అదేనా…. మరేమైనా కారణముందా?

మొన్నటి వరకూ అధికారంలో ఉన్న పార్టీ వద్ద డబ్బుల్లేవట. నిధులు లేమి పార్టీని పట్టిపీడిస్తుందట. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. జనతాదళ్ ఎస్ అధినేత దేవెగౌడ. [more]

Update: 2021-02-21 17:30 GMT

మొన్నటి వరకూ అధికారంలో ఉన్న పార్టీ వద్ద డబ్బుల్లేవట. నిధులు లేమి పార్టీని పట్టిపీడిస్తుందట. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. జనతాదళ్ ఎస్ అధినేత దేవెగౌడ. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ నుంచి ఎవరూ పోటీకి దిగడం లేదని దేవెగౌడ ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా మారింది. కేవలం నాలుగు నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికలకు డబ్బులు లేకపోవడం కారణంగా చూపడం నమ్మశక్యంగా లేదు.

సాధారణ ఎన్నికలు కాకున్నా…..

సాధారణ ఎన్నికలయితే నిధుల సమస్య తలెత్తుతుంది. అదే ఉప ఎన్నికల్లో అయితే పార్టీ అభ్యర్థి ఎన్నికల ఖర్చును భరాయిస్తారు. పార్టీ పెద్దగా ఎన్నికల ఖర్చును పట్టించుకోదు. కానీ దేవెగౌడ డబ్బులు లేకపోవడంతోనే పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించామని చెప్పడం ఆ పార్టీలోనే చర్చకు దారితీసింది. ఉప ఎన్నికలకే ఇలా చేతులెత్తేస్తే మరో రెండున్నరేళ్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని ఎలా పరుగులు తీయిస్తారన్న సందేహాలు పార్టీ నేతల్లో తలెత్తుతున్నాయి.

ఉప ఎన్నికల్లో పోటీకి….

కర్ణాటకలో త్వరలో ఒక లోక్ సభ, మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. బెళగావి లోక్ సభతో పాటు బసవ కల్యాణ్, సింధి, మస్కి అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. దేవెగౌడ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపకపోవడానికి కారణాలపై అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి. బీజేపీకి లాభం చేకూర్చడం కోసమే దేవెగౌడ ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా అంటున్నారు.

బీజేపీకి దగ్గరవ్వాలనేనా?

గత కొంతకాలంగా దేవెగౌడ కుమారుడు కుమారస్వామి బీజేపీకి దగ్గరవుతున్నారు. బసవకల్యాణ్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ మూడు నియోజకవర్గాలతో పాటు లోక్ సభ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యడ్యూరప్పకు విజయం అవసరం. అందుకోసమే దేవెగౌడ పార్టీ ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. భవిష‌్యత్ లోనూ బీజేపీకి దగ్గరవ్వడానికి దేెవెగౌడ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లుంది.

Tags:    

Similar News