చాణక్య మూవీ రివ్యూ

బ్యానర్: ఏకే ఎంటర్టైన్మెంట్స్ నటీనటులు: గోపీచంద్, మెహ్రీన్ కౌర్, జరీన్ ఖాన్,నాజర్, రాజేష్ ఖట్టర్, ఉపేన్ పటేల్ తదితరులు మ్యూజిక్: విశాల్ చంద్ర శేఖర్ సినిమాటోగ్రఫీ: వెట్రి [more]

Update: 2019-10-05 09:12 GMT

బ్యానర్: ఏకే ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు: గోపీచంద్, మెహ్రీన్ కౌర్, జరీన్ ఖాన్,నాజర్, రాజేష్ ఖట్టర్, ఉపేన్ పటేల్ తదితరులు
మ్యూజిక్: విశాల్ చంద్ర శేఖర్
సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిసామి
ఎడిటింగ్: మార్తాండ్ K వెంకటేష్
నిర్మాత: రామ్ బ్రహ్మం సుంకర
డైరెక్టర్: తిరు

సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి…. విలన్ గా పాపులర్ అయి మళ్ళీ హీరోగా నిలబడిన వ్యక్తి గోపీచంద్, మాస్ హీరోగా మంచి సినిమాలు చేసిన గోపీచంద్ గత కొంతకాలంగా హిట్ అనే పదాన్ని మర్చిపోయాడు. కథలు ఎంపికలో లోపమో, లేదంటే మారేదన్నానో.. తెలియదు కానీ.. గోపీచంద్ కి హిట్ వచ్చి చాలాకాలమైంది.. మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా దర్శకుడు తిరు తో కలిసి చాణక్య అనే మాస్ మూవీ చేసాడు. రొటీన్ కథలతో సినిమాలు చేస్తున్న ప్రస్తుతం గోపీచంద్ మార్కెట్ కాస్త పడినా… కానీ చాణక్య సినిమా ట్రైలర్ తో సినిమా మీద అంచనాలు పెరిగాయి. మరి హిట్ తో, ప్లాప్ తో సంబంధమే లేకుండా సినిమాలు చేస్తున్న గోపీచంద్ కి దర్శకుడు తిరు అయినా చాణక్య తో హిట్ ఇచ్చాడో లేదో అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

అండర్ కవర్ ఏజెంట్ అర్జున్(గోపీచంద్) రామకృష్ణ బ్యాంక్ ఎంప్లాయ్ గా ఓ అండర్ కవర్ మిషన్ కోసం పని చేస్తుంటాడు. బ్యాంకు ఎంప్లాయ్ అనుకుని అర్జున్ తో ప్రేమలో పడుతుంది ఐశ్వర్య(మెహ్రీన్ కౌర్). అయితే ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అయిన సోహైల్ కి అంత్యంత సన్నితుడైన టెర్రరిస్ట్ ని అర్జున్, తో పాటు అతని నలుగురు రా ఏజెంట్స్ తో కలిసి కిడ్నాప్ చేయడంతో పాటు, చంపడం జరుగుతుంది. దీనితో వారిపై పగబట్టిన టెర్రరిస్ట్ లు అర్జున్ నలుగురు ఫ్రెండ్స్ కిడ్నాప్ చేసి పాకిస్తాన్ కి తీసుకెళ్లడంతో పాటు, వచ్చి వారిని కాపాడు కోవలసిందిగా ఏజెంట్ అర్జున్ కు సవాల్ విసురుతాడు. ఈ క్రమంలో అర్జున్ జాబ్ పోతుంది. అసలు ఆర్జున్ జాబ్ పోవడానికి కారణం? అర్జున్ ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ల నుండి తన మిత్రులను ఎలా కాపాడుకున్నాడు? గవర్నమెంట్ మరియు రా సంస్థ సపోర్ట్ లేకుండా అర్జున్ ఈ మిషన్ ఒక్కడే ఎలా నిర్వహించాడు. చివరికి అర్జున్ తన మిత్రులను కాపాడుకోగలిగాడా? అనేది చాణక్య మిగతా కథ.

