అదే జరిగితే ఫైనల్స్ కు ఇండియా … !!

క్రికెట్ అభిమానులను నిరాశపరుస్తూ ఇంగ్లాండ్ లో జరుగుతున్న భారత్ – న్యూజిలాండ్ సెమి ఫైనల్ మ్యాచ్ కి వరుణుడు అడ్డంగా నిలిచాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ [more]

Update: 2019-07-10 01:51 GMT

క్రికెట్ అభిమానులను నిరాశపరుస్తూ ఇంగ్లాండ్ లో జరుగుతున్న భారత్ – న్యూజిలాండ్ సెమి ఫైనల్ మ్యాచ్ కి వరుణుడు అడ్డంగా నిలిచాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న విలియమ్సన్ సేనను కోహ్లీ సేన భారీ పరుగులు చేయకుండా అడ్డుకుంది. వర్షం కురిసి మ్యాచ్ నిలిచిపోయే సమయానికి న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 211 పరుగులు మాత్రమే చేయగలిగింది. విలియమ్సన్ 67 పరుగులు చేసి అవుట్ కాగా రాస్ టేలర్ 67 నాటౌట్ అండతో గౌరవప్రదమైన స్కోర్ కి చేరుకుంది. భారత్ బౌలర్లలో బుమ్రా, భువనేశ్వర్, జడేజా, చాహల్, పాండ్య తలో వికెట్ పడగొట్టి అతి పొదుపుగా బౌలింగ్ చేశారు. వీరిలో బుమ్రా, భువనేశ్వర్, జడేజా లు అద్భుతంగా కివీస్ టాప్ ఆర్డర్ ను కట్టడి చేసి తమ బాధ్యత పూర్తి చేసే క్రమంలో చివరి నాలుగు ఓవర్లు మిగిలివుండగా వర్షం ఆటను బ్రేక్ వేసింది.

మ్యాచ్ నిలిచిపోతే …

మంగళవారం అంతా వర్షం కురిస్తే రెండోరోజు బుధవారం రిజర్వ్ డే రోజు మిగిలిన మ్యాచ్ ను కొనసాగిస్తారు. కనీసం 20 ఓవర్ల మ్యాచ్ జరిగితే టీం ఇండియా లక్ష్యం 148 పరుగులు ఉండనుంది. రిజర్వ్ డే నాడు వర్షం పూర్తిగా కురిస్తే మాత్రం లీగ్ దశలో టేబుల్ లో 15 పాయింట్లతో టాప్ లో వున్న టీం ఇండియా ను విజేతగా ప్రకటించి నేరుగా ఫైనల్ కు పంపిస్తారు. లీగ్ దశలో 11 పాయింట్లలో ఉండటం సెమిస్ లో నాలుగో బెర్త్ దక్కించుకున్న కివీస్ కు మ్యాచ్ పూర్తిగా జరిగితే తమ బౌలర్లతో రాణించి మ్యాచ్ దక్కించుకోవాలి తప్ప వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మాత్రం టీం ఇండియా కే లాభం. అసలే అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన సెమిఫైనాన్ల్ మ్యాచ్ పై వరుణుడు నీళ్ళు చల్లడం అందరిని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది.

Tags:    

Similar News