కధ ముగిసినట్లేనా?

అమరావతి రైతుల పోరాటం ఇపుడు ఎల్లో మీడియాలో సైతం పెద్దగా ప్రాముఖ్యతను నోచుకోవడంలేదు. మిగిలిన మీడియా మేనేజ్ మెంట్లు ఎపుడో ఈ ఇష్యూని అటకెక్కించేశాయి. జనాలకు ఆసక్తి [more]

Update: 2020-02-22 11:00 GMT

అమరావతి రైతుల పోరాటం ఇపుడు ఎల్లో మీడియాలో సైతం పెద్దగా ప్రాముఖ్యతను నోచుకోవడంలేదు. మిగిలిన మీడియా మేనేజ్ మెంట్లు ఎపుడో ఈ ఇష్యూని అటకెక్కించేశాయి. జనాలకు ఆసక్తి లేని, కేవలం కొన్ని వర్గాల పోరాటంగా మిగిలిన వారు చూస్తున్నారు. దాంతో అమరావతి రైతుల పోరాటం ఖాళీ ధియేటర్లో ఆడిస్తున్న సినిమా మాదిరిగా తయారైందని కూడా అంటున్నారు. ఫలానా రోజుకు చేరుకున్న ఉద్యమం అంటూ తేదీలు, అంకెలు చెప్పుకోవడం తప్ప అసలు దాని ప్రభావం ఏపీలో ఉందా అన్నది అందరిలో కలుగుతున్న ఆలోచన. ముఖ్యమంత్రి జగన్ అయితే అసలు పట్టించుకోలేదు. మరో వైపు మొదటి నుంచి తెగ హడావుడి చేసిన చంద్రబాబు ఇపుడు తన దారి తాను చూసుకుంటున్నారు.

చప్పబడిందా…?

చంద్రబాబుకు ఏ ఉద్యమం అయినా నాలుగు ఓట్లు రాలాలి. అదే అమరావతిలో కూర్చుంటే రెండు గ్రామాల ఓట్లు కచ్చితంగా వస్తాయి. ఏపీలో మాత్రం గుండు సున్నా అవుతుంది. తెలివైన నేత కాబట్టి తొందరగానే గ్రహించి ప్రజా చైతన్య యాత్రలు అంటూ జనంలోకి వస్తున్నారు. ఇక చంద్రబాబు దాదాపు రెండు నెలల వరకూ రాష్ట్రాన్ని పట్టి తిరుగుతారు. ఆయన ఆశలైతే అమరావతి రైతులకు ఇక లేవనుకోవాలి. బీజేపీ నేతలు సైతం సైలెంట్ గా ఉన్నారు. కేంద్రం మూడు రాజధానుల విషయంలో సానుకూలంగా ఉండడమే వారి సైలెంట్ కి కారణం.

ఇలా వచ్చి….

మరో వైపు జనసేనాని పవన్ కళ్యాణ్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఆయన అమరావతి రైతులకు తన మద్దతు తెలుపుతున్నారు తప్ప మూడు రాజధానులను ఆపలేనని కూడా పక్కా క్లారిటీగా చెప్పేస్తున్నారు. ఇపుడు పవన్ సినిమాలతో బిజీ అయిపోయారు. మరో వైపు వామపక్షాలకు సైతం ఆసక్తి లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో అమరావతి రైతుల ఉద్యమం అంటూ అనుకూల మీడియాలో వార్తలు తప్ప ఆ వేడి దాదాపుగా చల్లారినట్లేనని అంటున్నారు. ఇంకోవైపు శాస‌నమండలి రద్దు అవుతుందని అంటున్నారు. అదే జరిగితే సర్కార్ తన నిర్ణయాలను మరింత దూకుడుగా ముందుకు తీసుకుపోతుంది.

న్యాయమేనా…?

ఇక అమరావతి రైతుల విషయం చూసుకుంటే మరో పోరాటం ఫెయిల్ అయిందనే చెప్పాలి. దాన్ని రైతులు కూడా అంగీకరిస్తున్నారు. వారి చూపు ఇపుడు న్యాయ పోరాటం మీదనే ఉందిట. కోర్టులో కేసులు వేసి మూడు రాజధానుల ప్రతిపాదనను ఆపించాలని చూస్తున్నారుట. కోర్టులకు కావాల్సినది సెంటిమెంట్లు కాదు, అక్కడ చట్టాల్లో, ప్రభుత్వ విధానాల్లో తప్పులు ఏమైనా జరిగితే పట్టుకుని అక్కడికి ఆ ప్రయత్నాన్ని ఆపుతాయి. దానికి కూడా జగన్ సర్కార్ ప్రిపేర్ గా ఉంది. సరైన వివరాలతో న్యాయస్థానంలో తన వాదనలు వినిపించేందుకు సిధ్ధపడుతోంది. మొత్తానికి చూసుకుంటే కోర్టులు ఆపితేనే తప్ప అమరావతి కధ మాత్రం ఇప్పటికైతే ముగిసిపోయినట్లేనని అంతా అంటున్నారు.

Tags:    

Similar News