బాబు కొత్త నిర్ణయాలు ఆయ‌న‌కే షాక్ ఇచ్చేలా ఉన్నాయే?

టీడీపీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పార్టీని లైన్‌లో పెట్టేందుకు టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్రబాబు వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయ‌న పార్టీ పొలిట్ [more]

Update: 2021-08-30 02:00 GMT

టీడీపీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పార్టీని లైన్‌లో పెట్టేందుకు టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్రబాబు వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయ‌న పార్టీ పొలిట్ బ్యూరో స‌హా.. సీనియ‌ర్లతోనూ గంట‌ల త‌ర‌బ‌డి భేటీ అయ్యారు. దీనికి ప్రధాన కార‌ణం.. జ‌గ‌న్ ప్రభుత్వం ముంద‌స్తు ఎన్ని క‌ల‌కు వెళ్తుంద‌ని.. త్వర‌లోనే దీనిపై ప్రక‌ట‌న చేస్తార‌ని.. వార్తలు వ‌స్తుండ‌డ‌మే. అంతేకాదు.. ప్రస్తుతం సిమ్లా టూర్‌లో ఉన్న సీఎం జ‌గ‌న్‌.. వ‌చ్చి రావ‌డంతోనే ముంద‌స్తుకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేసే అవ‌కాశం ఉంద‌ని.. ప్రచారం జ‌రుగుతోంది. దీంతో వెంట‌నే చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. ముంద‌స్తు ఎన్నిక‌లంటే ఓ ఏడెనిమిది నెల‌లు ముందుగానే ఉంటాయని.. అందుగు అనుగుణంగానే దస‌రాకే మంత్రి వ‌ర్గంలో మార్పులు చేసి జ‌గ‌న్ మ‌రింత దూకుడుగా వెళ్లేలా ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.

సుదీర్ఘ భేటీలో….

ఈ క్రమంలోనే చంద్రబాబు పార్టీ నేత‌ల‌తో భేటీ అయ్యారు. నియోజ‌క‌వ‌ర్గాల‌పై స‌మీక్ష చేప‌ట్టారు. సీమ నుంచి విజ‌య‌న‌గ‌రం వ‌ర‌కు.. 175 నియోజ‌క‌వ‌ర్గాల‌పైనా.. ఓ గంట పాటు స‌మీక్షించారు. కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు.. పార్టీ గెలుపు గుర్రం ఎక్కేందుకు వీలున్న నియోజ‌క‌వ‌ర్గాలు.. నేత‌లు.. ఇలా అన్ని అంశాల‌పైనా.. సీనియ‌ర్లతోను, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు.. అచ్చెన్నాయుడుతోనూ చంద్రబాబు చ‌ర్చించారు. ఈ క్రమంలో కొన్ని కీల‌క నిర్ణయాలు తీసుకున్నారు. కురువృద్ధుల‌ను ప‌క్కన పెట్టాల‌ని ప్రాథ‌మికంగా తీర్మానం చేశారు. అంటే.. 65 ఏళ్లు పైబ‌డిన వారిని ప‌క్కన పెట్టి వారి సేవ‌లు పార్టీకి వినియోగించుకోవాల‌ని నిర్ణయించారు.

లోకేష్ కు అప్పగించాలని….?

అదే స‌మయంలో వార‌సుల‌కు ఎక్కువ‌గా సీట్లు ఇచ్చే ప్రతిపాద‌న‌ను .. లోకేష్‌కు అప్పగిస్తూ.. నిర్ణయించారు. వార‌సుల ప‌నితీరును అంచ‌నా వేయ‌డం.. వారిలో ఎవ‌రికి టికెట్‌లు ఇవ్వాలి? అనే విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే బాధ్యత‌ల‌ను ఆయ‌న‌కు అప్పగించ‌నున్నారు. ఇక‌, ఇప్పటికే గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ పొంది ఓడిపోయి.. నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోని నేత‌ల‌ను కూడా ప‌క్కన పెట్టి..కొత్తవారికి అవ‌కాశం ఇవ్వాల‌ని చంద్రబాబు చెప్పుకొచ్చార‌ట‌. ఇలా అనేక మార్పులు చేర్పుల‌కు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు.. రెడ్డి వ‌ర్గానికి ప్రాధాన్యం పెంచాల‌ని నిర్ణయించుకున్నారు. ఇలా మొత్తంగా.. భారీ మార్పుల దిశ‌గా చంద్రబాబు ప్రయ‌త్నం చేస్తున్నారు.

సీనియర్లను పక్కన పెట్టడం….

ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల్లో కురువృద్ధుల‌ను ప‌క్కన పెట్టడం పార్టీకి ఇబ్బంది క‌దా! అంటున్నారు ప‌రిశీల‌కులు. వారు మ‌ళ్లీ పోటీ చేసేందుకు రెడీగా ఉన్నా.. చంద్రబాబు ప‌క్కన పెట్టడం స‌రైంది కాదని చెబుతున్నారు. వ‌య‌సుతో పోల్చుకుంటే.. చంద్రబాబుకూడా.. పోటీ నుంచి తప్పుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో యువ‌త‌కు ప్రాధాన్యం అంటే.. వార‌సుల‌కు కాద‌ని.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ వాద‌న వచ్చిన వ‌విష‌యాన్ని చెప్పుకొస్తున్నారు. ఇలా మొత్తంగా .. చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయాల‌పై పెద‌వి విరిచే ప‌రిస్థితి అయితే పార్టీలోనే వ‌చ్చింది.

Tags:    

Similar News