బాబు ముందు గోరంట్ల కండిషన్లు ఇవే

తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ది ప్రత్యేకస్థానం. అటు ప్రజల్లోనూ ఇటు తెలుగుదేశం పార్టీలోనూ గట్టి పట్టున్న నేతగా ప్రస్థానం [more]

Update: 2021-09-03 06:30 GMT

తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ది ప్రత్యేకస్థానం. అటు ప్రజల్లోనూ ఇటు తెలుగుదేశం పార్టీలోనూ గట్టి పట్టున్న నేతగా ప్రస్థానం కొనసాగిస్తున్న బుచ్చయ్యకు గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదురౌతున్నాయి. మాజీ ఎమ్యెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పార్టీలో రీ ఎంట్రీ ఇచ్చిన నాటినుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కంట్లో నలుసులా పరిస్థితి మారిపోయింది. చాలాకాలం తనకు జరుగుతున్న అవమానాలు పరాభవాలు భరించుకుంటూ వస్తున్నారు గోరంట్ల. ఇటీవల పార్టీలో పదవుల పందేరం జరిగింది. ఇందులో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వర్గానికి అధిష్టానం పూర్తిగా మొండి చెయ్యి చూపించింది.

ఎదురుదాడే ఎన్నుకున్నారు …

ఇక లాభం లేదనుకుని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధిక్కార స్వరం గట్టిగా వినిపించారు. పార్టీకి, ఎమ్యెల్యే పదవికి సైతం రాజీనామా చేసి పారేస్తా అంటూ అధినేతతో చర్చించే ప్రశ్నే లేదని ప్రకంపనలు సృష్ట్టించారు. అంతే కాదు అధినేత చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేష్ సైతం తనవంటి సీనియర్ ఫోన్ నే ఎత్తకపోవడం పరిశీలిస్తే పార్టీ ఏ దౌర్భాగ్యంలో ఉందో తెలిసిపోతుందని బాంబులు సైతం పేల్చారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి . ఆగస్టు 25 న తన రాజీనామా ప్రకటిస్తా అంటూ సైలెంట్ అయ్యారు సీనియర్ టిడిపి నేత.

వేడెక్కించి చల్లార్చుకున్నారు …

దీంతో టిడిపి అధిష్టానం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ని నియమించి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇష్యూ క్లోజ్ చేయాలని ఆదేశించింది. ఆ కమిటీ ముందు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన ఆవేదన కుండబద్దలు కొట్టేశారు. తనను కాదని ఇటీవల పార్టీనుంచి బయటకు పోయిన, పోయేందుకు సిద్ధమైన రాజమండ్రి టిడిపి నేతలు ఎందుకు బయటకు పోతున్నారో విచారించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన పెట్టిన డెడ్ లైన్ సైతం ఆరోగ్యం బాగోలేదంటూ వాయిదా వేశారు. ఆ తరువాత మొత్తానికి మెత్తబడి చంద్రబాబు ను కలిసి తన వేదన ఏకరువు పెట్టారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి .

ఆదిరెడ్డి ఆధిపత్యానికి చెక్ పెడితే ఉంటా …

చంద్రబాబు తో జరిగిన అంతర్గత చర్చల్లో మాజీ ఎల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం దూకుడుకు చెక్ పెట్టాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ పెట్టినట్లు తెలిసింది. ఆవిధంగా చర్యలు ఉన్నప్పుడే పార్టీలో ఉంటా అని లేకపోతే రాం రాం చెప్పేస్తా అని బాబు వద్ద తేల్చానని గోరంట్ల బుచ్చయ్య చౌదరి సన్నిహితుల్లో టాక్. చర్చల అనంతరం కూడా గోరంట్ల చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని పరోక్షంగా బలపరిచేలాగే ఉన్నాయి. ఈ వ్యవహారంపై తనకు కొంత సమయం ఇస్తే అన్ని సర్దుబాటు చేస్తా అని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బుచ్చయ్య వంటి సీనియర్లు ఇలా చేయడం భావ్యం కాదంటూ చంద్రబాబు చేసిన బుజ్జగింపులు ఫలించాయి. ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్ టిడిపి లో సుఖాంతం అయినప్పటికి, ఆదిరెడ్డి వర్గం నుంచి ఎలాంటి రీయాక్షన్స్ భవిష్యత్తులో ఉంటాయో వేచి చూడాలి.

Tags:    

Similar News