TIRUMALA : 12 గంటలపాటు మూతపడనున్న శ్రీవారి ఆలయం

గ్రహణ సమయంలో స్వామివారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆ రోజు 12 గంటల పాటు భక్తులకు శ్రీవారి దర్శనంతో పాటు..

Update: 2022-11-04 02:00 GMT

ప్రతినిత్యం భక్తులతో రద్దీగా ఉంటాయి తిరుమల గిరులు. ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుని, దర్శనం చేసుకుని తరిస్తారు. గత నెలలో సూర్యగ్రహణం కారణంగా స్వామి ఆలాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నెలలో చంద్రగ్రహణం ఉండటంతో.. స్వామివారి ఆలయం 12 గంటలపాటు మూతపడనుంది. నవంబరు 8వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనుంది.

గ్రహణ సమయంలో స్వామివారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆ రోజు 12 గంటల పాటు భక్తులకు శ్రీవారి దర్శనంతో పాటు.. అన్ని సేవలను నిలిపివేస్తారు. ఎస్డీఎస్ టోకెన్లను కూడా రద్దు చేస్తున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు. అలాగే గ్రహణ సమయంలో తిరుమల గిరులపై అన్నప్రసాద వితరణ కూడా జరగదని వెల్లడించారు. నవంబర్ 8వ తేదీన ఉదయం 8.40 గంటల నుండి రాత్రి 7.20 గంటల వరకూ శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచనున్నట్లు ప్రకటించారు. ఆ రోజు రాత్రి 8.30 గంటల నుండి అన్నప్రసాద వితరణ జరుగుతుందని టీటీడీ పేర్కొంది.


Tags:    

Similar News