అక్కడ వ్యూహం మార్చారు…!!!

సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాశ్మీర్ పై కన్నేసింది. ఈ శీతల సంపద రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రపతి [more]

Update: 2019-06-13 16:30 GMT

సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాశ్మీర్ పై కన్నేసింది. ఈ శీతల సంపద రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కాశ్మీర్ లో నడుస్తుంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ కీలక ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ ను పక్కన పెట్టి అధికారం కైవసం చేసకునేందుకు పావులు కదుపుతోంది. రాష్ట్రానికి ఇప్పటి వరకూ ప్రాంతీయ పార్టీలకు చెందని ముస్లింనేతలే ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ సంప్రదాయానికి గండికొట్టి కాశ్మీర్ పీఠంపై హిందూ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టాలని కమలనాధులు ఆలోచన. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఇదే సరైన మందు అన్నది కమలం పార్టీ నేతల ఆలోచన. గత కొంతకాలంగా, ముఖ్యంగా లోక్ సభ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి పార్టీ పెద్దలు ఇదే ఆలోచన చేస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు, కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆ దిశగానే సమాలోచనలు చేస్తున్నారు.

గవర్నర్ అధికారాలతో….

కాశ్మీర్ లోయ, జమ్మూ, లడక్ ప్రాంతాల సమాహారమే స్థూలంగా జమ్మూ కాశ్మీర్. కాశ్మీర్ లోయలోన 46, జమ్మూలోో 37, లడక్ లో నాలుగు అసెంబ్లీ స్థానాలు కలపి మొత్తం 87 అసెంబ్లీ స్థానాలున్నాయి. కాశ్మీర్ లో ముస్లింలు, హిందువులు, లడఖ్ లో బౌద్ధులు అధిక సంఖ్యలో ఉన్నారు. జనాభా పరంగా ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో అనేక మార్పులు వచ్చాయి. కాశ్మీర్ లోయలో జనాభా సంఖ్య తగ్గుతుండగా, జమ్మూలో వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా నియోజకవర్గాలను పునర్ వ్యవస్థీకరించాలన్నది కమలనాధుల వ్యూహం. దీనివల్ల జనాభా ప్రాతిపదికన జమ్మూలో నియోజకవర్గాలు పెరుగుతాయి. అదే సమయంలో కాశ్మీర్ లోయలో తగ్గుతాయి. గతంలో 1995లో చివరి సారిగా కె.కె. గుప్తా కమిషన్ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టింది. రాజ్యాంగం ప్రకారం ప్రతి పదేళ్ల కొకసారి పునర్ వ్యవస్థీకరణ చేయవచ్చు. కానీ 2002 లో అప్పటి ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా 2026 దాకా పున్ వ్యవస్థీకరణ అవసరం లేదంటూ జమ్మూకాశ్మీర్ రాజ్యాంగానికి సవరణ చేశారు. కానీ అసెంబ్లీ రద్దయి గవర్నర్ కొనసాగుతున్న తరుణంలో అసెంబ్లీ చేసిన నిర్ణయాన్ని తిరగదోడే అధికారం గవర్నర్ కు రాజ్యాంగం ప్రకారం ఉంది. 1993లో నాటి గవర్నర్ జగ్ మోహన్ పునర్విభజన ప్రక్రియ చేపట్టి నియోజకవర్గాల సంఖ్యను 87కు పెంచారు. ఇప్పుడు కూడా ఇదే విధానాన్ని పాటించాలన్నది కమలనాధుల వ్యూహం.

జనాభా ప్రాతిపదికన….

రాష్ట్రంలో విస్తీర్ణ పరంగా జమ్మూ పెద్దది. 25.93 విస్తీర్ణం గల ఈ ప్రాంతంలో 37 అసెంబ్లీ స్థానాలున్నాయి. జనాభా 53.78,538 మంది ఉన్నారు. 15.73 విస్తీర్ణం గల కాశ్మీర్ లో 68,88,4న75 మంది జనాభా. 46 అసెంబ్లీ స్థానాలున్నాయి. స్వాతంత్ర్యం వచ్చని తొలి రోజుల్లో అప్పటి ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా ఏక పక్షంగా కాశ్మీర్ లో 41, జమ్మూలో 37, లడఖ్ లో రెండు నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. తర్వాత లడఖ్ లో సీట్లను 4కు పెంచారు. ప్రతి ఎన్నికల్లో కాశ్మీర్ లోయలో నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీపీ) మధ్య పోటీ ఉంటుంది. ఈ ప్రాంతంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ బలం నామమాత్రమే. అదే విధంగా జమ్మూ, లడఖ్ లలో జాతీయ పార్టీల మధ్యే పోటీ ఉంటోంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీల బలం శూన్యం. కాశ్మీర్ లోయలో ఎక్కువ సీట్లు ఉన్నందున అక్కడ గెలిచిన పార్టీలే ఇప్పటి వరకూ రాష్ట్రాన్ని ఏలుతూ వస్తున్నాయి. కాశ్మీర్ లోయకు ధీటుగా జమ్ములో కూడా సీట్లు పెంచితే బలం పెంచుకోవచ్చని, హిందూ ముఖ్యమంత్రిని చూడవచ్చన్నది కమలం పార్టీ వ్యూహం.

అమర్ నాధ్ యాత్ర అనంతరం….

జమ్మూలో 11 శాతం ఉన్న గుజ్జర్లు, ఒకేర్వాలు, గడ్డీలకు షెడ్లూల్ తెగల హోదా ఇచ్చారు. అంతే తప్ప వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించలేదు. జమ్మూలో 12 శాతం ఎస్సీలున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) కోసం రిజర్వ్ చేసిన 13 సీట్లను జమ్ములో స్థిరపడ్డ పశ్చిమ పాకిస్థాన్ శరణార్థులు తమకు ఇవ్వాలని కోరుతున్నారు. బీజేపీ ఇందుకు సుముఖమే. ఈ నేపథ్యంలో జులై 1 నుంచి ప్రారంభం కానున్న అమర్ నాధ్ యాత్ర అనంతరం పునర్ వ్యవస్థీకరణ చేపట్టాలన్నది కమలం పార్టీ వ్యూహం. మరోపక్క ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతోంది. గత ఏడాది జూన్ 19న రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారు. అమర్ నాధ్ యాత్ర ఆగస్టు 15న ముగియనుంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ 28, బీజేపీ 25, నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ 12 సీట్లు సాధించాయి. ఈ నేపథ్యంలో జమ్మూలో, లడఖ్ ల్లో పునర్ వ్యవస్థీకరణ ద్వారా సీట్లను పెంచుకోగలిగితే అధికారం చేపట్టడం కష్టం కాదన్నది కమలం పార్టీ అంచనా. ఈ దిశగానే పావులు కదుపుతోంది. వ్యూహరచనలో దిట్ట అయిన అమిత్ షా ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News