సెమిస్ లో చేతులెత్తేసిన టీం ఇండియా టాప్ ఆర్డర్ … ఫైనల్ కి కివీస్ …

ప్రపంచ కప్ సెమిస్ లో భారత్ ను 18 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ కు చేరుకుంది న్యూజిలాండ్. కోహ్లీ సేన ఫైనల్ చేరుతుందన్న అంచనాలతో ఎన్నో [more]

Update: 2019-07-10 16:53 GMT

ప్రపంచ కప్ సెమిస్ లో భారత్ ను 18 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ కు చేరుకుంది న్యూజిలాండ్. కోహ్లీ సేన ఫైనల్ చేరుతుందన్న అంచనాలతో ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానుల అంచనాలను కివీస్ తలకిందులు చేసింది. వర్షం కారణంగా మాంచెస్టర్ లో నిన్న మొదలై 46.1 ఓవర్లు మాత్రమే జరిగిన మ్యాచ్ లో కివీస్ 211 పరుగులు సాధించింది. తిరిగి ఈ రోజు మిగిలిన 3.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. బౌలర్లకు స్వర్గధామం గా నిలిచిన ఎడ్జ్ బస్టన్ పిచ్ పై ఈ స్కోర్ ఎంతటి విలువైందో టీం ఇండియా బ్యాటింగ్ ప్రారంభించాకా అందరికి అర్ధమైంది.

లైన్ కట్టిన టీం ఇండియా బ్యాట్స్ మెన్ ….

240 పరుగుల లక్ష్యంగా రంగం లోకి దిగిన టీం ఇండియా ను కివీస్ బౌలర్లు ఆరంభంలోనే గట్టి దెబ్బ తీశారు. హెన్రి, బౌల్ట్ లు చెలరేగడంతో ఒకే ఒక్క పరుగు చేసి రోహిత్ శర్మ, కె ఎల్ రాహుల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ క్యూ కట్టి భారత్ ఫైనల్ ఆశలకు సమాధి కట్టేశారు. లీగ్ దశలో ఈ ముగ్గురే 70 శాతం కు పైగా భారత్ కు పరుగుల వరద పారించినవారు కావడంతో మ్యాచ్ చేజారినట్లే అన్నది తేలిపోయింది. ఆ దశలో మిడిల్ ఆర్డర్ లో వచ్చిన దినేష్ కార్తిక్ సైతం వెనుతిరగడంతో నాలుగు వికెట్లను స్వల్ప స్కోర్ కె కోల్పోయి టీం ఇండియా విలవిలాడింది. ఈ దశలో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య ల జోడి కొంతసేపు మెరుపులు మెరిపించినా వారిద్దరూ కూడా పెద్ద భాగస్వామ్యం నెలకొల్పకుండానే కివీస్ బౌలర్లు దెబ్బ మీద దెబ్బ కొట్టి ఇద్దర్ని పెవిలియన్ బాటపట్టించారు .

అద్వితీయ ఆటతీరుతో ఆకట్టుకున్న జడేజా ధోని ...

ఆరు వికెట్లు చేజార్చుకున్న టీం ఇండియా పని ఇక అయిపొయింది అనుకుని అంతా భావిస్తున్న తరుణంలో ధోని – జడేజా 100 పరుగులకు పైగా భాగస్వామ్యంతో మ్యాచ్ ను తిరిగి పోరాటంలో నిలిపారు. రన్ రేట్ పెంచే క్రమంలో జడేజా, ఆ తరువాత ధోని 50 పరుగులతో వెనుతిరగడం ఆ వెంటనే భువనేశ్వర్, చాహల్ లైన్ కట్టేయడంతో కివీస్ ఫైనల్ కి 18 పరుగుల తేడాతో చేరిపోయింది. అయితే మధ్యలోనే చేతులు ఎత్తేస్తుంది అనుకున్న టీం ఇండియా చివరి ఓవర్ వరకు పోరాటం చేయడం అభిమానులకు కొంతలో కొంత ఆనందాన్ని మిగిల్చింది. లీగ్ దశలో ఒకే ఒక్క ఓటమి చెంది ఫైనల్ గ్యారంటీ అనుకున్న కోహ్లీ సేన, సెమిస్ లో ఈ రకమైన ఓటమిని మాత్రం అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

Tags:    

Similar News