చంద్రబాబు అదే రాజకీయం ?

అన్ని వైపులా ముప్పేట దాడి మొదలైంది. ఒక పక్క నేతలు చెల్లాచెదురైపోతున్నారు.కార్యకర్తలు మనోధైర్యం కోల్పోతున్నారు. సంక్షోభం నుంచి అవకాశాన్ని వెతుక్కుంటా అనే టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పుడు [more]

Update: 2019-07-01 06:30 GMT

అన్ని వైపులా ముప్పేట దాడి మొదలైంది. ఒక పక్క నేతలు చెల్లాచెదురైపోతున్నారు.కార్యకర్తలు మనోధైర్యం కోల్పోతున్నారు. సంక్షోభం నుంచి అవకాశాన్ని వెతుక్కుంటా అనే టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పుడు ఆ పనిలో బిజీగా వున్నారు. మిన్ను విరిగి మీద పడినా కూల్ గా తన రాజకీయాన్ని నడిపించాలని ఆయన చూస్తున్నారు. వైసిపి, బిజెపి లనుంచి ఎదురౌతున్న సమస్యలను బాబు ఎదుర్కొనే తీరుపైనే క్యాడర్ లో ధైర్యం ఏర్పడుతుంది. కనుక ఆచితూచి వైసిపి రాజకీయాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధం అయ్యారు.

ఎన్నికల ముందు చేసినవే ఇప్పుడు …

పొరుగు రాష్ట్రం తో మంచి సంబంధాలు అభివృద్ధి కి సోపానాలు అని ఎపి ముఖ్యమంత్రి జగన్ యోచిస్తున్నారు. జగన్ ఆలోచనలకు తగినవిధంగానే కెసిఆర్ స్పందించి ముందుకు వచ్చారు. ఒకరకంగా టి సిఎం ఈ విషయంలో మరింత చొరవ చూపుతున్నారు. ఎన్నికల ముందు కెసిఆర్ ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి రావాలని కోరుకున్నారు. ఆ అంశాన్నే తన ఎన్నికల ప్రధాన విమర్శనాత్మకంగా మార్చుకుని టిడిపి అధినేత చంద్రబాబు ఫ్యాన్ స్విచ్ తెలంగాణ లో ఉందంటూ దాడి మొదలు పెట్టారు. అయితే ప్రజలు ఈ అంశానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు అవే ఆరోపణలు పదేపదే చేయడం ద్వారా కెసిఆర్ ఎపి ని వంచించి లబ్ది పొందుతున్నారనే వాదన గట్టిగా ప్రజల్లో నాటే ప్రయత్నం మొదలు పెట్టారు బాబు బృందం.

టి కుట్ర అంటూ ఆ విధంగా ముందుకు …

మన భవనాలు వారికి ఇచ్చేశారు, మన నీళ్ళు వాళ్ళు పట్టుకుపోయే కుట్ర జరుగుతుంది. ఇలా ప్రతి అంశం జనం మదిలో చొప్పిస్తే వచ్చే ఎన్నికల నాటికి తమకు సానుకూలం అవుతుందని టిడిపి అధినేత చంద్రబాబు లెక్కగా కనిపిస్తుంది. సెంటిమెంట్ అస్త్రాలతో పూర్తి పాజిటివ్ ఓటుతో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ పై నెగిటివ్ రావడం ఇప్పట్లో సాధ్యం కాదు కనుక ఈ రూట్ లో వెళ్లడమే సరైనదని బాబు ఆలోచన అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ వ్యూహాన్ని ఎపి సీఎం జగన్ ఎలా తిప్పికొడతారో చూడాలి.

Tags:    

Similar News