Ashok : బాబుకు పూసపాటి ఫిట్టింగ్..?

అశోక్ గజపతి రాజు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత. అధికారంలో ఉన్న ఐదేళ్లలో మూడేళ్ల పాటు ఆయన కేంద్రమంత్రిగా పనిచేశారు. టీడీపీ అధినాయకత్వం నిర్ణయంతో మంత్రి పదవికి [more]

Update: 2021-11-11 13:30 GMT

అశోక్ గజపతి రాజు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత. అధికారంలో ఉన్న ఐదేళ్లలో మూడేళ్ల పాటు ఆయన కేంద్రమంత్రిగా పనిచేశారు. టీడీపీ అధినాయకత్వం నిర్ణయంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి అశోక్ గజపతి రాజుకు పార్టీలో కష్టాలు మొదలయ్యాయి. అప్పటి వరకూ అశోక్ గజపతి రాజుకు పార్టీ నాయకత్వం ప్రయారిటీ ఇచ్చేది. కానీ రానురాను ఆయన ప్రాధాన్యత తగ్గించింది. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 ఎవరు అంటే రాజుగారి పేరే అందరూ చెబుతారు.

కీలక నిర్ణయం…?

అలాంటి అశోక్ గజపతి రాజు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. వచ్చే ఎన్నికల్లో తాను పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయబోనని చంద్రబాబుకు స్పష్టం చేస్తారట. అయితే కేశినేని నానిలా మాత్రం కాదు. పూర్తిగా రాజకీయాల నుంచి ఆయన తప్పుకోవడం లేదు. కేవలం పార్లమెంటు నియోజకవర్గానికి దూరంగా ఉంటానని మాత్రం అశోక్ గజపతి రాజు త్వరలోనే చంద్రబాబుకు స్పష్టం చేయదలచుకున్నారు.

దీక్షకు కూడా….

ఇటీవల చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షకు కూడా అశోక్ గజపతి రాజు పార్టీ కేంద్ర కార్యాలయానికి రాలేదు. ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చి దాదాపు ఏడాదిన్నర పైగానే ఉంది. అంటే పార్టీ అధినేత పై అసంతృప్తి కాదు. స్థానిక నాయకత్వంపై అసహనం ఆయనను కోట గుమ్మానికే పరిమితం చేసింది. ఇప్పటికీ స్థానిక నాయకులతో అశోక్ గజపతి రాజు కు విభేదాలు తొలగక పోగా మరింత తీవ్రమయ్యాయనే చెప్పాలి.

రెండింటిలో తప్ప…..

దీంతో పాటు విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని విజయనగరం, బొబ్బిలి మినహా ఎచ్చర్ల, రాజాం, చీపురుపల్లి, గజపతినగరం, నెలిమర్ల నియోజకవర్గాల్లో బలంగా లేదు. అక్కడ ఇప్పటీకీ వైసీీపీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ విజయనగరం జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. మరోసారి ఆ అవకాశం ఇవ్వకూడదని అశోక్ గజపతి రాజు ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళతారంటున్నారు. దీనికి చంద్రబాబు నుంచి కూడా పెద్దగా అభ్యంతరం వ్యక్తమయ్యే అవకాశాలు లేవు. అయితే పార్లమెంటుకు బలమైన అభ్యర్థిని చంద్రబాబు వెతుక్కోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News