నటీనటుల నటన:

మాస్ లుక్స్ తో గోపీచంద్ రా ఏజెంట్ గా ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ లుక్ లో సాలిడ్ బాడీతో ఆకట్టుకున్నారు. స్టయిలిష్ యాక్షన్ తో గోపీచంద్ నటన బావుంది ఇక గోపిచంద్ తో రెండోసారి జతకట్టిన మెహ్రిన్ గ్లామర్ తో పాటు, క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. ఇక చాల రోజులకి పూర్తిస్థాయి కామెడీ రోల్ లో సునీల్ కలిపించాడు. సునీల్, గోపీచంద్ మిత్రుడి పాత్రలో మొదటిసగంలో ఆకట్టుకున్నారు. మరో హీరోయిన్ జరీనా ఖాన్ గోపీచంద్ కి హెల్ప్ చేస్తే పాత్రలో ఆకట్టుకుంది. ఇక పెట్ డాగ్ డాక్టర్ గా ఆలీ కనిపించిన కొద్దినిమిషాలు హైలెట్ కామెడీ పండించారు. కొన్నిసార్లు అలీ కామెడీ హద్దులు దాటింది. అయితే అలీ, సునీల్ కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశంలో మెహ్రీన్ కూడా కాస్త కామెడీ చేసింది. ఇక మిగతా నటులు తమ పాత్ర పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

రా ఏజెంట్ కథలను థ్రిల్లింగ్ గా తెరకెక్కిస్తే… ప్రేక్షకుడికి తొందరగా రీచ్ అవుతాయి. రా సబ్జెక్టు కథలు ఒకేలా ఉన్నప్పటికీ… స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేస్తే అదిరిపోతోంది.అయితే తమిళ దర్శకుడు తిరు ఈ చాణక్య సినిమా విషయంలో ఎంచుకున్న పాయింట్‌‌ను చెప్పడానికి చాలా కష్టాలు పడినట్టు అర్ధమవుతుంది. మెల్లగా అసలు కథలోకి తీసుకువెళ్తాడకునే లోపు అప్పటికే కథ ట్రాక్ తప్పింది. చెప్పాల్సిన విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పడం కష్టం అనుకున్నాడో ఏమో కాని.. స్పై థ్రిల్లర్ ఉండాల్సిన గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేను గాలికి వదిలేసి రొటీన్ సీన్‌లతో బోర్ కొట్టించారు. ఇంటెర్నేషనల్ టెర్రరిస్ట్ ని సొంత గడ్డ అయిన పాకిస్తాన్ లో ఎదుర్కోవడమంటే సాధారణ విషయం కాదు. అలాంటి సాహసం చేసిన హీరో వేసే ఎత్తులు కొంచెం లాజికల్ గా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో సాగాలి. కానీ చాణక్య మూవీలో తిరు ఆ ఆసక్తిని కలిగించలేకపోయాడు. ఒక స్పై మిషన్ స్టోరీని చాలా సాదా సీదా సన్నివేశాలతో తెరకెక్కించి సిల్లీ భావన కలిగించారు. ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్‌ల మధ్య లవ్ ట్రాక్ కోసం దర్శకుడు రాసుకున్న సీన్‌లు ప్రేక్షకుడి సహనానికి పరీక్షే. ఇంటర్వెల్ వరకూ ఎలాగోలా సాగిన కథని సెకండాఫ్‌లో అయినా ఇంట్రస్టింగ్‌గా మలుచుతాడనుకుంటే అది కూడా అత్యాశ అన్నాట్టుగానే చేశాడు దర్శకుడు. కథ పాతదే అయితే కొత్తగా చెప్తే ప్రేక్షకుల నుండి పాస్ మార్కులు గ్యారంటీగా వస్తాయి. అయితే తనకు ఆ ఉద్దేశమే లేదన్నట్టుగా స్క్రీన్ ప్లే నడిపించారు దర్శకుడు. సినిమాలో ఎంత వెతికినా కొత్తదనం కనిపించదు. రొటీన్‌ సీన్లతో అస్సలు లాజిక్ లేని రివేంజ్ స్టోరీకి రా ఏజెంట్ రంగు అద్ది మమ అనిపించుకున్నారు.

ప్లస్ పాయింట్స్: గోపీచంద్ పెరఫార్మెన్స్, లుక్స్, నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్: చాల ఉన్నాయి. మ్యూజిక్, రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఎడిటింగ్

రేటింగ్: 1.75/5

Tags:    

Similar News