పాపం నడ్డా

నిన్న మొన్నటి వరకూ ఆయనను మంచి స్ట్రాటజిస్ట్ గానే బీజేపీ భావించింది. అమిత్ షా, మోడీలకు నమ్మకమైన వ్యక్తి కావడంతో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష్య [more]

Update: 2020-02-19 18:29 GMT

నిన్న మొన్నటి వరకూ ఆయనను మంచి స్ట్రాటజిస్ట్ గానే బీజేపీ భావించింది. అమిత్ షా, మోడీలకు నమ్మకమైన వ్యక్తి కావడంతో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష్య పదవి దక్కింది. అప్పటి వరకూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జేపీ నడ్డా ఢిల్లీ ఎన్నికలకు ముందు జాతీయ అధ్యక్షుడయ్యారు. అయితే పదవి చేపట్టిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లోనే ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే ఇందుకు జేపీ నడ్డా బాధ్యత కాకున్నా ఆయన నాయకత్వంపై నెగిటివ్ ప్రచారం జరుగుతుందన్నది మాత్రం వాస్తవం.

ఘోర ఓటమితో….

నిజానికి ఢిల్లీ ఎన్నికల్లో ఇంత ఘోర ఓటమిని చవిచూస్తామని బీజేపీ అగ్రనేతలు ఊహించలేదు. ముఖ్యంగా అమిత్ షా దాదాపు యాభై రోడ్ షోలలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగారు. 200 మంది వరకూ పార్లమెంటు సభ్యులను ప్రచారంలోకి దించారు. ఇక ఆర్ఎస్ఎస్ చాప కింద నీరులా గత కొంతకాలంగా ప్రచారంలోనే ఉండనే ఉంది. పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కూడా ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు. అయినా ఫలితం లేదు.

ఢిల్లీ ఫలితాల ప్రభావం…..

వారి ఆలోచనలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. ఢిల్లీ ప్రజలు అమిత్ షా, మోడీకి షాక్ ఇచ్చారు. కేవలం ఆరు సీట్లకే ఢిల్లీలో పరిమితమయ్యారు. ఇది ఢిల్లీ వరకే పరిమితమయితే ఓకే. కాని రానున్న బీహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపితే మాత్రం బీజేపీికి కష్టకాలమే. ఇప్పటికే మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీజేపీ వరసగా అన్ని రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోతూ వస్తుంది. ఇదే కొనసాగితే రానున్న కాలంలో కమలానికి గడ్డు పరిస్థితులు తప్పవు.

రానున్న ఎన్నికల్లో…..

ఢిల్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం జేపీ నడ్డాపై పెద్దగా చూపకపోవచ్చు. రానున్న బీహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మాత్రం జేపీ నడ్డాకు సవాల్ అనే చెప్పాలి. ఎందుకంటే అమిత్ షా, మోదీలు వ్యూహ సహకారం నడ్డాకు అందించినప్పటికీ ఫలితాలు అనుకూలంగా రాకపోతే మాత్రం ఆ అపవాదును నడ్డా భరించాల్సి ఉంటుంది. అమిత్ షా తో పోల్చి చూస్తే నడ్డా నేతలు, క్యాడర్ విషయంలో తేలిపోక తప్పదు. అందుకే భవిష్యత్తు నడ్డాకు కష్టకాలమేనని చెప్పకతప్పదు.

Tags:    

Similar News