తెలుగు రాజ‌కీయాల్లో ఆ ఫ్యామిలీలు ఇక క‌నుమ‌రుగేనా?

తెలుగు నేల‌తోను, తెలుగు రాజ‌కీయాల‌తోనూ అనుబంధం ఉన్న కుటుంబాలు చాలానే ఉన్నాయి. కొన్ని ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల‌తోనే త‌మ జీవితాల‌ను ముడివేసుకుని, ప్రజ‌ల‌కు చేరువ అయి, రాష్ట్ర, జ‌నాభా [more]

Update: 2020-07-09 05:00 GMT

తెలుగు నేల‌తోను, తెలుగు రాజ‌కీయాల‌తోనూ అనుబంధం ఉన్న కుటుంబాలు చాలానే ఉన్నాయి. కొన్ని ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల‌తోనే త‌మ జీవితాల‌ను ముడివేసుకుని, ప్రజ‌ల‌కు చేరువ అయి, రాష్ట్ర, జ‌నాభా వృద్ధిలో త‌మవంతు పాత్రను ఘ‌నంగా పోషించిన కుటుంబాలు.. ఎన్నో! ఇలాంటి కుటుంబాల్లో కొన్ని.. రాజ‌కీయంగా త‌మ సొమ్మును ప్రజ‌ల‌కు పెట్టిన వారు కూడా ఉన్నారు. సొంత‌లాభం కొంత‌మానుకుని.. ప్రజ‌ల కోసం పాటు ప‌డిన వారు క‌నిపిస్తారు. నేను-నా! అనే అహాన్ని కూడా విడిచి పెట్టి.. ప్రజ‌ల కోసం ప‌రిశ్ర ‌మించిన వారు ఉన్నారు. అయితే, ఇప్పుడు ఇలాంటి కుటుంబాలు.. రాజకీయంగా మిణుకు మిణుకు మంటున్నాయి. వీరిలో ప‌శ్చిమ గోదావ‌రి రాజ‌కీయాల్లో ద‌శాబ్దాల అనుబంధం ఉన్న కుటుంబాలు ఇప్పుడు త‌మ ప్రాభ‌వాన్ని పూర్తిగా కోల్పోతున్న ప‌రిస్థితి. కొండెక్కే దీపాన్ని త‌ల‌పిస్తున్న ఈ కుటుంబాల రాజ‌కీయం గురించి.. కొంతైనా తెలుసుకుందాం..

మాగంటి …

తెలుగు రాజ‌కీయాల్లో ఇంటి పేరుతో ప్రసిద్ధి చెందిన కుటుంబం మాగంటి. మాగంటి బాబు.. మాగంటి ర‌వీంద్రనాథ్ చౌద‌రి, మాగంటి వ‌ర‌ల‌క్ష్మి.. ఇలా మ‌న‌కు నాయ‌కులు క‌నిపిస్తారు. వీరికి ప్రజ‌ల‌కు మ‌ధ్య, వీరికి తెలుగు సంస్కృతికి మ‌ధ్య చాలా ప్రత్యేక అనుబంధం ఉంది. వీరి కుటుంబ రాజ‌కీయం 130 ఏళ్ల నుంచి ఉంది. మాగంటి బాబు తాత మాగంటి సీతారామ దాసు నుంచి వీరి కుటుంబం ప‌శ్చిమ గోదావ‌రి రాజ‌కీయాల్లో పేరు పొందింది. మాగంటి సీతారామదాసు ప్రముఖ‌ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు. గాంధీ కాలం నుంచి కూడా రాజ‌కీయాలు చేశారు. ఆయ‌న త‌ర్వాత మాగంటి ర‌వీంద్రనాథ్‌, వ‌ర‌ల‌క్ష్మి దంప‌తులు కూడా రాజ‌కీయంగా చ‌క్రం తిప్పారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను ప‌దవులు అనుభ‌వించారు. వీరిద్దరు కూడా రాష్ట్ర మంత్రులుగా ప‌నిచేశారు. ఇక‌, వీరి కుమారుడు.. మాగంటి వేంక‌టేశ్వర‌రావు ఉర‌ఫ్ బాబు.. కూడా ఎంపీగా, ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రజ‌లకు చేరువ‌య్యారు. ఒకే కుటుంబంలో తండ్రి, త‌ల్లి, కుమారుడు ముగ్గురు మంత్రులు అయిన ఘ‌న‌త ఈ కుటుంబానికే చెందుతుంది. అదే స‌మ‌యంలో మాగంటి బాబు కాంగ్రెస్‌, టీడీపీ నుంచి కూడా ఎంపీగా గెలిచారు. అయితే, ఇప్పుడు వీరి కుటుంబం నుంచి మాగంటి రాంజీ ఒక్కరే ఉన్నారు. అయితే, ఇప్పుడు ఈయ‌న ప‌రిస్థితి కూడా ఇబ్బంది క‌రంగానే ఉంది. జిల్లా తెలుగు యువ‌త అధ్యక్షుడిగా రాంజీ ఉన్నారు. కానీ, ఈయ‌న త‌ప్ప మాగంటి రాజ‌కీయాల‌ను నిల‌బెట్టే ఛాన్స్ మ‌రెవ‌రికీ లేక పోవ‌డం గ‌మ‌నార్హం

