ఆయన ఉంటే కటీఫ్
మాజీ ప్రధాని దేవెగౌడ మాత్రం భవిష్యత్తులో కాంగ్రెస్ తో కొనసాగాలంటే సిద్ధరామయ్యకు ప్రాధాన్యత ఇవ్వకూడదన్న సంకేతాలను కాంగ్రెస్ హైకమాండ్ కు బలంగా పంపినట్లు తెలిసింది. సిద్ధరామయ్య చేతిలో [more]
మాజీ ప్రధాని దేవెగౌడ మాత్రం భవిష్యత్తులో కాంగ్రెస్ తో కొనసాగాలంటే సిద్ధరామయ్యకు ప్రాధాన్యత ఇవ్వకూడదన్న సంకేతాలను కాంగ్రెస్ హైకమాండ్ కు బలంగా పంపినట్లు తెలిసింది. సిద్ధరామయ్య చేతిలో [more]
మాజీ ప్రధాని దేవెగౌడ మాత్రం భవిష్యత్తులో కాంగ్రెస్ తో కొనసాగాలంటే సిద్ధరామయ్యకు ప్రాధాన్యత ఇవ్వకూడదన్న సంకేతాలను కాంగ్రెస్ హైకమాండ్ కు బలంగా పంపినట్లు తెలిసింది. సిద్ధరామయ్య చేతిలో కర్ణాటక కాంగ్రెస్ ఉంటే తాము ఎప్పటికీ ఆ పార్టీతో చేతులు కలిపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పినట్లు తెలిసింది. తన కుమారుడి పాలనను అంతం చేయడానికి సిద్ధరామయ్య ప్రయత్నించారని దేవెగౌడ బహిరంగంగా వ్యాఖ్యానించడం దీనికి అద్దం పడుతుంది.
ఆయన వల్లనే కదా?
తన పని కర్ణాటకలో ముగించాలని సిద్ధరామయ్య వెళ్లమంటేనే ముంబయి వెళ్లామని పలువురు అసంతృప్త నేతలు చెప్పిన విషయాన్ని దేవెగౌడ ఒక కార్యక్రమంలో గుర్తు చేశారు. సిద్ధరామయ్య ఇప్పుడు సీఎల్పీ నేతగా ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఎవరు వచ్చినా సిద్ధరామయ్య మాట చెల్లుబాటు అవుతుందంటున్నారు. గత కొంతకాలంగా సిద్ధరామయ్య కూడా యాక్టివ్ గా వివిధ కార్యక్రమాల్లో తిరుగుతున్నారు.
పార్టీ బలోపేతానికి…..
సిద్ధరామయ్యకు కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఉంటే జేడీఎస్ కలవబోదన్న నిర్ణయం బయటకు చెప్పేశారు పెద్దాయన దేెవెగౌడ. తాను ఇకపై పార్టీ పటిష్టత కోసం ప్రయత్నిస్తానన్నారు. ఇందుకోసం తన సమయాన్నంతా వెచ్చిస్తానని చెప్పారు. తమకు సమయం చాలా ఉందని, పార్టీని బలోపేతం చేయడానికి ఇది చాలని దేవెగౌడ ధీమా వ్యక్తం చేశారు. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడంపై బీజేపీ కంటే సిద్ధరామయ్యే ఎక్కువ కారణమని దేవెగౌడ నమ్ముతున్నారు.
బీజేపీకి దగ్గరవుతున్నారా?
అందుకే బీజేపీకి శత్రువుగా దేవెగౌడ మారదల్చుకోలేదు. మొన్న యడ్యూరప్ప ప్రభుత్వం వ్యక్తిగత కక్షలకు దిగుతుందని చెప్పిన దేవెగౌడ తన స్వరం మార్చారు. యడ్యూరప్ప సర్కార్ కూలిపోవాలని తాను కోరుకోవడం లేదని చెప్పారు. ఇకపై తాను యడ్యూరప్ప సర్కార్ ను విమర్శించేది లేదని కూడా ఒట్టుపెట్టుకున్నారు. ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే దేవెగౌడ సిద్ధరామయ్య ఉన్న కాంగ్రెస్ కంటే బీజేపేీ యే బెటరని భావిస్తున్నారన్న టాక్ జేడీఎస్ లోనూ వినపడుతుంది.