Huzurabad : స్పీచ్ సెంటిమెంట్… రిపీట్ అవుతుందా?

హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం ఈరోజు తో ముగియనుంది. అయితే ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారంలో పాల్గొనలేక పోయారు. నిజానికి 27వ తేదీన కేసీఆర్ బహిరంగ సభను [more]

Update: 2021-10-27 09:30 GMT

హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం ఈరోజు తో ముగియనుంది. అయితే ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారంలో పాల్గొనలేక పోయారు. నిజానికి 27వ తేదీన కేసీఆర్ బహిరంగ సభను హుజూరాబాద్ లో నిర్వహించాలనుకున్నారు. కానీ ఎన్నికల కమిషన్ నిబంధనల కారణంగా తన హుజూరాబాద్ పర్యటనను కేసీఆర్ వాయిదా వేసుకున్నారు. కేసీఆర్ హుజూరాబాద్ కు వెళ్లకుండానే ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇది సెంటిమెంట్ గా బీజేపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి.

దుబ్బాక లో ఓటమి….

గతంలో దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నిక ప్రచారానికి కూడా కేసీఆర్ దూరంగా ఉన్నారు. అయితే ఆరోజు కోవిడ్ నిబంధనలు కాకపోయినా కావాలనే ఆయన ప్రచారానికి వెళ్లలేదు. దీంతో ఆ ఎన్నికల్లో అక్కడ బీజేపీ అనూహ్యంగా స్వల్ప ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించింది. కేసీఆర్ కూడా ఇది ఊహించలేదు. హరీశ్ రావుపైనే పూర్తిగా భారమంతా వదిలేశారు. కేసీఆర్, హరీశ్ రావు సొంత నియోజకవర్గాలను ఆనుకుని ఉన్న దుబ్బాక ఓటమిని కేసీఆర్ కొంతకాలం స్వీకరించలేకపోయారు.

స్పీచ్ ఇచ్చిన చోట….

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి కూడా వెళ్లారు. అక్కడ కూడా కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకున్నారు. ఇక వెనువెంటనే వచ్చిన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్ వెళ్లారు. అక్కడ జానారెడ్డి వంటి సీనియర్ నేత ఎదుట నోముల నరసింహయ్య కుమారుడు భరత్ ను పోటీకి దింపారు. సాగర్ ఉప ఎన్నికల్లో రెండు సార్లు కేసీఆర్ బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. స్పీచ్ తో సెంటిమెంట్ ను రగిలించారు. దీంతో దుబ్బాకలో దక్కిన ఓటమి సాగర్ లో దూరం చేయగలిగారు. సాగర్ కు కేసీఆర్ రావడం వల్లనే గెలిచారన్న సెంటిమెంట్ బలపడిపోయింది.

ప్రచారానికి వెళ్లకపోవడంతో…

ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక. ఇక్కడ కూడా బీజేపీ తరుపున బలమైన అభ్యర్థి ఈటల రాజేందర్ ఉన్నారు. కానీ కేసీఆర్ ప్రచారానికి వెళ్లలేదు. ఇక్కడ కూడా పూర్తి బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించారు. దీంతో సెంటిమెంట్ మరోసారి పనిచేస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు. హుజూరాబాద్ లోనూ దుబ్బాక ఫలితమే రిపీట్ అవుతుందని, ఓటమి భయంతోనే కేసీఆర్ హుజూరాబాద్ రాలేదని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద కేసీఆర్ స్పీచ్ సెంటిమెంట్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News