వత్తిడి పెంచుతున్నారా …? వత్తిడికి గురయ్యారా …?

రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధిష్టానంపై తన డిమాండ్లపై మరింత వత్తిడి పెంచుతున్నట్లే కనిపిస్తుంది. అదే సమయంలో తన నిర్ణయాన్ని 25వ తేదీన ప్రకటిస్తానని [more]

Update: 2021-08-26 06:30 GMT

రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధిష్టానంపై తన డిమాండ్లపై మరింత వత్తిడి పెంచుతున్నట్లే కనిపిస్తుంది. అదే సమయంలో తన నిర్ణయాన్ని 25వ తేదీన ప్రకటిస్తానని చెప్పిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి వత్తిడిలో ఉన్నట్లు తెలుస్తుంది. అనారోగ్యంగా ఉందని రెండు రోజులపాటు ఆయన విశ్రాంతి తీసుకుంటారని సన్నిహితులు చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన రాజీనామా నిర్ణయానికి కట్టుబడే ఉంటారా లేదా అన్నది సస్పెన్స్ ధ్రిల్లర్ ను తలపిస్తుంది. మరోపక్క గోరంట్ల ఇంటికి టిడిపి శ్రేణులు, ఆయన సన్నిహితులు వెల్లువలా వస్తూనే ఉన్నారు.

ఉన్నా లేనట్లే నా … ?

గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాపార్టీలో ప్రాధాన్యత ఏ మేరకు ఉంటుంది అన్నది ప్రశ్నర్ధకమే. ఎప్పటినుంచో చంద్రబాబు లోకేష్ లు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని దూరం పెడుతూ వస్తున్నారు. పేరుకు పొలిట్ బ్యూరో సభ్యుడు అయినా పార్టీ లో విధానపర నిర్ణయాల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటివారికి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోతుంది. దాంతో ఆయన రాజీనామా నిర్ణయం నుంచి వెనక్కి తీసుకున్నా ఆయన కోరుకున్న విధంగా ఇకపై ఉండదన్నది పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

అందుకోసమేనా?

అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తనను నమ్ముకున్న రాజమండ్రి అర్బన్ క్యాడర్ కి పార్టీలో న్యాయం చేయడంతో పాటు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తన మాటే చెల్లుబాటు అయ్యేలా అంతర్గత డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో రాజమండ్రి టిడిపి లో విభేదాల వేడి మరికొంతకాలం కొనసాగేలాగే కనిపిస్తుంది

Tags:    

Similar News