అనుకున్నది సాధించారు.. గోల్ కొట్టేశారు

దిగ్విజయ్ సింగ్ వృద్ధ నేత. ఆయనకు భవిష్యత్తులో ఎలాంటి పదవి రాదని అందరూ ఊహించారు. కానీ అనుకోని విధంగా కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను రాజ్యసభకు పంపింది. నిజానికి [more]

Update: 2020-06-24 17:30 GMT

దిగ్విజయ్ సింగ్ వృద్ధ నేత. ఆయనకు భవిష్యత్తులో ఎలాంటి పదవి రాదని అందరూ ఊహించారు. కానీ అనుకోని విధంగా కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను రాజ్యసభకు పంపింది. నిజానికి దిగ్విజయ్ సింగ్ ఎత్తు పారిందనే చెప్పాలి. ఆయన 2019 పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయినప్పటి నుంచి పదవి కోసం అల్లాడి పోతున్నారు. ఆయనకు రాష్ట్ర స్థాయిలో తగిన పదవి ఏదీ తూగదు. అందుకే ఆయన హైకమాండ్ ను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగానే యువనేత జ్యోతిరాదిత్య సింధియాను పార్టీ నుంచి పంపించి వేశారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

డిగ్గీ రాజా అంటేనే….

దిగ్విజయ్ సింగ్ ఒకప్పుడు మధ్యప్రదేశ్ ను ఏలారు. ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు అప్పట్లో సక్సెస్ ఫుల్ చీఫ్ మినిస్టర్ గా పేరుండేది. మధ్యప్రదేశ్ రాజకీయాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఎప్పటికీ చూస్తుంటారు. తన నుంచి వేరొకరు పగ్గాలు తీసుకుంటే చూసి ఓర్వలేరు. రాజకీయంలో ఇది సహజమైనా దిగ్విజయ్ సింగ్ కు కొంత ఎక్కువ ఉందంటారు. ఆ నైజమే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కొంపముంచిందంటారు.

రాహుల్ పీకి పారేసినా….

దిగ్విజయ్ సింగ్ పనితీరును చూసి రాహుల్ గాంధీ తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక రాష్ట్రాలకు ఇన్ ఛార్జిగా వ్యవహరించేవారు. తెలంగాణ, కర్ణాటక, గోవా వంటి రాష్ట్రాల ఇన్ ఛార్జి నుంచి రాహుల్ దిగ్విజయ్ సింగ్ ను తప్పించేశారు. గోవాలో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రియాక్ట్ కాకపోవడంతో పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. మధ్యప్రదేశ్ లోనూ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి దిగ్విజయ్ సింగ్ కారణమంటారు. దిగ్విజయ్ సింగ్ తన ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకే జ్యోతిరాదిత్య సింధియాను పార్టీ నుంచి సాగనంపారంటారు.

సింధియాను సాగనంపిన తర్వాతే…..

నిజానికి దిగ్విజయ్ సింగ్ కు, ముఖ్యమంత్రి కమల్ నాధ్ కు మధ్య పొసగదు. అయితే సింధియా బలం రోజురోజుకూ పెరుగుతుండటంతో ఆయన కమల్ నాధ్ తో చేతులు కలిపి సింధియాను పంపించి వేశారు. దాని ఫలితమే ఇప్పుడు రాజ్యసభ పదవి. అదే సింధియా పార్టీలో ఉంటే దిగ్విజయ్ సింగ్ కు రాజ్యసభ స్థానం దక్కేది కాదంటారు. మొత్తం మీద దిగ్విజయ్ సింగ్ తాను అనుకున్నది సాధించుకున్నారు. రాజ్యసభకు ఎంపికయ్యారు.

Tags:    

Similar News