October 15 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
తిథి : బ.షష్ఠి పూర్తిగా , నక్షత్రం : మృగశిర రా.11.22 వరకు, వర్జ్యం : లేదు
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీయుజ మాసం
తిథి : బ.షష్ఠి పూర్తిగా
నక్షత్రం : మృగశిర రా.11.22 వరకు
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉ.6.03 నుండి 7.37 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : ఉ.11.15 నుండి మ.12 .00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. కీడెంచి మేలు ఎంచాలన్న విధంగా ఆలోచిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అపనిందలుంటాయి. ప్రతి విషయంలో జాగ్రత్త అవసరం. ఈరోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిళ్లుంటాయి. నూతన ఉద్యోగ ఆరోగ్య పరమైన జాగ్రత్తలు అవసరం. ఈరోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు అధికమవుతాయి. ఊహించని ప్రయాణాలు ఎదురవుతాయి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. భార్య-భర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వినోదాలు, విహారయాత్రల్లో పాల్గొంటారు. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉద్యోగ అవకాశాలు కలసివస్తాయి. తగాదాలు పరిష్కారమవుతాయి. రహస్యాల్ని ఎవరికీ చెప్పకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యస్త ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో వెసులుబాటు ఉంటుంది. మెంటల్ టెన్షన్ పెరుగుతుంది. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించాలి. ప్రయాణాల్లో విలువైన వస్తువులను జాగ్రత్త చేసుకోవాలి. ఈరోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మకపోవడం మంచిది. పెద్దలతో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. స్థల విషయాల్లో తుది నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు కలసివస్తాయి. అప్పులు తీరవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చర్చలు ఫలిస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తగాదాలు తప్పవు. ప్రతి పనికీ విపరీతంగా కష్టపడాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యం గోచరిస్తోంది. వృథా ఖర్చులు తప్పవు. ఈరోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నూతన పనులకు ప్రయత్నిస్తారు. ఎదుటివారిని నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు శ్రమించాలి. ఈరోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు కలసివస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తగాదాలు తొలగిపోతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. విహారయాత్రలు, వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు ధరించకూడని రంగు నలుపురంగు.