గిబ్లి-స్టైల్ చిత్రాలు తయారు చేస్తున్నారా? ఇవి సురక్షితమేనా?

OpenAI తన కొత్త GPT-4o ఇమేజ్ జనరేషన్ మోడల్‌ను రిలీజ్ చేసిన ఒక్క రోజులోనే మంచి ప్రజాదరణతో దూసుకుపోతోంది. ఏప్రిల్ 1న, సామ్;

Update: 2025-04-01 11:34 GMT
Ghibli style images

Ghibli style images

  • whatsapp icon

OpenAI తన కొత్త GPT-4o ఇమేజ్ జనరేషన్ మోడల్‌ను రిలీజ్ చేసిన ఒక్క రోజులోనే మంచి ప్రజాదరణతో దూసుకుపోతోంది. ఏప్రిల్ 1న, సామ్ ఆల్ట్మాన్ మాట్లాడుతూ, ChatGPT కేవలం ఒక గంటలోనే 10 లక్షల మంది కొత్త వినియోగదారులను నమోదు చేసిందని చెప్పారు! ఈ గిబ్లీ స్టైల్ చిత్రాలు ఇప్పుడు ఎక్కడ చూసినా దర్శనం ఇస్తున్నాయి, అందరూ తమ చిత్రాలను ఈ స్టైల్ లో తయారు చేసుకోవాలనే కుతూహలం చూపుతున్నారు.

యూజర్లు తమతో పాటు తమ ప్రియమైన వారి ఫొటోలను, క్లాసిక్ మీమ్స్​ను కూడా​ గిబ్లి-స్టైల్ ఏఐ ఇమేజ్​ల రూపంలోకి మార్చుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ కొత్త టెక్నాలజీ టెక్స్ట్ రెండరింగ్, ట్రాన్సపరెంట్ లేయర్​లతో పాటు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ, రీస్టైలింగ్‌తో రావడంతో ఇంటర్నెట్ అంతా ఈ మోడల్ క్రియేట్ చేసిన AI-జనరేటెడ్ ఆర్ట్‌తో నిండిపోయింది.

గిబ్లి అంటే ఏమిటి?

1985లో ప్రముఖ దర్శకులు హయావో మియాజాకి, ఇసావో టకాహటా, నిర్మాత తోషియో సుజుకి స్థాపించిన స్టూడియో గిబ్లి - అద్భుతమైన విజువల్స్, ఆకర్షణీయమైన కథ చెప్పడంలో ప్రసిద్ధి చెందిన యానిమేషన్ స్టూడియో. ఈ స్టూడియో చేతితో గీసిన యానిమేషన్ లో సూక్ష్మమైన వివరాలపై కూడా శ్రద్ధ వహిస్తారు, వారి గొప్ప కథనాల వల్ల ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. వారి ప్రసిద్ధ చిత్రాలలో మై నైబర్ టోటోరో, స్పిరిటెడ్ అవే, హౌల్స్ మూవింగ్ కాజిల్, కికీస్ డెలివరీ సర్వీస్, ప్రిన్సెస్ మోనోనోక్ ఉన్నాయి.

“గిబ్లి” అనే పేరు లిబియన్ అరబిక్ పదం నుండి వచ్చింది, దీని అర్థం వేడి ఎడారి గాలి. గిబ్లి-శైలి చిత్రంలో, చేతితో గీసిన పాత్రలు, మృదువైన రంగు టోన్‌లు, నేపథ్యంలో సంక్లిష్టమైన వివరాలు మనం చూడొచ్చు.

గిబ్లి-స్టైల్ AI ఇమేజ్​లను ఎలా క్రియేట్ చేయాలి?

ఏదైనా మీమ్, మూవీ సీన్ లేదా మీ పిక్చర్​ స్టూడియో గిబ్లి-స్టైల్ ఇమేజ్​లను ఈ కింది స్టెప్స్ ఫాలో అయి ఈజీగా రూపొందించొచ్చు.

- మొదట chatgpt.comని ఓపెన్ చేసి మీ ఓపెన్​ఏఐ అకౌంట్​ ఆధారాలతో లాగిన్ అవ్వండి.

- ఆ తర్వాత మోడల్ సెలక్షన్ ట్యాబ్​ నుంచి GPT-4o మోడల్‌కి మారండి.

- ఇప్పుడు చాట్‌బాట్‌తో కొత్త సంభాషణను ప్రారంభించండి. అటాచ్ ఫైల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు రీస్టైల్ చేయాలనుకుంటున్న చిత్రాన్ని అప్‌లోడ్ చేయండి.

- పిక్చర్​ను అప్‌లోడ్ చేసిన తర్వాత, దాన్ని స్టూడియో జిబ్లి-స్టైల్ ఆర్ట్​గా రీస్టైల్ చేయమని ChatGPTకి సూచించే ప్రాంప్ట్‌ను నమోదు చేయండి. ఇందుకోసం మీరు 'టర్న్ థిస్ ఫొటో ఇన్​టూ ఏ గిబ్లి-స్టైల్ యానిమేటెడ్ పోర్ట్రెయిట్ విత్ సాఫ్ట్ కలర్స్, ఎక్స్​ప్రెసివ్ ఫీచర్స్, అండ్ ఏ డ్రీమీ బ్యాక్​గ్రౌండ్' లేదా 'షో మీ ఇన్ స్టూడియో జిబ్లీ స్టైల్' అని సింపిల్​గా ప్రాంప్ట్​లను ఉపయోగించొచ్చు.

- ఇప్పుడు జనరేట్ అయిన ఇమేజ్​ను సమీక్షించండి. అవసరమైతే మెరుగుదలలు చేయమని ChatGPTని అడగొచ్చు. మీకు నచ్చిన విధంగా ఇమేజ్ జనరేట్ అయిన తర్వాత దాన్ని మీ డివైజ్​లో సేవ్ చేసుకోండి.

