టీడీపీలో హోం మంత్రి రేసులో… ?
ఆలూ లేదు చూలూ లేదు, కొడుకు పేరు సోమ లింగం అని ఒక ముతక సామెత ఉంది. టీడీపీ నేతల తీరు చూస్తే అదే అనిపిస్తోంది. తెలుగుదేశం [more]
ఆలూ లేదు చూలూ లేదు, కొడుకు పేరు సోమ లింగం అని ఒక ముతక సామెత ఉంది. టీడీపీ నేతల తీరు చూస్తే అదే అనిపిస్తోంది. తెలుగుదేశం [more]
ఆలూ లేదు చూలూ లేదు, కొడుకు పేరు సోమ లింగం అని ఒక ముతక సామెత ఉంది. టీడీపీ నేతల తీరు చూస్తే అదే అనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం జరిగి గట్టిగా రెండేళ్ళు కాలేదు. ఏపీలో జగన్ సర్కార్ చేతిలో ఇంకా మూడేళ్ళ అధికారం ఉంది. అయినా కూడా వచ్చే సర్కార్ తమదేనని టీడీపీలో ఆశావహులు ఊసులాడుకుంటున్నారు. అంతటితో ఆగితే ఫరవాలేదు. రేపటి రోజున కాబోయే మంత్రులం తామేనని కూడా ఊహించుకుంటున్నారు. ఇక శాఖలను కూడా ఎవరికి వారు పంచేసుకుంటున్నారు.
హోం మంత్రి నేనే…?
ఈ మాట అన్నది ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు. నిజానికి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీలో ఉండాలి. ఏపీలో టీడీపీ వస్తే గిస్తే అచ్చెన్న ముఖ్యమంత్రి కావాలి. కానీ పేరుకు జాతీయ పార్టీ కాబట్టి బాబే సీఎం. ఇది కంఫర్మ్. దాంతో ఆ తరువాత హోదా అయినా తనకు దక్కాలని ముందే కర్చీఫ్ వేసేశారు అచ్చెన్న. ఆయన్ని ఆ మధ్య అరెస్ట్ చేసినపుడు వైసీపీ నేతల మీద మండిపోయారు. అలాగే పోలీసుల మీద ఆగ్రహం ప్రదర్శించారు. అందుకే తానే వచ్చే కొత్త పోలీస్ మంత్రిని అంటూ హూంకరించారు. చంద్రబాబుతో చెప్పి మరీ ఆ శాఖ తీసుకుంటానని కూడా గర్జించారు.
లెక్కలు కడుతున్న లోకేష్….
ఇక టీడీపీ వారసుడు నారా లోకేష్ అయితే వైసీపీ పాలకుల పాపాలను అలా లెక్కలు కడుతూనే ఉన్నారుట. ఆయన కూడా ఈ మధ్య కర్నూలు టూర్ లో మాట్లాడుతూ వైసీపీ తప్పులకు తగిన జవాబు తానే చెబుతానని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఒక్కో నేత జాతకాన్ని బయటపెడతానని, దగ్గరుండి ఆ బాధ్యత కూడా చూసుకుంటాను అని చెప్పుకొచ్చారు. పోలీసుల తీరు మార్చుకోకపోతే తానే వారి విషయంలో కూడా గట్టిగా ఉండాల్సి వస్తుందని లోకేష్ అన్నారు. అంటే ఆయన మనసు కూడా హోం శాఖ మీదనే అంటున్నారు.
వీరంతా అటేనా…?
ఇక టీడీపీ నేతలను వరసపెట్టి వైసీపీ సర్కార్ అరెస్ట్ చేస్తూ పోతోంది. దాంతో వారంతా కూడా తాము అధికారంలోకి వస్తే అక్రమంగా వ్యవహరించిన పోలీసుల సంగతి తేలుస్తామని భారీ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. అలా కనుక చూసుకుంటే కొల్లు రవీంద్ర నుంచి మొదలుపెడితే అయ్యన్నపాత్రుడు, ధూళిపాళ్ళ నరేంద్ర వంటి వారంతా హోం మంత్రులు కావాల్సిందే అంటున్నారు. ఇక చంద్రబాబు కూడా పోలీసుల మీద ఎప్పటికపుడు విరుచుకుపడుతున్నారు. వైసీపీ అధికారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోండని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. మరి కొంపదీసి టీడీపీ అధికారంలోకి వస్తే బాబు దగ్గరే హోం శాఖ అట్టేపెట్టుకుంటారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. మొత్తానికి చూస్తే అత్త మీద కోపం దుత్త మీద అన్నట్లుగా పోలీసులనే టీడీపీ టార్గెట్ చేయడం మాత్రం వింతగానే ఉంది మరి.