ఇంకా తేల్చుకోలేక పోతున్నారా?

అమెరికా అధ్యక్ష పదవిని అందుకోవడం అనుకున్నంత తేలికైన విషయం కాదు. ఆషామాషీకానేగాదు. అధ్యక్ష పదవికి ప్రక్రియ సుదీర్ఘకాలం సాగుతుంది. దాదాపు ఏడాది పడుతుంది. ఎన్నికల్లో గెలవాడాన్ని పక్కనపెడితే [more]

Update: 2020-03-26 17:30 GMT

అమెరికా అధ్యక్ష పదవిని అందుకోవడం అనుకున్నంత తేలికైన విషయం కాదు. ఆషామాషీకానేగాదు. అధ్యక్ష పదవికి ప్రక్రియ సుదీర్ఘకాలం సాగుతుంది. దాదాపు ఏడాది పడుతుంది. ఎన్నికల్లో గెలవాడాన్ని పక్కనపెడితే అసలు పార్టీ అభ్యర్ధిత్వం దక్కంచుకోవడం కోసం పడరాని పాట్లుపడాల్సి వస్తుంది. ఇందుకోసం పార్టీలో అంతర్గతంగా విపరీతమైన పోటీ ఉంటుంది. అధ్యక్ష పదవికి ఎన్నికైతే చేపట్టేబోయే కార్యక్రమాలు, విధానాలు, సిద్ధాంతాలు గురించి విపులంగా పార్టీలోని అంతర్గత పోటీదారులతో చర్చించాల్సి ఉంటుంది. దేశం ఎదుర్కొంటున్న వివిధసమస్యల పరిష్కారానికి చేపట్టబొయే కార్యక్రమాల గురించి వివరించాల్సి ఉంటుంది. వీటిని అధిగమించి అభర్ధిత్వాన్ని దిక్కరించుకోవడం అత్యంతక్లిష్టమైన ప్రక్రియ. ఇది పుార్తి అయితే సగం విజయం లభించినట్లే. ఒకసారి అభ్యర్ధిత్వం లభించిన తర్వాత ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధిని ఢీకొనాల్సి ఉంటుంది. ఇది ద్వితీయ అంకం. ప్రస్తుతం మెుదటం అంకం సాగుతోంది.

ట్రంప్ మళ్లీ బరిలోకి…

రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి ఎవరో ముందే ఖరారైంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ బరిలోకి దిగనున్నారు. పార్టీ మళ్ళీ ఆయనకే అవకాశం కల్పించింది. ఇక డెమెుక్రటిక్ పార్టీ అభ్యర్ధి ఎవరన్నదే కీలక ప్రశ్న. ఇందుకోసం మెుదట్లో పలువురు అభ్యర్ధులు పోటీపడ్డారు. చివరకు బరిలో ఇద్దరు నిలిచారు. బెర్నీ శాండర్స్, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ మధ్య గట్టిపోటీ ఉంది. శాండర్స్ వృద్ధ నాయకుడు. జో బైడెన్ కు కుాడా వయసు మీదపడినప్పటికీ శాండర్స్ మీద చుాస్తే చిన్నవాడే. ప్రస్తుత పోటీలో బైడెన్ ఒకింత ముందున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా. తాను వెనకబడినమాట వాస్తవమేనని శాండర్స్ సైతం అంగీకరించడం గమనార్హం. అయితే చివరివరకు తాను పోరాటం కొనసాగిస్తానని, మధ్యలో వైదొలగనని ఆయన స్పష్టంచేశారు. దీన్నిబట్టి డెమెుక్రటిక్ పార్టీ అభ్యర్ధి ఎవరో తేలడానికి మరికొంత సమయం పట్టవచ్చని అంచనా. వెర్మారిట్ సెనెటర్ అయిన శాండర్స్ మెుదట్లో ముందంజలో ఉన్నారు. ఆయన అభ్యర్ధిత్వం పట్ల పార్టీ అంత సుముఖంగా లేదని, జో బైడెన్ వైపే మెుగ్గు చుాపుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ పరిస్ధితుల్లో ఆయన మధ్యలోనే వైదొలగుతారన్న ప్రచారం ఉంది.

ముందంజలో ఉన్నా…..

అయితే ఇటీవల 14 రాష్ట్రల్లో జరిగిన ప్రైమరీ (అభ్యర్ధి) ఎన్నికల్లో శాండర్స్, బైడెన్ ఇద్దరుా గణనియమైన విజయం సాధించారు. ఇద్దరికీ దాదాపు సరిసమానమైన ఓట్లు లభించాయి. జో బైడెన్ 9 స్ధానాలు గెలుచుకోగా, బెర్నీ శాండర్స్ కీలకమైన కాలిఫోర్నియా, కొలరాడో, వెర్మెంట్ ల్లో ఆధిక్యత చాటుకున్నారు. ఎన్.బి.సి న్సుాస్ అంచనాల ప్రకారం బైడెన్ కు 395 మంది ప్రతినిధుల మద్దతు లభించగా, శాండర్స్ కు 305 మంది మద్దతు సాధించారు. అయితే కీలకమైన కాలిఫోర్నియాలో ఆధిక్యత సాధించడం ద్వారా తాను పైచేయి సాధించానని శాండర్స్ చెబుతున్నారు. వాషింగ్టన్, మిసిసిపి, మిస్సోరీ, ఉత్తర డకోటా రాష్ట్రాల్లో ఇద్దరి మధ్య గట్టి పోటీ జరిగింది. వాషింగ్టన్ లో ఇద్ధరికీ 27 మంది ప్రతినిధుల చొప్పన మద్దతు లభించింది. 32 మంది ప్రతినిధుల మద్దతుతో బైడెన్ మిస్సోరీలో ముందంజలో ఉండగా, శాండర్స్ కు 18 మందే బాసటగా నిలిచారు. బైడెన్ కు ఇక్కడ నల్లజాతి ఓటర్లు దన్నుగా ఉన్నారు. మిసిసిపిలో 30 మంది ప్రతినిధుల మధ్ధతుతో బైడెన్ ముందున్నారు. ఆయనకు ఆఫ్రికన్ అమెరికన్ ఓటర్లు అండగా ఉన్నారు. గత ఎన్నికల సమయంలోనుా శాండర్స్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీపడ్డారు. అయినా ఫలితం దక్కలేదు. వాణిజ్యం, ఆరోగ్య సంరక్షణ, విద్య, గృహ నిర్మాణం, సామాజిక భధ్రత, కార్మికులకు కనీసవేతనాలు, కార్మికుల హక్కులు తదితర అంశాలపై ప్రత్యర్ధుల మధ్య విస్తృత చర్చ నడుస్తోంది. ఇరాక్, ఇరాన్ లతో యుద్ధం, స్వేచ్ఛ వాణిజ్యం, రుణభారం తగ్గిరచుకోవడంపైన చర్చ సాగుతోంది. మెుత్తానికి బైడెన్ ముందంజలో ఉన్నట్లు ప్రస్తుత పరిస్ధితి స్పష్టం చేస్తొంది. మున్ముందు ఏంజరుగుతుందో చుాడాలి మరి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News