టీడీపీ మ‌రింత బ‌లోపేతం.. అవుతుందా ?

ప్రస్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. టీడీపీ మ‌రింత పుంజుకుంటుందా? అనే ఆలోచ‌న తెర‌మీదికి వ‌స్తోంది. అదేంటి? అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది.. అస‌లు లాజిక్కు అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్రస్తుతం [more]

Update: 2021-05-26 02:00 GMT

ప్రస్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. టీడీపీ మ‌రింత పుంజుకుంటుందా? అనే ఆలోచ‌న తెర‌మీదికి వ‌స్తోంది. అదేంటి? అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది.. అస‌లు లాజిక్కు అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్రస్తుతం టీడీపీ ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంది. ఈ క్రమంలో పార్టీని బ‌తికించుకునేందుకు ఆపార్టీ నేత‌లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే.. ఇది అంత ఈజీగా ముందుకు సాగేలా క‌నిపించ‌డం లేదు. ఈ క్రమంలో నేత‌లు త‌లలు పట్టుకుంటున్నారు. ప్రజ‌ల నుంచి సింప‌తీని ఎలా సంపాయించుకోవాలి ? అని నేత‌లు భావిస్తున్నారు.

సానుభూతి వస్తున్న సమయంలో…?

ఈ స‌మ‌యంలో జ‌గ‌న్ ప్రభుత్వం ఒక్కొక్కొ నేత‌ను అరెస్టు చేయ‌డం.. వారిని జైలుకు త‌ర‌లించ‌డం వంటి ప‌రిణామాలు టీడీపీపై సానుభూతి, సానుకూల ప‌వ‌నాలు ప‌రిమ‌ళింప‌జేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ విష‌యంలోనే టీడీపీ నేతలు కూడా దృష్టి పెట్టార‌ని అంటున్నారు. “మేం ప్రజ‌ల్లో ఉన్నంత కాలం సింప‌తీ రాలేదు. కానీ, ఇప్పుడు మా నాయ‌కులు అరెస్టు అవుతుంటే.. వీరి విష‌యంలో ప్రజ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న అనూహ్యంగా ఉంది“ అని రాష్ట్రానికి చెందిన కీల‌క నేత ఒక‌రు వ్యాఖ్యానించారు. ఇది నిజ‌మే అనిపిస్తోంది. ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్ ఎడిసోడ్‌లో టీడీపీకి అదే క‌నిపించింది.

అరెస్ట్ సమయంలోనూ….

గ‌తంలో కొల్లు ర‌వీంద్ర అరెస్టు స‌మ‌యంలోనూ.. ఇప్పుడు ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్ ఎపిసోడ్‌లోనూ.. యువ‌త అనూహ్యంగా స్పందించారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే వారిని అరెస్టు చేసింద‌ని వ్యాఖ్యానించారు. సోష‌ల్ మీడియాలోనూ సానుకూల వ్యాఖ్యలే వ‌చ్చాయి. ఇక‌, ఆయా అరెస్టుల‌పై చ‌ర్చలు జ‌రిగిన‌ప్పుడు కూడా పాజిటివ్ వ్యాఖ్యలు రావ‌డం.. టీడీపీకి సింప‌తీ పెరిగింద‌నే అనిపించింది. మ‌రి జ‌గ‌న్ చేస్తున్న కేసుల రాజ‌కీయం .. వైసీపీకి క‌లిసి వ‌చ్చే కంటే.. కూడా టీడీపీకి భారీగా క‌లిసి వ‌స్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

గతంలో జగన్ కు కూడా…?

జ‌గ‌న్‌కు గ‌తంలో ఇలాగే సింప‌తీ వ‌చ్చిన విష‌యాన్ని కూడా టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. జ‌గన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం జైలులో పెట్టిన వెంట‌నే ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ తిరుగులేని విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత వైసీపీ ఎమ్మెల్యేల‌ను వ‌రుస పెట్టి చంద్రబాబు పార్టీలో చేర్చుకోవ‌డం మొద‌లు పెట్టాకే జ‌గ‌న్‌కు ప్రజ‌ల్లో బాగా సింప‌తీ పెరిగింది. జ‌గ‌న్ ఇప్పుడు ఈ విష‌యాన్ని గ్రహిస్తే.. మంచిద‌ని అంటున్నారు.

Tags:    

Similar News