నిర్ణయంలోనూ తేడా ఉందా?

కర్ణాటకలో మరో మూడేళ్ల పాటు పార్టీని రక్షించుకోవాలంటే అధికార భారతీయ జనతా పార్టీకి మద్దతివ్వక తప్పని పరిస్థితి జనతాదళ్ ఎస్ కు ఉందని పిస్తోంది. ఇటీవల జరిగిన [more]

Update: 2019-12-16 18:29 GMT

కర్ణాటకలో మరో మూడేళ్ల పాటు పార్టీని రక్షించుకోవాలంటే అధికార భారతీయ జనతా పార్టీకి మద్దతివ్వక తప్పని పరిస్థితి జనతాదళ్ ఎస్ కు ఉందని పిస్తోంది. ఇటీవల జరిగిన పదిహేను అసంెబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో పన్నెండు స్థానాల్లో పోటీ చేసి జేడీఎస్ ఒక్కచోట కూడా గెలవలేకపోయింది. దీంతో పార్టీ నాయకత్వంపై అనుమానాలు బయలుదేరాయి. దీనికి తోడు పది మంది జేడీఎస్ శాసనసభ్యులు బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారంతో దేవెగౌడ, కుమారస్వామి అప్రమత్తమయ్యారు.

బీజేపీకి మద్దతివ్వాలంటూ….

ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న నేతలు బీజేపీకి బయట నుంచైనా మద్దతివ్వడం మంచిదని పార్టీ అధినేతలు దేవెగౌడ, కుమారస్వామిలకు సూచించారు. సీనియర్ ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ సయితం ఇదే అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. కానీ దేవెగౌడ మాత్రం బీజేపీకి మద్దతిచ్చేందుకు అంగీకరించడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని తప్పు చేశామని, పార్టీ ఓటు బ్యాంకును కోల్పోవడంతో పాటు క్యాడర్ కూడా చెల్లాచెదురయిందని చెబుతున్నారు.

కుదరదంటున్న దేవెగౌడ….

దేవెగౌడ అభిప్రాయంతో జేడీఎస్ లోని మరో కీలకనేత రేవణ్ణ కూడా అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికిప్పుడు బీజేపీతో జత కట్టి ఏం సాధించాలని ప్రశ్నిస్తున్నారు. ఎవరికి ఉపయోగం ఉంటుందని ఆయన నేరుగా ప్రశ్నలు సంధిస్తున్నారు. తమ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల అభివృద్ధికి పోరాటం చేసి నిధులు సాధించుకోవాలని, సమస్యలను పరిష‌్కరించుకోవాలని రేవణ్ణ సూచిస్తున్నారు. ఇందుకు దేవెగౌడ సయితం అంగీకరిస్తున్నారు.

కుమార ఆలోచన వేరుగా…

కానీ కుమారస్వామి మాత్రం డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. తాము బీజేపీతో పొత్తు పెట్టుకోకుంటే ఉన్న ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశముందని ఆయన ఆలోచిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కుమారస్వామి భావిస్తున్నారు. తాము మద్దతివ్వకుంటే బీజేపీయే తమ శాసనసభ్యులను తీసుకునే అవకాశముండటంతో కుమారస్వామి మాత్రం బీజేపీకి బయట నుంచి మద్దతివ్వాలన్న ఆలోచనతో ఉన్నారు. మరి నేతలను నిలబెట్టుకునేందుకు దేవెగౌడ కుటుంబం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Tags:    

Similar News