అనుకున్నదే జరుగుతుందిగా

అంతా అనుకున్నట్లే జరగుతుంది. అధికారం కోల్పోతే మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబం తీరు ఎలా ఉంటుందో కన్నడనాట మరోమారు స్పష్టమయింది. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వంలో 14 నెలల [more]

Update: 2019-08-24 17:30 GMT

అంతా అనుకున్నట్లే జరగుతుంది. అధికారం కోల్పోతే మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబం తీరు ఎలా ఉంటుందో కన్నడనాట మరోమారు స్పష్టమయింది. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వంలో 14 నెలల పాటు కొనసాగిన కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల మధ్య ఇక స్నేహం కొనసాగే అవకాశాలు కన్పించడం లేదు. లోక్ సభ ఎన్నికల నాటి నుంచే ఈ పరిస్థితి నెలకొని ఉండగా, కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోయాక రెండు పార్టీల మధ్య మరింత దూరం పెరిగింది.

ఆ ఫలితాలే…..

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ లు చాలా ఏళ్ల తర్వాత కలసి పోటీ చేశాయి. అయితే ఫలితాలు మాత్రం రెండు పార్టీలకు షాకిచ్చాయి. ఒకరికొకరు సహకారం అందించుకోక పోవడం వల్లనే ఓటమి పాలయ్యారన్న విశ్లేషణలు ఎన్నికల ఫలితాల అనంతరం వెలువడ్డాయి. ప్రధానంగా దేవెగౌడ, ఆయన మనవడు నిఖిల్ గౌడ ఓటమికి కాంగ్రెస్ శ్రేణులు కారణమంటూ కొంతకాలంగా దేవెగౌడ కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్నారు.

సిద్ధూపై ఫైర్….

తాజాగా ఆయన కాంగ్రెస్ విషయంలో ఆయన బహిరంగంగా మాట్లాడారు. సిద్ధరామయ్యను టార్గెట్ చేస్తూ దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం రేపాయి. కుమారస్వామి సర్కార్ కుప్ప కూలిపోవడానికి కారణం సిద్దరామయ్యేనని, ఆయన మనుషులే కుమారస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీనామాలు చేశారని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందిే. అంటే సిద్ధరామయ్య కాంగ్రెస్ అగ్రనేతగా ఉంటే తాము ఆ పార్టీకి దూరంగా ఉంటామని పెద్దాయన సంకేతాలు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు పంపారు.

సిధ్దూ ఘాటైన జవాబు….

కానీ దేవెగౌడ వ్యాఖ్యలకు ధీటుగా సిద్ధరామయ్య కూడా బదులివ్వడం విశేషం. కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలి పోవడానికి తండ్రీ కొడుకులే కారణమంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. దేవెగౌడ ను నమ్మి బాగుపడిన వారు ఎవ్వరూ లేరని కూడా సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య మైత్రికి ఇక రాం రాం చెప్పినట్లే. ఒక వేళ 17 మంది అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే విడివిడిగా పోటీ చేయడం ఖాయంగా కన్పిస్తుంది. మొత్తం మీద శాసనసభ ఎన్నికల ఫలితాల ఏర్పడిన కాంగ్రెస్, జేడీఎస్ స్నేహం లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత చెడిందనేది వాస్తవం.

Tags:    

Similar News