ఆయన వస్తే మరింత బలం.. వస్తాడా?
తమిళనాడులో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. నిజంగా చూసుకుంటే ఇంకా నెలల సమయం మాత్రమే ఎన్నికలకు ఉంది. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చే [more]
తమిళనాడులో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. నిజంగా చూసుకుంటే ఇంకా నెలల సమయం మాత్రమే ఎన్నికలకు ఉంది. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చే [more]
తమిళనాడులో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. నిజంగా చూసుకుంటే ఇంకా నెలల సమయం మాత్రమే ఎన్నికలకు ఉంది. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది మార్చి లోపే ఎన్నికలను నిర్వహించే అవకాశముంది. ప్రస్తుతం కరోనా ఉన్నా బీహార్ లో ఎన్నికలను నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సిద్ధమయింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఎన్నికలకు పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ప్రధానంగా ఈ ఎన్నికలు ప్రతిపక్ష డీఎంకే కు జీవన్మరణ సమస్య.
పదేళ్ల నుంచి ప్రతిపక్షంలోనే…..
డీఎంకే గత పదేళ్ల నుంచి ప్రతిపక్షంలోనే ఉంది. వరసగా అన్నాడీఎంకే రెండు సార్లు విజయం సాధించడంతో డీఎంకే ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈసారి ఎన్నికల్లో కూడా ఓటమి ఎదురైతే ఇక దుకాణం మూసేయాల్సిందే. ఎందుకంటే కరుణానిధి మరణించారు. స్టాలిన్ నేతృత్వంలో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే. ఇప్పుడు స్టాలిన్ తన నాయకత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే డీఎంకే ప్రజల్లోకి వెళ్లేందుకు శ్రమిస్తుంది. కరోనాతో మరణించిన వారిలో డీఎంకే నేతలు, ఎమ్మెల్యేలే ఎక్కువ ఉండటం గమనార్హం.
కూటమి పార్టీలతో కలసి…..
ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులతోనే డీఎంకే వెళ్లనుంది. కాంగ్రెస్ తో పాటు మరికొన్ని చిన్నా చితకా పార్టీలను తన కూటమిలోకి చేర్చుకుని ఎన్నికలకు వెళ్లనుంది. గత పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించడంతో స్టాలిన్ ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపయింది. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా తమ పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా స్టాలిన్ నియమించుకున్నారు.
కమల్ వచ్చి చేరితే…..
దీంతో పాటు కమల్ హాసన్ కూడా డీఎంకేతో కలసేందుకు సిద్ధమయ్యారు. కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన రజనీకాంత్ తో కలసి ఎన్నికలకు వెళదామనుకున్నారు. కానీ రజనీకాంత్ నుంచి చడీ చప్పుడు లేకపోవడంతో డీఎంకే తో జట్టుకట్టేందుకు సిద్దమయ్యారు. ఆగస్టు 7వ తేదీ కరుణానధి వర్ధంతిరోజున ట్విట్టర్ ద్వారా కమల్ హాసన్ నివాళులర్పించారు. కమల్ హాసన్ పార్టీ డీఎంకేతో కలిస్తే మరింత బలం చేకూరునుంది. మొత్తం మీద మరికొద్ది నెలల్లో జరిగే తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్ ఫేట్ ఎలా ఉంటుందో? అన్నది చర్చనీయాంశమైంది.