Badvel : బద్వేలు బంపర్ ఆఫర్ అదిరిపోలా?
ఒకసారి ఎమ్మెల్సీ పదవి అంటే ఓకే. కానీ మరోసారి పదవి రెన్యువల్ కావాలంటే.. ఆ నేతకు సత్తా అయినా ఉండాలి. ఆయనతో పార్టీ కి భవిష్యత్ అవసరమయినా [more]
ఒకసారి ఎమ్మెల్సీ పదవి అంటే ఓకే. కానీ మరోసారి పదవి రెన్యువల్ కావాలంటే.. ఆ నేతకు సత్తా అయినా ఉండాలి. ఆయనతో పార్టీ కి భవిష్యత్ అవసరమయినా [more]
ఒకసారి ఎమ్మెల్సీ పదవి అంటే ఓకే. కానీ మరోసారి పదవి రెన్యువల్ కావాలంటే.. ఆ నేతకు సత్తా అయినా ఉండాలి. ఆయనతో పార్టీ కి భవిష్యత్ అవసరమయినా ఉండాలి. లేకుంటే పార్టీ కోసం ఆయన పడిన శ్రమ అయినా ఉండాలి. ఈ మూడింటిలో ఏదైనా కావచ్చు. జగన్ మాత్రం కడప జిల్లాకు చెందిన గోవింద రెడ్డిని ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేశారు. ఎమ్మెల్యే కోటా కింద గోవింద రెడ్డి రెండోసారి ఎమ్మెల్సీ కాబోతున్నారు.
పదవీ కాలం పూర్తికావడంతో…
గోవిందరెడ్డి 2014లో ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన పదవీ కాలం ఇటీవలే పూర్తయింది. ఇంతలోనే బద్వేలు ఉప ఎన్నిక వచ్చింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణించడంతో ఉప ఎన్నిక వచ్చింది. గోవింద రెడ్డి బద్వేలు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా జగన్ దాసరి సుధను ఎంపిక చేసిన నాటి నుంచి అక్కడ ప్రచార బాధ్యతలను గోవిందరెడ్డి భుజాన వేసుకున్నారు.
ఆరు నెలల ముందు నుంచే…
ఎన్నికల నోటిఫికేషన్ రాకపోయినా దాదాపు ఆరు నెలల ముందు నుంచి గోవిందరెడ్డి వైసీపీ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవసరమైన కసరత్తులను ప్రారంభించారు. జగన్ చేత అక్కడ ప్రారంభోత్సవాలను కూడా అట్టహాసంగా చేయించారు. అభివృద్ధి పనులను దగ్గరుండి చూసుకున్నారు. బద్వేలు అభివృద్ధి అంతా తానే చూసుకుంటానని స్థానికులలో భరోసా నింపగలిగారు.
మెజారిటీ సయితం….
ఇక ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి పార్టీని అంతా తానే దగ్గరుండి నడిపించారు. జగన్ ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూసుకున్నారు. ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం కావడంతో గోవిందరెడ్డి హవానే అక్కడ సాగుతుంది. అందుకే తాను ముందుండి ఎన్నికల వ్యవహారాన్ని చూసుకున్నారు. జగన్ ఆశించినట్లు లక్ష మెజారిటీని దాదాపు సాధించిపెట్టారు. దీంతో జగన్ గోవింద రెడ్డికి మరోసారి ఎమ్మెల్సీ పదవిని ఖరారు చేశారు. మొత్తానికి బద్వేలు బంపర్ ఆఫర్ అదిరిపోయిందిగా?