క‌నుమూరి:

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా క‌నుమూరి పేరు చిర‌ప‌రిచితం. క‌నుమూరి బాపి రాజు.. పెద్ద పెద్ద మీసాల‌తో ఆర‌డుగుల ఆజానుబాహుడిగా.. తెలుగు ద‌నాన్ని నిండైన పంచెక‌ట్టుతో నిల ‌బెట్టిన ఠీవీ ఆయ‌న సొంతం. ఇందిర‌మ్మ నుంచి సోనియా వ‌ర‌కు అందరితోనూ క‌లిసిమెలిసిన రాజ‌కీ య నేత‌గా కూడా ఆయ‌న గుర్తింపు పొందారు. కృష్ణా జిల్లా కైక‌లూరు నుంచి ఆ త‌ర్వాత ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా అత్తిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న ఆ త‌ర్వాత న‌రసాపురం నుంచి ఎంపీగా కూడా గెలిచారు. ద‌శాబ్దాలుగా ఆయ‌న రాజ‌కీయాల్లో ఉన్నారు. రాష్ట్ర మంత్రి, ఎంపీ, టీటీడీ చైర్మన్‌గా ప‌నిచేశారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత నుంచి ఆయ‌న రాజ‌కీయంగా క‌నిపించ‌డం లేదు. పోనీ.. ఆయ‌న‌కు వార‌సులు ఎవ‌రైనా ఉన్నారా? అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో రాజ‌కీయాల్లో క‌నుమూరి శ‌కం అంత‌రించింద‌నే భావించాల్సి వ‌స్తోంది.

కావూరి:

కావూరి సాంబ‌శివ‌రావు. మ‌చిలీప‌ట్నం, ఏలూరు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఎంపీగా, సుదీర్ఘ కాలం కాంగ్రెస్ నాయ‌కుడిగా ఆయ‌న చ‌క్రం తిప్పారు. కేంద్ర మంత్రి ప‌ద‌వి విష‌యంలో పోరాడి మ‌రీ పీఠం ద‌క్కించుకు న్నారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత బీజేపీలోకి చేరారు. ఆ త‌ర్వాత ఎక్కడా క‌నిపించ‌డం లేదు. ప్రస్తుతం ఆయ‌న పొలిటిక‌ల్‌గా యాక్టివ్‌గా లేక పోవ‌డం గ‌మ‌నార్హం. కాగా,ఈయ‌న‌కు ముగ్గురూ అమ్మాయిలే.. పుత్రులు లేరు. దీంతో కావూరి కుటుంబం కూడా రాజ‌కీయంగా తెర‌మ‌రుగు అయిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ముళ్లపూడి:

తెలుగు నేల‌పై చురుకైన రాజ‌కీయాలు చేసిన ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ముళ్లపూడి హ‌రిశ్చంద్ర ప్రసాద్ వైభ‌వం కూడా క‌నుమ‌రుగు కానుంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. త‌ణుకు నుంచి ఆయ‌న ఏపీలో చ‌క్రం తిప్పారు. ఇక‌, ఆయ‌న త‌ర్వాత అల్లుడు వైటీ రాజా వ‌చ్చినా.. ఇప్పుడు ఆయ‌న కూడా ఎక్కడా క‌నిపించ‌డం లేదు. 1999లో ఎమ్మెల్యేగా గెలిచిన రాజా ఆ త‌ర్వాత 2004, 2009 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా ఓడిపోయారు. ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న స్వయంగా త‌ప్పుకున్నారు. దీంతో ద‌శాబ్దాల పాటు ప‌శ్చిమ రాజ‌కీయాల‌ను శాసించిన ముళ్లపూడి ప్రభావం త‌ణుకులో కూడా లేని ప‌రిస్థితి. రాజా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవ‌డంతో ముళ్లపూడి వారి రాజ‌కీయంకూడా క‌నుమ‌రుగైన‌ట్టేన‌ని చెబుతున్నారు.

Tags:    

Similar News