Uttarpradesh : వీరు ఎందుకు పోటీ చేయడం లేదో?

ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలు విన్నా కన్నా విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ నాలుగు ప్రధాన పార్టీలు వచ్చే ఎన్నికలలో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ [more]

Update: 2021-11-12 16:30 GMT

ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలు విన్నా కన్నా విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ నాలుగు ప్రధాన పార్టీలు వచ్చే ఎన్నికలలో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీల మధ్య పోరు ఉంటుందని అంచనా. అయితే ఈ నాలుగు పార్టీలకు నాయకత్వం వహిస్తున్న నేతలు మాత్రం ఈ ఎన్నికలకు దూరంగా ఉంటుండటం చర్చనీయాంశం. ఒకరకవగా ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అంశమే.

పార్టీ కోసమేనా?

అఖిలేష్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చెప్పారు. అయితే పార్టీ గెలిస్తే ఆయనే ముఖ్యమంత్రి. అవుతాన్నది అందరికీ తెలిసిందే. ఆయన 2017లో జరిగిన ఎన్నికలలోనూ పోటీకి దూరంగా ఉన్నారు. సమాజ్ వాదీ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకే అఖిలేష్ యాదవ్ ఈసారి ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. పార్టీ క్యాడర్ లో ధైర్యం నింపేందుకు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు పోటీ చేయడం లేదు.

కింగ్ మేకర్ అవ్వాలని…

ఉత్తర్ ప్రదేశ్ లో మరో ముఖ్యమైన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఈ పార్టీ అధికారంలోకి వచ్చినా ముఖ్యమంత్రి మాయావతే. కానీ ఆమె కూడా పోటీకి సిద్ధంగా లేరు. మాయావతి ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ గా మారాలని భావిస్తున్నారు. ఎన్నికల తర్వాతే పొత్తులు పెట్టుకోవాలని మాయావతి భావిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు మాయావతి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇక మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ది కూడా ఇదే పరిస్థితి. ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఉత్తర్ ప్రదేశ్ లో నేతృత్వం వహిస్తున్నారు.

జాతీయ పార్టీలు కూడా….

ప్రియాంక గాంధీ పోటీపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ప్రియాంకగాంధీ పోటీ చేయడం కష్టమేనని తెలుస్తోంది. మరో జాతీయ పార్టీ బీజేపీలో కూడా అదే పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కూడా ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. ఆయన కూడా ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించడం లేదు. పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరనేది కూడా ఇప్పుడే చెప్పలేం. సో… ఉత్తర్ ప్రదేశ్ లోని నాలుగు రాజకీయ పార్టీలకు నేతృత్వం వహిస్తున్న నలుగురు నేతలు పోటీకి దూరంగానే ఉండనున్నారు.

Tags:    

Similar News