తం : మ.12.38 నుండి 1.29 వరకు, తదుపరి మ.3.12 నుండి 4.03 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభ సమయాలు : ఉ.9.50 నుండి 10.20 వరకు, సా.5.00 నుండి 5.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు సాధారణంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలను అందుకుంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. వేళకు ఆహారం లభించదు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఎదుటివారిని అంచనా వేయడంలో వైఫల్యం చెందుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సహకరించే వర్గం చేరువలో ఉంటుంది. అప్పులు తీర్చే ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. వివాదాస్పదమైన అంశాల్లో మీదే పైచేయి అవుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. మిమ్మల్ని మీరు మార్చుకోవాలన్న ఆలోచనలు బలపడుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. లాభనష్టాలు, గౌరవ మర్యాదలు సమానంగా ఉంటాయి. పెద్దగా కష్టనష్టాలుండవు. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వీలైనంత వరకూ రిస్క్ కు దూరంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి విషయంలో నిరుత్సాహం పెరుగుతుంది. వేళకు నిద్రాహారాలు లోపిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలం. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పరిచయాలు అభివృద్ధి చెందుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలం. తీరని సమస్యలపై దృష్టిసారిస్తే మెరుగైన ఫలితాలను అందుకుంటారు. వైద్య రంగంలో వారికి అనుకూలం. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారికి వైద్యులను సంప్రదిస్తే అనుకూల ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎదుటివారికి సహాయం చేయబోయి నష్టపోతారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో మాటపట్టింపులు ఏర్పడవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృథాఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వేళకు నిద్రాహారాలు ఉండవు. నమ్మినవారు కూడా సహకరించరు. బద్ధకం ఉంటుంది. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఫైల్స్ మూవ్ అవుతాయి. ప్రతి పనిలో కదలికలు ఉంటాయి. ఎదుటివారిని అంచనా వేస్తారు. రావలసిన సమాచారం తెలుసుకుంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉన్నా ఉపయోగకరంగా ఉంటాయి. శుభ కార్యాలపై దృష్టిసారిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సాధారణ ఫలితాలుంటాయి. వ్యవసాయ రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది. మానసిక, శారీరక అలసట పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.