ఆ ప్రయోగానికి బాబు ఇష్టపడటం లేదట

చంద్రబాబుకు దాదాపుగా 2024 ఎన్నికలే చివరివి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన వయోభారంతో ఉన్నారు. 2024 నాటికి బాబు వయసు డెబ్బై అయిదేళ్లకు చేరువ అవుతుంది. అక్కడ [more]

Update: 2021-09-10 08:00 GMT

చంద్రబాబుకు దాదాపుగా 2024 ఎన్నికలే చివరివి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన వయోభారంతో ఉన్నారు. 2024 నాటికి బాబు వయసు డెబ్బై అయిదేళ్లకు చేరువ అవుతుంది. అక్కడ నుంచి మరో అయిదేళ్ళ వరకూ వేచి చూడడం అంటే కుదిరే పని కాదు. అందువల్ల చంద్రబాబు తాడో పేడో తేల్చుకోవడానికి ఈ ఎన్నికలనే తీసుకుంటున్నారు అంటున్నారు. ఇక లోకేష్ తనకంటూ యంగ్ టీమ్ ని ఏర్పాటు చేసుకుని వారికే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ పెడుతున్నారుట. అయితే చంద్రబాబు మాత్రం ఏ హామీ ఇవ్వలేకపోతున్నారు అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబుకు తెలుసు. వచ్చే ఎన్నికలు ఎంత గట్టిగా జరుగుతాయో. ఏ మాత్రం అనుభవం లేకపోయినా కూడా అధికార వైసీపీని తట్టుకోలేరు సరికదా పూర్తిగా తుళ్ళిపోతారు.

లోకేష్ మీద…?

దాంతో చంద్రబాబు సీనియర్లను విడిచిపెట్టడంలేదు అంటున్నారు. చంద్రబాబుకు ఆ విధంగా నమ్మకం కలుగచేసే యువ నాయకులు కూడా కనిపించడంలేదుట. ఆ మాటకు వస్తే లోకేష్ కూడా చంద్రబాబుకు ఈ రోజు వరకూ ఎటువంటి నమ్మకం కలిగించలేకపోయారు అన్నది కూడా నిజం. చినబాబు స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడుతున్నారు తప్ప స్పాంటేనియస్ గా మాట్లాడడం, జనాల‌ను అకట్టుకోవడం, లోతైన విశ్లేషణ చేయడం వంటివి మాత్రం నేర్చుకోలేదని అంటున్నారు. ఈ పరిస్థితులలో లోకేష్ మాట వింటే ఇబ్బందే అని చంద్రబాబు అనుకుంటున్నార‌ట.

సీనియర్లనే…..?

ఇక సీనియర్లలో ఓపిక ఉన్న వారు, మళ్ళీ పోటీ చేస్తే… జనాలలో గెలుపు అవకాశాలు ఉన్న వారికి టికెట్లు ఇవ్వడానికి చంద్రబాబు డిసైడ్ అయ్యారని తాజా టాక్. అంతే కాదు, 2024 ఎన్నికలలో ఎటువంటి కొత్త ప్రయోగాలు చేయకూడదని కూడా చంద్రబాబు భావిస్తున్నారుట. ఇది ప్రయోగాలకు సమయం కాదు అని కూడా ఆయన అంచనా వేసుకుంటున్నట్టు పార్టీ వ‌ర్గాలే చెప్పుకుంటున్నాయి. మరి చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు కొత్త ఆలోచనలు చేయరు, విపక్షంలో ఉన్నపుడు కూడా అంతకంటే రిస్క్ చేయరు. ఇలాగైతే పార్టీలో కొత్త నీరు ఎలా వస్తుంది అన్నది తమ్ముళ్ల బాధగా ఉందిట.

రిస్క్ చేయడానికి…?

పేరుకు మాత్రం యువ‌త‌కు టిక్కెట్లు ఇస్తాం.. యువ‌త‌ను ఎంక‌రేజ్ చేస్తామ‌ని చెపుతున్నా చేత‌ల్లో మాత్రం అది లేద‌నే అంటున్నారు. అయితే చంద్రబాబు ఆలోచనలు కూడా ఈ సమయంలో కరెక్టే అని అంటున్న వారూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ అతి పెద్ద రాజకీయ సంక్షోభంలో ఉంది. చంద్రబాబు తప్ప మరో నాయకుడు వద్దు అనడం వల్లనే కదా అయన ఈ వయసులో కూడా భారాన్ని మోస్తోంది. అదే పరిస్థితి నియోజకవర్గాలలో ఉందిట. మొత్తానికి చంద్రబాబు ఎపుడూ సీనియర్లకే ఓటు చేస్తారు అన్నది మరో మారు రుజువు అవుతోంది అంటున్నారు.

Tags:    

Similar News