గట్టెక్కడానికి అదే శరణ్యమా…??
కర్టాటకలో మళ్లీ క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి ఏడాదికిపైగానే అయినప్పటికీ ఎక్కువ కాలం ఎమ్మెల్యేలు రిసార్ట్ లోనే గడిపారన్న సెటైర్లు సోషల్ మీడియాలో బలంగా [more]
కర్టాటకలో మళ్లీ క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి ఏడాదికిపైగానే అయినప్పటికీ ఎక్కువ కాలం ఎమ్మెల్యేలు రిసార్ట్ లోనే గడిపారన్న సెటైర్లు సోషల్ మీడియాలో బలంగా [more]
కర్టాటకలో మళ్లీ క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి ఏడాదికిపైగానే అయినప్పటికీ ఎక్కువ కాలం ఎమ్మెల్యేలు రిసార్ట్ లోనే గడిపారన్న సెటైర్లు సోషల్ మీడియాలో బలంగా ఇప్పటికీ విన్పిస్తాయి. తాజాగా మరోసారి రిసార్టులకు బయలుదేరి వెళుతున్నారు. కర్ణాటకలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ పార్టీలు అప్రమత్తమయినప్పటికీ ఎమ్మెల్యేలు చేజారి పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇందుకు కారణాలు స్థానిక నాయకత్వం వైఖరే కారణమన్న వ్యాఖ్యలు బాహాటంగా చెబుతున్నారు.
బలం తక్కువగా ఉండటంతో….
కర్ణాటకలో మొత్తం 224 శాసనసభ స్థానాలున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 105 స్థానాలను గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. తర్వాత కాంగ్రెస్ 80 స్థానాలతో రెండో స్థానంలో ఉంది. దేవెగౌడ కు చెందిన జనతాదళ్ ఎస్ 37 స్థానాలను దక్కించుకుని ముఖ్యమంత్రి పదవిని దక్కించుకుంది. అప్పటి నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకోలేక కాంగ్రెస్ అష్టకష్టాలు పడుతోంది. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసంతృప్తులు ఎక్కువగానే ఉంటారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి బుజ్జగింపులకే ఎక్కువ సమయం కేటాయిస్తూ వస్తోంది.
నష్టనివారణ చర్యలు…..
తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేష్ జార్ఖిహోళి, ఆనంద్ సింగ్ ల రాజీనామాలతో కాంగ్రెస్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. రమేష్ జార్ఖిహో్ళికి సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అగ్రనేత రాహుల్ గాంధీ నేరుగా అసంతృప్త ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా రమేష్ జార్ఖిహోళికి సన్నిహితంగా ఉండే అసంతృప్త ఎమ్మెల్యే నాగేంద్రకు మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అవసరమైతే సీనియర్ నేతలను మంత్రివర్గం నుంచి తప్పించి అయినా అసంతృప్త నేతలకు మంత్రి పదవులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్లు చెబుతున్నారు.
రిసార్టుకు తరలించేందుకు….
ఇక అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు నేరుగా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య రంగంలోకి దిగారు. నారాయణగౌడ, శ్రీమంతపాటిల్, బిసి పాటిల్, మహేష్ కుమటహళ్లి, గణేష్, మహదేవ్, ప్రతాప్ గౌడ పాటిల్, బసవరాజ్, భీమానాయక్, ప్రతాప్ గౌడ, అమరే గౌడ వంటి నేతలను సిద్ధరామయ్య బుజ్జగించారు. నేరుగా పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి వేణుగోపాల్ తో మాట్లాడిస్తున్నారు. మరోవైపు జనతాదళ్ ఎస్ ఎమ్మెల్యేలతో దేవెగౌడ కూడా భేటీ అయ్యారు. రెండు పార్టీల నేతలు తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉండటంతో దేవెగౌడ పార్టీ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉంటున్నారు. మొత్తం మీద కర్ణాటకలో రాజకీయం ఏ క్షణాన ఏమలుపు తిరుగుతుందోనన్న ఆందోళన ప్రధానంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ లలో నెలకొంది.