నోటి తుత్తర.. నాలుగు ఊచలు.. జేసీకి చేటుతెచ్చిందదే
నోటి తుత్తర.. ఇది ఎంత పనిచేస్తుందంటే…. తమ ఇలాకాలో కాలర్ ఎగరేసుకు తిరిగేవారినైనా కుదేలు చేస్తుంది. అందుకే నోరు అదుపులో పెట్టుకోమంటారు పెద్దలు. ఇది చిన్న వారి [more]
నోటి తుత్తర.. ఇది ఎంత పనిచేస్తుందంటే…. తమ ఇలాకాలో కాలర్ ఎగరేసుకు తిరిగేవారినైనా కుదేలు చేస్తుంది. అందుకే నోరు అదుపులో పెట్టుకోమంటారు పెద్దలు. ఇది చిన్న వారి [more]
నోటి తుత్తర.. ఇది ఎంత పనిచేస్తుందంటే…. తమ ఇలాకాలో కాలర్ ఎగరేసుకు తిరిగేవారినైనా కుదేలు చేస్తుంది. అందుకే నోరు అదుపులో పెట్టుకోమంటారు పెద్దలు. ఇది చిన్న వారి నుంచి పెద్దవారికి వర్తిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంటారు. ఇన్ని సూక్తులు తెలిసిన ఆ పెద్దాయన మాత్రం తన నోరును మాత్రం అదుపులో పెట్టుకోలేకపోతున్నారు. ఫలితం నాలుగు ఊచలు లెక్కపెట్టుకుంటున్నారు. ఇదీ తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి పరిస్థితి. జేసీ ప్రభాకర్ రెడ్డి నోరే ఆయనకు చేటును తెచ్చిపెట్టిదనడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు.
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు…..
తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి విర్రవీగారు. జగన్ అధికారంలోకి రాలేరన్న ధైర్యం కావచ్చు. వచ్చినా తనను టచ్ చేయడన్న మొండి ధైర్యం కావచ్చు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ను అనేక దుర్భాషలాడారు. రాయటానికి వీలులేనంత పదజాలాన్ని వాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో అప్పట్లో హల్ చల్ చేసింది. అది విన్న వైసీపీ క్యాడర్ రక్తం ఉడికినా ఏమీ అనలేని… చేయలేని పరిస్థితి. అలాంటి పదజాలాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి వాడారు.
జగన్ ముఖ్యమంత్రి కావడంతో….
కట్ చేస్తే.. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అచ్చెన్నాయుడు తర్వాత అరెస్ట్ జేసీ ప్రభాకర్ రెడ్డిదే. వాహనాల రిజిస్ట్రేషన్ కేసులో ఆయనతో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. దాదాపు ఈ కేసులో 56 రోజులు జైలు జీవితం గడిపారు. జైలులో గడిపిన రోజుల్లోనైనా జేసీ ప్రభాకర్ రెడ్డి నైజంలో మార్పు వచ్చి ఉండాల్సింది. చిప్పకూడు కూడా ఆయన నోటి తుత్తరను తగ్గించలేదు. ఇలా జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మళ్లీ అదే జైలుకు 24 గంటల్లో వెళ్లాల్సి వచ్చింది.
బెయిల్ వచ్చినా….
ఇందుకు కారణం కూడా నోటితుత్తరే. కడప జైలు నుంచి బెయిల్ పై విడుదలయిన జేసీ పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ పెద్ద ర్యాలీ నిర్వహించారు. అంతటితో ఊరుకున్నాడా? తన కాన్వాయ్ ఆపిన పోలీసు అధికారిని బండ బూతులు తిట్టేశారు. ఫలితం మళ్లీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు. తిరిగి జైలుకి. దీంతో తమ్ముడి నోటు చేటు తెచ్చి పెట్టిందని తెలుసుకున్న మరో పెద్దాయన జేసీ దివాకర్ రెడ్డి సయితం నోటి దురదను తగ్గించుకున్నారు. అరెస్ట్ పై ఏం మాట్లాడితే ఏం వస్తుందోనని మౌనంగా ఉన్నారు. ఇలా జేసీ ప్రభాకర్ రెడ్డి నోటి తుత్తరే ఆయనను కటకటాలపాలు చేసేసింది.