పేద రాష్ట్రం సిఎం ఒక్క పూట దీక్ష ఖర్చు పదికోట్లే ?
ఒక పక్క రాష్ట్రం అడుక్కుతింటుంది అంటారు. మరో పక్క ప్రత్యేక విమానాల్లో యాత్రలు సాగుతాయి. దీనికి తోడు కేంద్రం చిల్లుగవ్వ ఇవ్వడం లేదని నిత్య స్త్రోత్రం ఎలానూ [more]
ఒక పక్క రాష్ట్రం అడుక్కుతింటుంది అంటారు. మరో పక్క ప్రత్యేక విమానాల్లో యాత్రలు సాగుతాయి. దీనికి తోడు కేంద్రం చిల్లుగవ్వ ఇవ్వడం లేదని నిత్య స్త్రోత్రం ఎలానూ [more]
ఒక పక్క రాష్ట్రం అడుక్కుతింటుంది అంటారు. మరో పక్క ప్రత్యేక విమానాల్లో యాత్రలు సాగుతాయి. దీనికి తోడు కేంద్రం చిల్లుగవ్వ ఇవ్వడం లేదని నిత్య స్త్రోత్రం ఎలానూ ఉంటుంది. కనీసం ఆర్ధిక లోటు పూడ్చడం లేదని జీతాలకే డబ్బులు లేవని గోలగోల వినపడుతుంది. అలాంటి డబ్బున్న పేద ముఖ్యమంత్రి హోదాలో ఎపి ముఖ్యమంత్రి ధర్మ పోరాటం పేరిట పదికోట్ల రూపాయల ప్రజాధనం తో హస్తినలో ఒక పూట దీక్ష తలపెట్టారు. అదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు తెరతీసింది.
అంత సొమ్ము దేనికంటే …?
ఢిల్లీ లో తెలుగుదేశం అధినేత నిరసన దీక్షకు అంత ఖర్చు ఎందుకు అని తెలుసుకుంటే షాక్ అవ్వలిసిందే. బాహుబలి సినిమా బడ్జెట్ తరహాలో రాయలసీమ, ఉత్తరాంధ్ర ల నుంచి రెండు ప్రత్యేక రైళ్ళు ఢిల్లీ కి బుక్ అయ్యాయి. ఈనెల 11 న చంద్రబాబు దీక్ష చేపట్టే ఎపి భవన్ వద్దే భోజన, వసతి సౌకర్యాలు అన్ని వచ్చిన వారికి ఏర్పాట్ల కోసం ఈ సొమ్ము వెచ్చించనున్నారుట. వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా కార్పొరేట్ తరహా ఏర్పాట్లు కోసం ఆ మాత్రం ఖర్చు మామూలే కదా. ఈ దీక్షకు ప్రతి ఉద్యోగ సంఘం 500 లమందికి తక్కువ కాకుండా తరలించాలని ఆయా శాఖల ఉన్నత అధికారులు మౌఖిక ఆదేశాలు ఇవ్వడం మరింత విశేషం.
పోలవరం సందర్శనకు ఇదే తీరు…
ఎన్నికల ముందు ఎంత ప్రచారం చేసుకుంటే అంత లాభం గా అధికార పార్టీ తలపోస్తుంది. బాబు దీక్షకు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నట్లే పోలవరం ప్రాజెక్ట్ సందర్శన పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని గోదాట్లో పోస్తుంది టిడిపి సర్కార్. ఆర్టీసీ బస్సుల్లో 13 జిల్లాల్లోని ప్రజలను పార్టీ క్యాడర్ సాయంతో తరలించి వారికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ప్రచార ఆర్భాటం వినూత్న రీతిలో సర్కార్ సాగిస్తుంది.
మాయావతి కేసు చెంప పెట్టు ….
తాజాగా యుపి ముఖ్యమంత్రి మాయావతి అధికారంలో ఉండగా ఇలాగే తమ పార్టీ ఎన్నికల గుర్తు ఏనుగు, కాన్సీరాం, తన విగ్రహాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దీనిపై ఇద్దరు న్యాయవాదులు ప్రజాధనం ఇలా ఖర్చు చేయడం ఏమిటంటూ సుప్రీం తలుపు తట్టారు. ఆ కేసు ఇప్పుడు మాయావతి మెడకు చుట్టుకుంది. ఆ విగ్రహాల కు పెట్టిన ఖర్చు చెల్లించి తీరాలని సుప్రీం కోర్ట్ బహుజన సమాజ్ పార్టీకి స్పష్టం చేసింది. ఇదే తీరులో పలు రాష్ట్రాల్లో తమ పార్టీ ప్రయోజనాలకోసం విచ్చలవిడిగా జనం సొమ్ము ధారపోస్తే ఎదో ఒక రోజు వడ్డీ తో సహా చెల్లించాలిసి వస్తుందని సుప్రీం తాజా ఆదేశాలు అన్ని పార్టీలకు చెంపపెట్టు లాంటిదే. ఇలాంటి పరిస్థితి చూసైనా రాజకీయ పార్టీల్లో కొంతైనా మార్పు వస్తుందో లేదో చూడాలి.