నమ్మకస్థుడు నడ్డా

జగత్ ప్రకాష్ నడ్డా…. త్వరలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు కానున్నారు. జేపీ నడ్డాకు భారతీయ జనతా పార్టీలో మంచి వ్యూహకర్తగా పేరుంది. ఇప్పటి వరకూ [more]

Update: 2020-01-14 16:30 GMT

జగత్ ప్రకాష్ నడ్డా…. త్వరలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు కానున్నారు. జేపీ నడ్డాకు భారతీయ జనతా పార్టీలో మంచి వ్యూహకర్తగా పేరుంది. ఇప్పటి వరకూ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జేపీ నడ్డా ఇకపై పూర్తి స్థాయి అధ్యక్ష్య బాధ్యతలను చేపడతారు. ప్రస్తుత అధ్యక్షుడు అమిత్ షా నుంచి జేపీ నడ్డా పూర్తి స్థాయిలో బాధ్యతలను స్వీకరించనున్నారు. నడ్డా రాజకీయ ప్రస్థానం ఏబీవీపి నుంచి ప్రారంభమయింది.

ఏబీవీపీ నుంచి…..

పాట్నాలో 1960లో జన్మించిన జేపీ నడ్డా 1975లో రాజకీయాల్లోకి వచ్చారు. జయప్రకాష్ నారాయణ ఆశయాలకు ఆకర్షితుడై నడ్డా రాజకీయాల్లోకి వచ్చారు. పాట్నా యూనివర్సిటీలో బీఏ ఎల్ఎల్బీ చదివిన నడ్డా అదే యూనివర్సిటీలో ఏబీవీపీ నేతగా ఎన్నికయ్యారు. నడ్డా తండ్రి ఎన్ఎల్ నడ్డా పాట్నా యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ గా పనిచేశారు. జాతీయ యువమోర్చా అధ్యక్షులుగా కూడా నడ్డా పనిచేశారు. 2012లో హిమాచల్ ప్రదేశ్ నుంచి జేపీ నడ్డా రాజ్యసభకు ఎంపికయ్యారు.

యూపీ ఇన్ ఛార్జిగా…..

నరేంద్రమోడీ 2014లో తొలిసారి ప్రధాని మంత్రి అయినప్పుడు ఆయన మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన బీజేపీ పార్లమెంటరీ కార్యదర్శి కూడా పనిచేశారు. గతంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జేపీ నడ్డా ఉత్తరప్రదేశ్ కు ఇన్ ఛార్జి బాధ్యతలను స్వీకరించి 80 స్థానాలకు గాను 62 స్థానాలను గెలిచేలా జేపీ నడ్డా వ్యవహరించారు. 2019 జులైలో జేపీ నడ్డా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు.

వ్యూహకర్తగా పేరున్నా…..

జేపీ నడ్డాకు వ్యూహకర్తగా పేరున్నా ఇటీవల హర్యానా ఎన్నికల్లో తక్కువ స్థానాలను గెలుచుకోవడం, జార్ఖండ్ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం కొంత ఇబ్బందిగా మారింది. అయినా మోదీ, షాలకు అత్యంత నమ్మకస్తుడైన నడ్డానే బీజేపీ అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయించారు. నడ్డా వల్ల పెద్దగా పార్టీకి ఉపయోగం ఉండదు… నష్టం ఉండదన్నది పార్టీ నేతల అభిప్రాయం. ఆయన వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళతారన్నది చూడాల్సి ఉంది. నడ్డా అధ్యక్ష పదవిలో ఉన్నప్పటికీ ఆయన షా, మోడీల ఆదేశాలను మాత్రమే పాటించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News