jinping : నియంతకు ఇక తిరుగులేదంతే?

ఏ దేశమైనా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాలి. ఆ దేశ ప్రజలు తమ నేతను ఎన్నుకోవాలి. పాలన చూసి ప్రజలు నాయకుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ చైనా అధినేత [more]

Update: 2021-11-10 16:30 GMT

ఏ దేశమైనా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాలి. ఆ దేశ ప్రజలు తమ నేతను ఎన్నుకోవాలి. పాలన చూసి ప్రజలు నాయకుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ చైనా అధినేత జిన్ పింగ్ మాత్రం తానే పూర్తి కాలం అధినేతగా ప్రకటించుకుంటున్నారు. రాజ్యాంగ సవరణ తెచ్చి మరీ చైనా అధినేతగా తాను జీవిత కాలం కొనసాగేలా జిన్ పింగ్ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. అంటే దాదాపు 2035 వరకూ జిన్ పింగ్ చైనా అధినేతగా వ్యవహరిస్తారన్న మాట.

మరోసారి..

దేశాన్ని ప్రగతి బాటలో పయనింప చేసేందుకు తానే దేశానికి నాయకత్వం వహించాలని జిన్ పింగ్ భావిస్తున్నారు. సెంట్రల్ కమిటీలో మరోసారి జిన్ పింగ్ ను చైనా కమ్యునిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కానున్నారు. వచ్చే ఏడాదితో జిన్ పింగ్ పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో సెంట్రల్ కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో జిన్ పింగ్ ను మరోసారి ఎన్నిక కానున్నారు.

జీవిత కాలం….

చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్ కు తిరుగులేని అధికారాలున్నాయి. ప్రపంచంలో చైనాను అగ్రదేశంగా నిలిపేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. 1982లో అప్పటి అధ్యక్షుడు డెంగ్ జియావో పింగ్ రాజ్యాంగ సవరణ చేశారు. ఈ సవరణ ప్రకారం ఒక వ్యక్తి రెండు సార్లకు మించి అధ్యక్షుడిగా ఉండటానికి వీలులేదు. అందుకు కారణాలు కూడా ఆయన చెప్పారు. ఇది నియంతృత్వానికి దారి తీస్తుందని ఆయన ఆనాడే చెప్పారు.

నియంతగా మారతారా?

కానీ నాటి నేతల మాటలను జిన్ పింగ్ పక్కన పెట్టారు. జిన్ పింగ్ చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం 2035 వరకూ ఆయనే చైనా అధ్యక్షుడిగా కొనసాగే వీలుంది. అంటే జిన్ పింగ్ 82 ఏళ్ల వరకూ చైనా అధిపతిగా కొనసాగుతారన్న మాట. 2023తో పాటు 2027లోనూ ఆయనే అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశముంది. చైనాకు ఇక మరో మూడు రెండున్నర దశాబ్దాల పాటు జిన్ పింగ్ నాయకత్వం వహిస్తారు. ఇది మంచికా? చెడుకా? అన్నది కాలమే తేల్చాల్సి ఉంది.

Tags:    

Similar News