చాలీస్ సాల్‌కే బాద్ ఏక్ నిరంజన్

నలభై ఏళ్ళ ఇండస్ట్రీ.. పద్నాలుగేళ్ళ సీఎమ్. మూడొందల డబ్బై కోట్ల కుంభకోణంలో అరెస్టయితే స్పందించినవారు ఎందరు?

Update: 2023-09-10 14:17 GMT

నలభై ఏళ్ళ ఇండస్ట్రీ.. పద్నాలుగేళ్ళ సీఎమ్. మూడొందల డబ్బై కోట్ల కుంభకోణంలో అరెస్టయితే స్పందించినవారు ఎందరు?

మాజీ సీఎమ్ చంద్రబాబు నాయుడును నిన్న ఏపీ సీబీఐ అరెస్ట్ చేసిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లో అల్లర్ల వాతావరణం చెలరేగింది. రాష్ట్రవ్యాప్తంగా టీడిపి క్యాడర్, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రులు అరెస్ట్‌ను ఖండించారు. వాళ్లతో పాటు చంద్రబాబును ప్రోత్సహించే మేధావి వర్గంతో పాటు కొందరు మాజీ ఎమ్మెల్యే ఎంపీలు ఆ సంఘటనని ఖండించారు.

తను సీఎమ్ గా ఉన్నప్పుడు విజనరీ లీడర్ అంటూ దేశవిదేశాల ప్రతినిధులు, సీఎమ్ లను తనవద్దకు రప్పించుకున్న ఏ వ్యాపారవేత్తా, ఏ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై స్పందించలేదు‌. 2018 కర్నాటక ఎన్నికలలో బిజేపి కి యాంటీగా పనిచేసిన చంద్రబాబు.. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలను కలిసి ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేశారు. కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ కూడా చేశారు. ఆ రాష్ట్రంలో హంగ్ ఫలితాలు వచ్చాక.. దేవేగౌడ, సోనియాగాంధీలు సంధి చేసుకుని అలయన్స్ ప్రభుత్వం ఏర్పడింది.
ఆ సమయంలో చంద్రబాబుతో సహా అతని వర్గం మొత్తం ఆ క్రెడిట్ తమపై వేసుకున్నారు. బెంగళూరు విదానసౌధ ముందు జరిగిన కుమారస్వామి ప్రమాణ స్వీకారం సమయంలో మొత్తం 26 ప్రతిపక్షాల అధ్యక్షులు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు ఆ కార్యక్రమానికి హాజరవడమే కాక.. వచ్చే ఎన్నికలలో కేంద్రంలో చక్రం తిప్పేది మేమే అంటు కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల వరకూ చంద్రబాబు నాయుడు మోడీఏతర పక్షాల ఎందరో నేతలను కలిసి వాళ్ళ మద్దతు తీసుకున్నారు‌. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపి అత్యంత అవమానకర ఓటమిని చవిచూసింది‌. ఆ దెబ్బకి దేశ రాజకీయాలను పక్కనపెట్టి.. కేవలం అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకే పరిమితమైపోయారు‌. నాటి నుంచి నేటివరకూ చంద్రబాబు  అమరావతి భూములు వాటిపై తన పెత్తనాన్ని కాపాడుకునే ప్రయత్నం లోనే కొనసాగుతున్నారు‌.
ఈ ప్రాసెస్‌లో కేంద్రంలోనే చక్రం తిప్పాలనుకున్న బాబుకు.. ఆ నాడు మద్దతిచ్చిన ఏ ఒక్క లీడర్ కూడా నేటి అరెస్ట్ పై స్పందించడం లేదు. మమతా బెనర్జీ,  దేవేగౌడ, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, పినరై విజయన్, నితిష్ కుమార్, మాయావతి వంటి ఒకప్పటి నేస్తాలు కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.
బిజేపితో పేచి పెట్టుకున్న చంద్రబాబుకి కొత్తగా ఏర్పడుతున్న ఇండియా కూటమి నుంచి ఏ ఒక్కరి మద్దతూ వినిపించలేదు. విజనరీ, విజనరీ అని గొప్పలు చెప్పుకుని గప్పాలు కొట్టుకున్న బాబుకు ఇవాళ భరోసా ఇచ్చే స్నేహితుడే కరువయ్యాడు.


Tags:    

Similar News