అవకాశాలొచ్చాయి…కాని బ్యాడ్ లక్…!!!

ఒకే కుటుంబానికి మూడు సార్లు ఉన్నత పదవులు దక్కాయి. కానీ వారు గెలిచిన ప్రతీసారి విపక్షంలోనే తమ పదవీకాలం గడిపే పరిస్థితి తలెత్తింది. ఇదే ఆ కుటుంబాన్ని [more]

Update: 2019-07-06 06:30 GMT

ఒకే కుటుంబానికి మూడు సార్లు ఉన్నత పదవులు దక్కాయి. కానీ వారు గెలిచిన ప్రతీసారి విపక్షంలోనే తమ పదవీకాలం గడిపే పరిస్థితి తలెత్తింది. ఇదే ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేస్తుంది. వారే రాజమండ్రి కి చెందిన ఆదిరెడ్డి అప్పారావు ఫ్యామిలీ. ఒకే ఇంట్లో వున్న ఆదిరెడ్డి ఫ్యామిలిలో భార్య వీరరాఘవమ్మ మేయర్ గా, అప్పారావు ఎమ్యెల్సీగా, కోడలు భవాని ఎమ్యెల్యేగా పదవులు లభించిన ప్రతీసారి అధికారం లో వారు వున్న పార్టీకి పవర్ మాత్రం దక్కడం లేదు. దాంతో తాము పదవులు వచ్చినందుకు అదృష్టవంతులమో ప్రతిపక్షానికే పరిమితం అవుతున్నందుకు దురదృష్టవంతులమో వారికి అర్ధం కావడం లేదు.

అప్పుడు వైఎస్ అధికారంలో ఉండగా …

రెండు దశాబ్దాలు టిడిపి నాయకుడిగా కొనసాగిన ఆదిరెడ్డి అప్పారావు కు 2007 లో తొలి పదవిని ఆఫర్ చేశారు టిడిపి అధినేత చంద్రబాబు. అప్పారావు భార్యకు రాజమండ్రి మేయర్ సీటు ఇచ్చారు. ఆదిరెడ్డి రాఘవమ్మ గెలిచారు. కానీ వైఎస్ ఆర్ అధికారంలో ఉండటం స్థానిక మంత్రిగా జక్కంపూడి రామ్మోహన రావు, ఎంపిగా ఉండవల్లి అరుణ కుమార్, ఎమ్యెల్యేగా రౌతు సూర్య ప్రకాశరావు ఉండటంతో ఆదిరెడ్డి కి హవా లేకుండా పోయింది. దీనికి తోడు మూడేళ్ళ తరువాత సొంత పార్టీ లో అసంతృప్తి జ్వాలలు కొనసాగాయి.

టిడిపికి గుడ్ బై కొడితే ….

టిడిపి లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి తో నడిచిన ఆధిపత్య పోరు ఆదిరెడ్డి అప్పారావు ని వైసిపిలో చేరేలా చేసింది. ఆ పార్టీలోకి వెళ్లిన వెంటనే అప్పారావుకు అదృష్టం దక్కింది. వైసిపి తొలి ఎమ్యెల్సీగా వైఎస్ జగన్ అప్పారావుకు అవకాశం కల్పించారు. ఆ పదవిలో ఉండగా ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చింది. మరోసారి ఆదిరెడ్డికి తీవ్ర నిరాశే మిగిలింది. విపక్షంలో ఇలా కొనసాగుతూ రావడం ఇష్టం లేకపోవడం టిడిపి ఆకర్ష్ మంత్రం, మాతృపార్టీలోకే అప్పారావును వెళ్లేలా చేసింది.

తాజాగా మరోసారి…..

తనకు లేదా తన కుమారుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ కి టికెట్ ఇవ్వాలని ఆదిరెడ్డి అప్పారావు కోరినా కింజరపు ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి కోడలు భవాని ని చంద్రబాబు ఎంపిక చేశారు. ఏదైనా తమ కుటుంబానికే దక్కడంతో అప్పారావు గత నాలుగేళ్లుగా చేసుకున్న గ్రౌండ్ వర్క్ తో 30 వేల భారీ మెజారిటీ తో కోడలును గెలిపించుకున్నారు. ఆమె గెలిచింది కానీ అప్పారావును అదృష్టం వరించలేదు అధికారంలోకి వైఎస్సాఆర్ పార్టీ దూసుకువచ్చింది. అదికూడా అఖండ మెజారిటీతో. దీనికి తోడు పార్టీ ఫిరాయింపులకు తాను వ్యతిరేకమని వస్తే రాజీనామా చేసే రావాలన్న వైఎస్ జగన్ పెట్టిన రూల్ తో ఒకవేళ అధికారపార్టీ లో చేరాలన్న ఆలోచన వున్నా అవకాశం లేని పరిస్థితి ఆదిరెడ్డి కి ఎదురైంది. ఇలా ఎవ్వరికి రాని అవకాశలు వచ్చినా అధికారంలో ఆ పార్టీ లేకపోవడం ఆదిరెడ్డి కుటుంబానికి శాపం గా మారడం తూర్పుగోదావరి జిల్లా లోను టిడిపిలో చర్చనీయం అయ్యింది

Tags:    

Similar News