Andhra : ఇక చాల్లే… చూస్కో మా వాడు ప్రతి వోడూ ఈటలే అవుతాడు

రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో అనేక అంశాలపై క్లారిటీని తెచ్చాయి. అధికార పార్టీలు తమ సంక్షేమ పథకాలను చూసి ఓట్లేస్తారని అనుకోవడం భ్రమేనని తేలింది. [more]

Update: 2021-11-02 15:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో అనేక అంశాలపై క్లారిటీని తెచ్చాయి. అధికార పార్టీలు తమ సంక్షేమ పథకాలను చూసి ఓట్లేస్తారని అనుకోవడం భ్రమేనని తేలింది. పొరుగున ఉన్న తెలంగాణ లో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏపీ తెలుగుదేశం పార్టీలో ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. కుటుంబానికి పది లక్షల పథకం కూడా అక్కడ పనిచేయలేదంటే రేపు జగన్ కు కూడా ఇక్కడ అదే పరిస్థితి వస్తుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.

బద్వేలు రిజల్ట్…..

బద్వేలు ఉప ఎన్నికను సునాయాసంగా గెలవవచ్చు. అక్కడ ప్రధాన పార్టీలు ఏమీ బరిలో లేవు కాబట్టి భారీ మెజారిటీ దక్కి ఉండవచ్చు. కానీ ప్రజలను నగదు పథకాలతో కొనుగోలు చేద్దామనుకోవడం కుదరదని హుజూరాబాద్ ఉప ఎన్నిక తేల్చి చెప్పిందంటున్నారు. సమర్థత, అభివృద్ధి, సంక్షేమం వంటి వాటిని జనం నిశితంగా పరిశీలిస్తారని తెలంగాణలో అధికార పార్టీకి అర్థమయిందనే చెప్పాలి. ఇప్పుడు టీడీపీకి ఆ ఉప ఎన్నిక ఫలితంతో ఎక్కడ లేని ధైర్యం వచ్చింది.

సంక్షేమ పథకాలపైనే….

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాలను ప్రవేశపెట్టారు. నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో చెప్పిన సమయానికి బదిలీ చేస్తున్నారు. ఇప్పటి వరకూ 3.5 లక్షల కుటుంబాలకు దాదాపు లక్ష కోట్లకు పైగానే జగన్ లబ్ది చేకూర్చారు. టీడీపీని భయపెడుతున్నది నేటి వరకూ భయపెడుతున్నది అదే. ప్రజలు సంక్షేమ పథకాల మోజులో పడి టీడీపీ వైపు చూడరేమోనన్న భయం ప్రతి ఒక్క టీడీపీ నేతలోనూ కన్పించింది.

నాయకత్వం పనితీరుపై….

కానీ స్థానిక పరిస్థితులు, నియోజకవర్గంలో నాయకత్వం పనితీరు, ప్రజల్లో వారిపై ఉన్న నమ్మకం వంటివి సంక్షేమ పథకాలను కాదు గదా, కోట్లు కుమ్మరించినా గెలవలేరన్న విషయం హుజూరాబాద్ తో స్పష్టమయింది. ఇప్పుడు ఏపీలో జగన్ కూడా పునరాలోచించుకోవాల్సి ఉంటుంది. అభివృద్ధి పనులు, ఉపాధి అవకాశాల మెరుగుదల, పారిశ్రామికీకరణ వంటి వాటిపై దృష్టి పెట్టకపోతే.. టీడీపీలో ప్రతి నేతా ఈటలగా మారగలడన్న విషయాన్ని గుర్తించాలి. అయితే జగన్ కు ఇంకా మూడేళ్ల సమయం ఉండటంతో కేవలం సంక్షేమమే కాకుండా ప్రజల మనసులను మరింతగా గెలచుకునే అవకాశం ఉంది. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలతో టీడీపీలో జోష్ కన్పిస్తుంది.

Tags:    

Similar News