గంటా ఉంటారా… పోతారా…. బిగ్ సస్పెన్స్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భీమిలి నియోజకవర్గానికి ఎంతోచరిత్ర ఉంది. దేశంలోనే రెండో పురాతన మునిసిపాలిటీగా చరిత్ర పుటల్లో భీమిలి ఎప్పుడో స్థానం సంపదించుకుంది. అల్లూరి సీతారామారాజు లాంటి స్వాంత్రత్య్ర [more]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భీమిలి నియోజకవర్గానికి ఎంతోచరిత్ర ఉంది. దేశంలోనే రెండో పురాతన మునిసిపాలిటీగా చరిత్ర పుటల్లో భీమిలి ఎప్పుడో స్థానం సంపదించుకుంది. అల్లూరి సీతారామారాజు లాంటి స్వాంత్రత్య్ర [more]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భీమిలి నియోజకవర్గానికి ఎంతోచరిత్ర ఉంది. దేశంలోనే రెండో పురాతన మునిసిపాలిటీగా చరిత్ర పుటల్లో భీమిలి ఎప్పుడో స్థానం సంపదించుకుంది. అల్లూరి సీతారామారాజు లాంటి స్వాంత్రత్య్ర సమరయోధుడి పురిటిగడ్డ ఇది. అందుకే ఈ నియోజకవర్గంలో రాజకీయ అవగాహన కాస్త ఎక్కువేనని చెప్పాలి. ఇక ఈ నియోజకవర్గంలో 2లక్షల 68వేల పైచిలుకు ఓటర్లు ఉండగా ఇందులో మహిళలే ఎక్కువగా ఉండటం మరో విశేషం. ఎటు చూసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖ జిల్లా ఇప్పుడు ఒక పెద్ద ఆస్తిగానే చెప్పాలి. టూరిజంలో దూసుకుపోతోంది. అనేక కొత్త పరిశ్రమలకు కేంద్రంగా మారబోతోంది…చిత్ర పరిశ్రమలకు సంబంధించి స్టూడియోలు ఈ జిల్లాలోనే నిర్మాణమవుతూ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు విశాఖ జిల్లా గుండెగా మారగా…విశాఖ జిల్లాలో భీమిలి నియోజకవర్గం చుట్టూతే ఇప్పుడు ప్రభుత్వాల అభివృద్ధి అల్లుకోవడం ప్రారంభించింది. భూ బ్యాంకింగ్ ఉండటమే ఇందుకు కారణమని చెప్పాలి.
ఇక రాజకీయ విషయాలకు వస్తే టీడీపీకి భీమిలి నియోజకవర్గం కంచుకోటగా చెప్పుకోవాలి. అత్యధిక సార్లు ఈ నియోజకవర్గంలో పసుపు జెండా ఎగిరింది. 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచి 37 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. మంత్రిగా కూడా పదవీ దక్కడంతో ఈ నియోజకర్గానికి మేలు జరిగిందనే చెప్పాలి. టీడీపీ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఈ నియోజకవర్గంలో చేపట్టింది. శ్రీనివాసరావు దాదాపు 240 0కోట్ల పై చిలుకు నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పంట పండించారనే చెప్పాలి. చేసిన అభివృద్ధిని చెప్పుకుంటేనే ఈసారి ఆయన భీమిలి నుంచి మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారు. దాదాపు ఆయనకే టికెట్ ఖరారు కానుంది. అయితే తరుచూ నియోజకవర్గాలను మార్చే గంటా ఈసారి ఇక్కడ ఉంటారా..?! వెళ్లిపోతారా..? అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఆయన విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి బరిలోకి దిగుతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే గంటా మాత్రం ఆ వార్తలను ఖండించారు. టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా గెలిచిన అవంతి శ్రీనివాస్ కూడా భీమిలి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచి పనిచేశారు. దీంతో ఆయన కూడా ఈ సీటు కోసం పట్టుబడుతున్నారు. గంటాకు మరోచోట టికెట్ ఇవ్వాలని తనకు భీమిలి స్థానాన్ని కేటాయించాలని చంద్రబాబును కోరారట. అయితే చంద్రబాబు మాత్రం గంటానే బరిలో దింపాలని యోచిస్తున్నారట. మొత్తంగా వీరిద్దరి మధ్యే టీడీపీ టికెట్ కోసం పోరు సాగుతోంది.
కాపు సామాజిక వర్గం ఓటర్లు ప్రభావం చూపే అవకాశం ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది. అందుకే జనసేన కూడా ఇక్కడ పోటీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది. ఆ పార్టీ నుంచి అలీవర్‌రామ్ పేరు వినబడుతోంది. గతంలో ప్రజారాజ్యం కూడా ఇక్కడ గెలవడంతో ఆ పార్టీ ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఆ పార్టీకి కూడా అవకాశాలున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే విజయనిర్మల పేరు బలంగా వినిపిస్తోంది. ఇంక బలమైన అభ్యర్థికోసం ఆ పార్టీ వేటలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే ఆమె జనంలో కదలాడుతూ కనిపిస్తున్నారు. బీసీ, కాపు, మత్స్యకారుల ఓట్లు అధికంగా ఉండటంతో వారిని ఆకర్షించగలిగిన వారినే విజయం వరిస్తుందని తెలుస్తోంది. చూడాలి ఎలా ఉంటుందో..