NOVEMBER 17 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. క్రయవిక్రయాలు కలసివస్తాయి. లోన్లు మంజూరవుతాయి.

Update: 2022-11-16 23:30 GMT

november 17 horoscope

నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, గురువారం

తిథి : బ.అష్టమి ఉ.7.57 వరకు
నక్షత్రం : మఖ రా.9.21 వరకు
వర్జ్యం : ఉ.8.10 నుండి 9.55 వరకు, తె.5.57 నుండి ఉ.7.40 వరకు
దుర్ముహూర్తం : మ.10.00 నుండి 10.45 వరకు, మ.2.29 నుండి 3.14 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
NOVEMBER 17 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలుమ.3.30 నుండి 4.15 వరకు
మేషరాశి

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తలనొప్పి బాధిస్తుంది. ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉంటాయి. ప్రతి పనిలో నిదానంగా వ్యవహరించడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వింత అనుభవాలు ఎదురవుతాయి. శుభవార్తలు వింటారు. కాంట్రాక్ట్ రంగాలవారికి అనుకూలం. ప్రైవేటు ఉద్యోగస్తులకు అనుకూలం. నూతన ఆలోచనలు చేస్తారు. ప్రయాణాలు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. నూతన ఉద్యోగప్రయత్నాలు చేస్తారు. క్రయవిక్రయాలకు అనుకూలం. సంఘ గౌరవం పెరుగుతుంది. మీ మాటకు విలువనిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆనందాన్నిచ్చే వార్తలు అందుతాయి. విదేశీయానానికి అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శ్రమ ఎక్కువ.. ఫలితం తక్కువగా ఉంటుంది. క్రయవిక్రయాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగంలో పనివేళలు పెరగవచ్చు. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన అవకాశాలు కలసివస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. అంచనాలు నిజమవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. క్రయవిక్రయాలు కలసివస్తాయి. లోన్లు మంజూరవుతాయి. కొత్త అవకాశాలను ఉపయోగించుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. సహాయ సహకారాలు అందక నిరుత్సాహపడతారు. దంపతుల మధ్య తగాదాలు పెరుగుతాయి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కష్టం పెరుగుతుంది. పని వేళలు పెరుగుతాయి. విలువైన వస్తువులను భద్రపరచుకోవాలి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అన్ని రంగాల వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ పొడి రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. నూతన పెట్టుబడులకు అనుకూలం. క్రయవిక్రయాలు కలసివస్తాయి. పాతవస్తువుల అమ్మకాలపై నిర్ణయాలు కలసివస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పింక్ కలర్.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యానికి పరిష్కారాలు లభిస్తాయి. దంపతుల మధ్య తగాదాలు, విభేదాలు సహజం. భవిష్యత్ పై దృష్టి సారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్.


Tags:    

Similar News