అఖిలప్రియకు ఇక ఛాన్సే లేదా? టాక్ అదేనటగా?
రాజకీయాల్లో వారసులకు కొదవలేదు. తండ్రినో.. తల్లినో ఆసరా చేసుకుని పాలిటిక్స్‌లోకి వచ్చినా.. తదనంతర కాలంలో వారి పేరును నిలబెట్టేలా రాజకీయాలు చేసిన వారు చాలా చాలా తక్కువ [more]
రాజకీయాల్లో వారసులకు కొదవలేదు. తండ్రినో.. తల్లినో ఆసరా చేసుకుని పాలిటిక్స్‌లోకి వచ్చినా.. తదనంతర కాలంలో వారి పేరును నిలబెట్టేలా రాజకీయాలు చేసిన వారు చాలా చాలా తక్కువ [more]
రాజకీయాల్లో వారసులకు కొదవలేదు. తండ్రినో.. తల్లినో ఆసరా చేసుకుని పాలిటిక్స్‌లోకి వచ్చినా.. తదనంతర కాలంలో వారి పేరును నిలబెట్టేలా రాజకీయాలు చేసిన వారు చాలా చాలా తక్కువ మంది కనిపిస్తారు. మరికొందరు అసలు ఆయన వారసులేనా? అనే రేంజ్‌లో బ్యాడ్ నేమ్‌ను కూడా తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారిలో ముందు వరుసలో ఉన్నారు.. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. భూమా నాగిరెడ్డి, శోభల గారాల పట్టిగా అనూహ్య రీతిలో రాజకీయాల్లోకి వచ్చిన అఖిల ప్రియ.. వారి రేంజ్‌ను అందుకోలకపోయారనేది లోకల్ టాక్. భూమా నాగిరెడ్డి జీవించి ఉన్న సమయంలో ఆయన ఏపార్టీలో ఉన్నారనేది సంబంధం లేకుండా ప్రజలు ఆయనకు హారతులు పట్టారు.
తల్లి దండ్రులిద్దరూ….
టీడీపీలో ఉండగా.. ఎంపీగా, ఎమ్మెల్యేగా చక్రం తిప్పిన భూమా నాగిరెడ్డికి జిల్లా వ్యాప్తంగా మంచి పేరుంది. చిన్నపాటి వివాదాలే తప్ప ఆయన రాజకీయ జీవితంగా పెద్దగా వివాదాలు చేసింది లేదు. కొని తెచ్చుకున్న వివాదాలు అసలే లేవు. ప్రత్యర్థులతోనూ కలిసిమెలిసిన నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇక, ఆ తర్వాత ఆయన సతీమణి శోభ కూడా రాజకీయాల్లో రాణించారు. శోభా నాగిరెడ్డి అయితే పార్టీలతో సంబంధం లేకుండా టీడీపీ, ప్రజారాజ్యం, వైసీపీ నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు క్రియేట్ చేశారు.
మంత్రి పదవి చేపట్టిన తర్వాతే…..
అయితే,వైసీపీలో ఉండగా శోభ ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తున్న సమయంలోనే 2014లో ప్రమాదంలో మృతి చెందడంతో అఖిల ప్రియ ఆ సీటు నుంచి విజయం సాధించారు. నంద్యాల నుంచి నాగిరెడ్డి విజయం సాధించారు. తర్వాత నాగిరెడ్డి తన చిర కాల కోరిక అయిన మంత్రి పీఠం పై ఆశతో టీడీపీలోకి వచ్చారు. ఈ క్రమంలో ఆయన ఆ పీఠం ఎక్కకముందే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దీంతో నాగిరెడ్డికి ఇవ్వాల్సిన మంత్రి పదవిని అఖిల ప్రియకు ఇచ్చారు. ఇక, అక్కడి నుంచి ఆమె ఆధిపత్య రాజకీయాలకు తెరదీశారు. సొంత పార్టీలోనే తన తండ్రికి ఎంతో సన్నిహితంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిపై కత్తికట్టినట్టు వ్యవహరించారు. అనేక సార్లు పంచాయితీ కూడా జరిగింది.
తక్కువ సమయంలోనే……
అదే సమయంలో ఒకనాడు ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గ ప్రజలు భూమా ఇంటికి క్యూకడితే.. ఇప్పుడు అఖిల ప్రియ రాజకీయ హయాంలో వీరి ఇంటి మొహం చూస్తున్న ప్రజలు కూడా కనిపించడం లేదు. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు భర్త అన్నింట్లోనూ వేలు పెట్టి జోక్యం చేసుకున్నారన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. పైగా ఏవీ సుబ్బారెడ్డిపై హత్యా ప్రయత్నం చేశారనే కేసులో ఇరుక్కున్నారు అఖిల ప్రియ భర్త. నియోజకవర్గంలో తాను ఓడిపోయినా.. పైచేయి సాధించేందుకు పోలీసులపై కూడా అత్యుత్సాహంతో ఆరోపణలు చేశారనే కేసులు అఖిల ప్రియపై ఉన్నాయి. కానీ, భూమా నాగిరెడ్డి కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నా.. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొనలేదు. కానీ, అఖిల ప్రియ అతి తక్కువ సమయంలోనే వివాదాస్పద నాయకురాలిగా ఎదిగారు. దీంతో తండ్రి వారసత్వంగా రాజకీయాలు అబ్బినా.. సేవా దృక్ఫథం మాత్రం అబ్బలేదనే బలమైన విమర్శలు వినిపిస్తున్నాయి.