బాబు అంచనాలు నిజమే అయితే

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ పై ప్రేమను ఏ మాత్రం వదులుకోలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ దాదాపు తెలంగాణాలో భూస్థాపితం అయిపొయింది. ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ [more]

Update: 2019-07-12 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ పై ప్రేమను ఏ మాత్రం వదులుకోలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ దాదాపు తెలంగాణాలో భూస్థాపితం అయిపొయింది. ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన రెండు చోట్లా రాణించడం దేశ చరిత్రలో లేనే లేదు. అలా రెండు పడవలపై కాళ్ళు వేసిన ఫలితం రెండిటికి చెడ్డ రేవడిలా టిడిపికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో షాక్ తగిలింది. అయినా వెనక్కి తగ్గేందుకు చంద్రబాబు ఏమాత్రం సిద్ధంగా లేరు.

ఎంత శ్రమించినా …..

గత 2014 నుంచి 2019 వరకు తెలంగాణ లో జరిగిన ఎన్నికలు పరిశీలిస్తే అక్కడ టిడిపి ఉనికి నామమాత్రం అని ఫలితాలు చెప్పేశాయి. జిహెచ్ఎంసి నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు తెలుగుదేశం దిగజారుతూనే వచ్చింది. పోతే పోనీ అనుకుంటే ఏపీలో సైతం ఘోర ఓటమితో పడిపోయింది టిడిపి. ఆంధ్రప్రదేశ్ లో పవర్ ఉండటంతో ఇక్కడి పార్టీ నిధులతో తెలంగాణ లో అరకొరగా మిగిలిన వారిని జారిపోకుండా బాబు పెట్టుబడితో అడ్డుకుంటూ వస్తున్నారు. అయితే ఈ శ్రమ అంతా వృధా ప్రయాసగా మిగిలింది.

ఇప్పుడు మునిసిపల్ ఎన్నికలపై …

తెలంగాణ లో మునిసిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి . ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు టిడిపి అధినేత చంద్రబాబు. లీడర్లు పోయినా క్యాడర్ పటిష్టంగా ఇంకా ఉందని భావిస్తున్న చంద్రబాబు ఎప్పటికైనా తెలంగాణ లో పట్టు సాధిస్తామన్న నమ్మకంతో క్యాడర్ చెదిరిపోకుండా ఉండేందుకు పోరాడుతూనే వుండాలని డిసైడ్ అయ్యారు. ఒక పక్క ఏమాత్రం ఉనికి లేని బిజెపి సైతం తెలంగాణ ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలు దక్కించుకోవడంతో ఏదో ఒక రోజు తమదౌతుందన్న నమ్మకాన్ని పెట్టుకున్నారు బాబు. ఆ వ్యూహంలో భాగంగానే గ్రామస్థాయి నుంచి నిర్మాణంలో వున్న పార్టీ పునాదులను బలహీనపరుచుకోరాదని భావించి సమరశంఖం పూరిస్తున్న చంద్రబాబు అంచనాలు ఏ మేరకు నిజం అవుతాయో చూడాలి.

Tags:    

Similar News