గిబ్లి-స్టైల్ చిత్రాలు తయారు చేయడం ఎంత సురక్షితం?

డిజిటల్ సంచలనాన్ని సృష్టించడమే కాకుండా, వైరల్ ట్రెండ్ గా మారాయి ఈ గిబ్లీ స్టైల్ ఏఐ చిత్రాలు. సినిమా సీన్ల దగ్గర నుంచీ పర్సనల్ చిత్రాల వరకూ అన్నింటినీ ఈ టెక్నాలజీ ని వాడి గిబ్లీ స్టైల్ లోక్కి మార్చి సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు చాలామంది.

అయితే, మనం అప్లోడ్ చేసి మరిచిపోయే ఈ ఫోటోలు ఎంత వరకూ సురక్షితంగా ఉంటాయి? వీటిని ఏవైనా తప్పుడు పనులకు ఉపయోగించవచ్చా అంటే అవునంటున్నారు నిపుణులు. ఇంటర్నెట్, డేటా నిపుణులు, మన డేటా సురక్షతపైన ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

డేటా గోప్యత, భద్రతపై పనిచేసే ప్లాట్‌ఫారమ్ అయిన ప్రోటాన్, Xలో ఇలా పోస్ట్ చేసింది, "మనం అప్లోడ్ చేసిన ఫోటో లు ఏఐ కు శిక్షణ ఇవ్వడానికి ఈ చిత్రాలను డేటా లా ఉపయోగిస్తాయి. వీటిని అవి ఎలా వాడుతాయనేదానిపైన మనకు నియంత్రణ ఉండదు. ఉదాహరణకు, అవి మన పరువు తీసే విధంగా లేదా ఇతరులను వేధించేందుకు ఉపయోగించబడే కంటెంట్‌గా మారవచ్చు."

AI ఇమేజ్-జనరేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నప్పుడు, యూజర్లు తమ వ్యక్తిగత డేటాను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి.

  • తెలియని ప్లాట్‌ఫారమ్‌ల పైన ప్రైవేట్ ఫోటోలను అప్‌లోడ్ చేసే ముందు రెండుసార్లు ఆలోచించండి. అయితే, ఏదైన ఫోటో అప్లోడ్ చేయాల్సి వస్తే మీరు ఒకదాన్ని అప్‌లోడ్ చేయవలసి వస్తే, AI శిక్షణ కోసం వాడగలిగేట్టు అధిక-రిజల్యూషన్ (HD) చిత్రాన్ని షేర్ చేయకండి.
  • వారు మీ డేటాను ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోవడానికి ప్లాట్‌ఫారమ్ గోప్యతా విధానాలను (Privacy Policies) పూర్తిగా చదివి అర్ధం చేసుకోండి. మీ డేటా ఎలా ఉపయోగించబడుతుందో అర్ధం అవుతుంది. మీ డేటాను నిల్వ చేయని ప్లాట్‌ఫారమ్‌లను ఎంచుకోండి.
  • యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు, అవి కేమరా, గ్యాలరీ యాక్సెస్లను తొలగించండి. మీ ఫోటో ఆన్‌లైన్‌లో దుర్వినియోగం కాలేదని నిర్ధారించుకోవడానికి రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించండి.

ChatGPT, Grok 3 గోప్యతా ఆందోళన ప్రశ్నలకు ఏమని సమాధానం ఇచ్చాయి?

దాని స్టూడియో గిబ్లీ-శైలి ఇమేజ్ జనరేటర్‌ను ఉపయోగించడం వల్ల భద్రత గురించి ప్రాంప్ట్ చేసినప్పుడు, డేటా విధానాలు స్పష్టంగా నిర్వచించబడకపోతే "ఏదైనా ఆఈ సాధనంలోకి వ్యక్తిగత ఫోటోలను అప్‌లోడ్ చేయడం సురక్షితం కాదు" అని ChatGPT హిందూస్తాన్ టైమ్స్‌తో చెప్పింది.

చాట్‌బాట్ ను డేటా గురించి ప్రశ్నలు అడిగినప్పుడు, అది ఇలా సమాధనాలు ఇచ్చింది “ఓపెనాఈ ఒక సెషన్‌కు మించి, అందులో అప్‌లోడ్ చేసిన చిత్రాలను నిలుపుకోదు లేదా ఉపయోగించదు, కానీ ఏఐ ప్లాట్ ఫార్మ్ లలో సున్నితమైన లేదా వ్యక్తిగత చిత్రాలను షేర్ చేయకుండా ఉండటం ఉత్తమం. ఆఫ్‌లైన్ సాధనాలు లేదా సురక్షితమైన ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లను ఉపయోగించడాన్ని పరిగణించండి.” ముఖ్యంగా, Open AI ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

అదే ప్రశ్నకు సమాధానమిస్తూ, గ్రోక్ 3 చిత్రాలను ఎన్ని రోజులు వాడుకుంటుందో పేర్కొనలేదు, డేటా "ఉల్లంఘనలకు గురయ్యే అవకాశం ఉంది" అని చెప్పింది. జాగ్రత్త పడకపోతే, ఆఈ సాధనాలను మెరుగుపరచడానికి మీ చిత్రాలను ఉపయోగించవచ్చని తెలుసుకోవడం ఎంతో మంచిది.

దుర్వినియోగం ఉద్దేశపూర్వకంగా జరుగకపోవచ్చు, కానీ వినియోగదారులు సున్నితమైన వివరాలతో ఫోటోలను అప్‌లోడ్ చేయకుండా ఉండటం ఉత్తమం అని నిపుణులు చెప్తున్నారు.

Tags:    

Similar News