కడప మొత్తం ఆయనదే హవానా.. ఏం జరుగుతోంది ?
సీఎం జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీకి కీలక నేతలు ఉన్నారు. ముఖ్యంగా జగన్ సొంత బంధువులు కూడా ఇక్కడ ప్రజా ప్రతినిధులుగా ఉన్నారు. పలు నియోజకవర్గాల్లో [more]
సీఎం జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీకి కీలక నేతలు ఉన్నారు. ముఖ్యంగా జగన్ సొంత బంధువులు కూడా ఇక్కడ ప్రజా ప్రతినిధులుగా ఉన్నారు. పలు నియోజకవర్గాల్లో [more]
సీఎం జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీకి కీలక నేతలు ఉన్నారు. ముఖ్యంగా జగన్ సొంత బంధువులు కూడా ఇక్కడ ప్రజా ప్రతినిధులుగా ఉన్నారు. పలు నియోజకవర్గాల్లో పార్టీలతో సంబంధం లేకుండా జగన్ ఫ్యామిలీకి క్రేజ్‌తో పాటు సొంత ఓటు బ్యాంకు ఉంది. ఇక, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి వంటి వారు కూడా సీనియర్లుగా ఉన్నారు. కొన్నాళ్లు వీరంతా డమ్మీలుగా మారుతున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. ఎవరి మాటా కూడా అధికారులు, జిల్లా కలెక్టర్ లెక్కచేయడం లేదని.. నాయకులు చెబుతున్నారు. కేవలం జిల్లాలో ఏం జరగాలన్నా.. ఒకే ఒక్క ఎంపీ చెబితేనే అవుతుందని.. అంటున్నారు.
పైకి చూసేందుకు….?
కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి పైకి చూసేందుకు సైలెంట్ గానే ఉన్నప్పటికీ.. రాజకీయంగా ఆయన జిల్లాపై చాలానే పట్టు సంపాదించారని చెబుతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఎంపీగా వరుస విజయాలు దక్కించుకున్న అవినాష్ రెడ్డి.. గత ఎన్నికల తర్వాత.. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అంతా తన చేతిమీదనే ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కనీసం ఎమ్మెల్యేలకు కూడా సమాచారం ఇవ్వకుండానే ఆయన పర్యటిస్తున్నారని, ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ఆయన ప్రారంభోత్సవాలు చేస్తున్నారని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.
అందరిలో అసంతృప్తి…..
అవినాష్ రెడ్డి దూకుడుగాపై కొన్నాళ్ల కిందట ప్రభుత్వ విప్.. శ్రీకాంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కారణం స్పష్టంగా తెలియకపోయినా శ్రీకాంత్‌రెడ్డి సైలెంట్‌గా ఉండడానికి రాష్ట్ర స్థాయిలో కాదు కదా.. కనీసం జిల్లా స్థాయిలోనూ తనకు అంత ప్రాధాన్యత లేదని వాపోతున్నారట. మీడియా ముందుకు తరచుగా వచ్చి.. ప్రభుత్వ కార్యక్రమాలను వివరించడం, ప్రతిపక్ష నేతలపై విమర్శలు సంధించడం కూడా మానుకున్నారు. తనను అడిగితేనే అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఇక, కడప ఎమ్మెల్యే కమ్ మంత్రి అంజాద్ బాషా కూడా నియోజకవర్గంలో పర్యటిస్తున్నా మంత్రి వద్దకు చిన్న పనులకు కూడా పార్టీ కేడర్ వెళ్లే పరిస్థితి లేదట.
ఇద్దరికి మధ్య..?
పైకి సఖ్యత వాతావరణం ఉన్నట్టు కనిపిస్తున్నా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి కూడా కోల్డ్‌వార్ ఉందని పార్టీ నేతల మధ్యే చర్చలు నడుస్తున్నాయి. సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అవినాష్‌ను ఏమీ అనలేని పరిస్థితి. సీఎంకు కజిన్ కావడంతో అవినాష్‌ను ఎదిరించే సాహసం ఎవ్వరూ చేయడం లేదు. కొందరు జగన్ బంధువులు మాత్రం సొంతగానే పనులు చేసుకుంటున్నారు. ఏదేమైనా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో సైలెంట్‌గా ఉన్న అవినాష్ రెడ్డి ఇప్పుడు కడప రాజకీయాల్లో కాకలు తీరిన నేతలను సైతం పక్కన పెట్టేసి పనులు చక్కపెట్టేస్తున్నారు.