పెద్దాయన హింట్ ఇచ్చారుగా… ఇంకా అర్థంకాలేదా?

కర్ణాటక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేది దేవెగౌడ. అనేక సార్లు ఆయన కింగ్ మేకర్ అయ్యారు. ఇటు బీజేపీతోనూ, అటు కాంగ్రెస్ తోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి [more]

Update: 2020-07-22 18:29 GMT

కర్ణాటక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేది దేవెగౌడ. అనేక సార్లు ఆయన కింగ్ మేకర్ అయ్యారు. ఇటు బీజేపీతోనూ, అటు కాంగ్రెస్ తోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన కుమారుడిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి తనివి తీరా చూసుకున్నారు. ఇలా అన్ని పార్టీలతో హ్యాండ్ కలిపేసిన దేవెగౌడ ఇప్పుడు ససేమిరా అంటున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ తో పొత్తు ఉండదని తేల్చి చెప్పేశారు. ఒంటరిగానే పోటీ చేస్తామని హింట్ ఇచ్చేశారు.

కింగ్ మేకర్ గానే ….

ఎప్పుడైనా ఒంటరిగా పోటీ చేసి ఆ తర్వాత హంగ్ అసెంబ్లీ ఏర్పడితే కింగ్ మేకర్ కావడం దేవెగౌడ పార్టీకి ఉన్న ప్రధాన లక్షణాల్లో ఒకటి. అయితే ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో దేవెగౌడ కాంగ్రెస్ లో నేరుగా పొత్తు కుదుర్చుకున్నారు. ఈ ఎఫెక్ట్ ఆయనపైనే పడింది. దేవెగౌడతో పాటు ఆయన మనవడు నిఖిల్ గౌడ కూడా ఓటమి పాలయ్యారు. దీనికి కారణం కాంగ్రెస్ నేతలు సహకరించక పోవడమే. సొంత పార్టీ క్యాడర్ కూడా హ్యాండిచ్చిందని అర్ధమయింది.

రాజ్యసభ ఎన్నికల్లో…..

అందుకే ఆయన కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత తాము వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పెట్టుకోబోమని ప్రకటించారు. అయితే ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో దేవెగౌడకు కాంగ్రెస్ మద్దతిచ్చింది. దేవెగౌడ తో భవిష్యత్ రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాజ్యసభ ఎన్నికల్లో దేెవెగౌడకు కాంగ్రెస్ మద్దతిచ్చింది. ఆయనను పెద్దల సభకు ఆహ్వానించింది. అసలే ఓటమితో కుంగిపోయి ఉన్న దేవెగౌడకు కాంగ్రెస్ పార్టీ ఊరట కల్పించింది.

కలిసి పోటీ చేస్తాయని….

దీంతో కాంగ్రెస్, జేడీఎస్ కలసి నడుస్తాయని అందరూ భావించారు. కానీ పెద్దాయన దేవెగౌడ ఆ అనుమానాలను ఇటీవల నివృత్తి చేశారు. కార్యకర్తలను ఉద్దేశించి ఆయన బహిరంగ లేఖ రాశారు. అందులో గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని నష్టపోయామని దేవెగౌడ చెప్పారు. ఇకపై ఇటువంటి పరిస్థితి రాదన్నారు. ఏడాదిలో ప్రారంభమవుతున్న ఎన్నికల హడావిడికి సిద్ధంగా ఉండాలని దేవెగౌడ పిలుపు నిచ్చారు. అంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్త ఉండదని పెద్దాయన హింట్ ఇచ్చేసినట్లేగా.

Tags:    

Similar News