ఇక్కడ మాత్రం టగ్ ఆఫ్ వార్
ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో అసోంలో మాత్రం పోటీ నువ్వా? నేనా? అన్నట్లు ఉంది. ఇక్కడ అధికార బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది. అనేక సర్వేలు [more]
ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో అసోంలో మాత్రం పోటీ నువ్వా? నేనా? అన్నట్లు ఉంది. ఇక్కడ అధికార బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది. అనేక సర్వేలు [more]
ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో అసోంలో మాత్రం పోటీ నువ్వా? నేనా? అన్నట్లు ఉంది. ఇక్కడ అధికార బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది. అనేక సర్వేలు కూడా ఈ విషయాన్ని వెల్లడించాయి. ఎన్డీఏకు కొంత ఎడ్జ్ ఉన్నట్లు కన్పిస్తున్నా చివరి నిమిషంలో కాంగ్రస్ పుంజుకునే అవకాశాలున్నాయని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ బీజేపీకి కాంగ్రెస్ గట్టిపోటీ ఇవ్వనుందని విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్నారు.
రాహుల్ స్పెషల్ కాన్సన్ ట్రేషన్…..
అందుకే రాహుల్ గాంధీ అసోం ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలున్నాయి. 64 మ్యాజిక్ ఫిగర్ గా ఉంది. ఇప్పటి వరకూ ఓపీనియన్ పోల్స్ చేసిన సర్వేల ప్రకారం ఎన్డీఏకు 69 స్థానాలు, యూపీఏకు 56 సీట్లు దక్కే ఛాన్సు ఉందని తేల్చాయి. అయితే చివరి నిమిషంలో మార్పులు జరగవచ్చని, ఫలితంలో మార్పు ఉండవచ్చని సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో అసోం ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
తరచూ పర్యటిస్తూ…..
ఈశాన్య రాష్ట్రమైన అసోంలో కాంగ్రెస్ దీర్ఘకాలం పాలించింది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడంతో ఓటమి పాలయింది. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. గత ఎన్నికలలో బీజేపీ అసోంలో 61 స్థానాలను గెలుచుకుంది. మిత్రపక్షాలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే అధికారంలో ఉండటంతో సహజంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేస్తుంది. అందుకే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తరచూ అసోంలో పర్యటిస్తున్నారు.
మోదీ, షాలు కూడా…..
ఇక బీజేపీ కూడా అసోం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండోసారి విజయావకాశాలు ఉండటంతో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు తరచూ అసోంలో పర్యటిస్తున్నారు. పౌరసత్వం చట్టంలో సవరణలు ఈసారి అసోం ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. అందుకే మోదీ, షాలు స్వయంగా వచ్చి అసోం ప్రజలకు వివరణ ఇచ్చుకుంటున్నారు. అయితే అసోంలో చివరి వరకూ గెలుపు ఎవరదనేది చెప్పడం కష్టమేనంటున్నారు విశ్లేషకులు.