ఎన్న గురవాయురప్పా?

కర్ణాటక సరిహద్దు రాష్ట్రం కేరళ. కేరళలో జాతీయ పార్టీల హవా ఎక్కువగా ఉంటుంది. సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ లు ఇక్కడ బలంగా ఉన్నాయి. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములే [more]

Update: 2021-03-22 18:29 GMT

కర్ణాటక సరిహద్దు రాష్ట్రం కేరళ. కేరళలో జాతీయ పార్టీల హవా ఎక్కువగా ఉంటుంది. సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ లు ఇక్కడ బలంగా ఉన్నాయి. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములే ఇక్కడ విజయాన్ని సాధిస్తూ వస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలకు ఇక్కడ పెద్దగా అవకాశాలుండవు. అరకొర సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కానీ కేరళ ఎన్నికల్లో జనతాదళ్ ఎస్ పోటీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఉప ప్రాంతీయ పార్టీ…..

కర్ణాటకలో జనతాదళ్ ఎస్ ప్రాంతీయ పార్టీ. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఉప ప్రాంతీయపార్టీగా జేడీఎస్ ను చెప్పుకోవచ్చు. జేడీఎస్ అధినేత దేవెగౌడ పార్టీ స్థాపించి రెండు దశాబ్డాలవుతున్నా ఇతర రాష్ట్రాలకు పార్టీని విస్తరించేందుకు సిద్ధపడలేదు. కర్ణాటకకే పరిమితమైన దేవెగౌడ పార్టీ ఇప్పుడు కేరళలో పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. కర్ణాటకలోనే పెద్దగా బలం లేని పార్టీ కేరళలో ఏం చేయగలదన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.

సొంత రాష్ట్రంలో…..

దేవెగౌడ ఇటీవల ఒక ప్రకటన చేశారు. పార్టీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పారు. అందుకే కర్ణాటకలో జరిగే ఉప ఎన్నికల్లో సయితం తాము పోటీ చేయడం లేదని ప్రకటించారు. అయితే బీజేపీకి లబ్ది చేయడం కోసమే దేవెగౌడ తన పార్టీ అభ్యర్థులను కర్ణాటకలో బరిలోకి దించలేదన్న విమర్శలున్నాయి. ఆ విమర్శల నుంచి బయటపడటానికే ఇటీవల మైసూరు కార్పొరేషన్ మేయర్ పదవిని ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో దేవెగౌడ పార్టీ గెలుచుకుంది.

కేరళలో పోటీకి….

కానీ కేరళ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు దేవెగౌడ ప్రకటించడం రాజకీయ వర్గాలు సయితం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం నాలుగు స్థానాల్లో దేవెగౌడ పార్టీ కేరళ ఎన్నికలలో బరిలోకి దిగనుంది. కొవలం, తరువళ్ల, చిత్తూరు, అంకమలి నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులను కూడా దేవెగౌడ ప్రకటించారు. సొంత రాష్ట్రంలో దేవెగౌడ ఎన్నికలకు దూరంగా ఉండమని చెప్పి, పొరుగు రాష్ట్రంలో పోటీ చేస్తుండటంపై సొంత పార్టీ క్యాడర్ ముక్కున వేలేసుకుంటుంది. మొత్తం మీద దీనివెనక ఏదో మతలబు ఉందన్న చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News